పోరు వాక పొలం వదలి వీధికెక్కిన రైతన్న విత్తనం కోసం రైతన్న అగచాట్లు..

http://www.andhrajyothy.com/mainnewsshow.asp?qry=2012/jun/21/main/21main1&more=2012/jun/21/main/main&date=6/21/2012

ధర్నాలు, ఆందోళనలు, నిలదీతలు

మార్చిలోనే చేతులెత్తేసిన మహికో..
ప్రత్యామ్నాయంపై సర్కారు ఉదాసీనత
బ్లాక్ మార్కెట్ పాపం డీలర్లదే అంటున్న విత్తన కంపెనీలు
వరంగల్ జిల్లాలో సోదాలు..
‘నల్ల’ విత్తనాల పట్టివేత, కేసులు నమోదు
ఖరీఫ్ పర్యవేక్షణపై మంత్రి కన్నా దృష్టి.. అమెరికా పర్యటన రద్దు
రుతు పవనాలకు ‘ఎల్‌నినో’ గండం.. ఆగస్టు చివరి నుంచి ప్రతికూలతలు?
కృష్ణా డెల్టాకు నీటి కష్టాలు.. ఇన్‌పుట్ సబ్సిడీపై సీఎం సమీక్ష
పంపిణీ వేగవంతం చేయాలని ఆదేశం..
సరిపడా ఎరువులున్నాయని భరోసా

ఏరువాక… దానితోపాటే మొదలైన పోరువాక! విత్తనాల దగ్గరే రైతు చిత్తు చిత్తు! విత్తనాలున్నాయని ప్రభుత్వం చెబుతుంది. కానీ… రైతు కోరుకునే విత్తనాలు మాత్రం బ్లాక్ మార్కెట్‌కు వెళ్లిపోయాయి. ఈ సమస్య అలా ఉండగానే… ఎరువుల దరువు మొదలైంది. బుధవారం అటు విత్తనాలు, ఎరువుల ధరలపై పలు జిల్లాల్లో రైతులు రోడ్డెక్కారు. ఆందోళనలకు దిగారు. విత్తన సమస్యపై మంగళవారం ఏబీఎన్‌లో మంత్రి కన్నా లక్ష్మీనారాయణతో రైతులు స్వయంగా తమ గోడు వినిపించుకున్నారు. బ్లాక్ మార్కెట్ బండారాన్ని బయటపెట్టారు. మంత్రి ఆదేశాలతో అధికారులు కదిలారు. వరంగల్ జిల్లాలో ‘నల్ల’ విత్తనాలను బయటపెట్టారు. ఖరీఫ్ సీజన్ ఊపందుకున్న నేపథ్యంలో… ఈనెల 29 నుంచి వెళ్లాల్సిన అమెరికా పర్యటనను కన్నా రద్దు చేసుకున్నారు.

హైదరాబాద్, జూన్ 20 : తొలకరి తర్వాత సజావుగా ఏరువాక సాగించాల్సిన అన్నదాత అష్టకష్టాలు పడుతున్నాడు. ప్రకృతి కరుణించినా..విత్తనాలు, ఎరువుల కొరత, అధిక ధరలు, నకిలీ విత్తనాల సమస్యతో తల్లడిల్లుతున్నాడు. మెదక్‌లోని జహీరాబాద్‌లో జనుము, సోయాబీన్ విత్తనాల కోసం రైతులు వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేశారు. నారాయణఖేడ్‌లో సోమవారం విత్తనాల కోసం టోకెన్లు పొందిన రైతులు బుధవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు షాపుముందే పడిగాపులు పడి నిరాశగా వెనుదిరిగారు. నర్సాపూర్‌లో విత్తనాలు అందుబాటులో లేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. సోయా విత్తనాలు సరిపడా రాకపోవడంతో నిజామాబాద్ జిల్లా రైతులు ప్రతీరోజు రోడ్డెక్కుతున్నారు.

బిచ్కుందలో వ్యవసాయ శాఖ కార్యాలయానికి తాళం వేసి ఉండడంతో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు పడిగాపులు కాసిన రైతులు.. అధికారులు రాకపోవడంతో ఆగ్రహం చెంది ధర్నా చేశారు. అలాగే బాల్కొండలో రైతులు తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించారు. కాగా, ఖమ్మం జిల్లా కారేపల్లి మండలంలో మహారాష్ట్రకు చెందిన నకిలీ నీరజ, బ్రింట్ రకం విత్తనాలు వేసి రైతులు మోసపోయారు. కారేపల్లి విత్తన దుకాణం వద్దకు వెళ్లి గొడవ చేయడంతో యజమానులు కొందరికి డబ్బు, మరికొందరికి వేరే బీటీ విత్తనాలను అందించారు.

ఎరువుల ధరలపైనా ఆందోళన..
ఎరువులను అధిక ధరలకు విక్రయించడంపై కూడా రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధిక ధరలపై మహబూబ్‌నగర్ రైతులు కన్నెర్ర చేశారు. సీపీఐ ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు. బిజినేపల్లి మండలం లట్టుపల్లికి చెందిన భద్రయ్య అనే రైతు మండల కేంద్రంలోని వెంకటేశ్వర ఫర్టిలైజర్స్‌లో ఎనిమిది డీఏపీ సంచులను కొనుగోలు చేశాడు. అందుకు రూ.8,016 తీసుకోవాల్సి ఉండగా.. దుకాణం యజమాని 9,300 తీసుకొని రసీదు ఇచ్చాడు. వెల్గండకు చెందిన కృష్ణారెడ్డి డీఏపీ బస్తాను కొనుగోలు చేయగా రూ.1002కు గాను 1,260 తీసుకున్నాడు. విషయం తెలుసుకున్న సీపీఐ కార్యకర్తలు అక్కడికి చేరుకుని ధర్నా చేశారు.

ఏడీఏ ఆంజనేయులుగౌడ్, ఏవో హరినాథ్ సంఘటనా స్థలానికి చేరుకోగా దాడికి దిగారు. అనంతరం ఏడీఏ, ఏవో.. దుకాణంలోని రికార్డులను పరిశీలించి స్వాధీనం చేసుకున్నారు. నిజామాబాద్ జిల్లా కామారెడ్డిలోని విత్తన, ఎరువుల దుకాణాలపై విజిలెన్స్ అధికారులు బుధవారం ఆకస్మిక దాడులు నిర్వహించారు. రైతులు ఎక్కువ ధరకు ఎరువులు కొని రసీదులు తీసుకున్న కొద్ది సేపటికే రాష్ట్ర విజిలెన్స్ అధికారి అశోక్‌కుమార్ ఆధ్వర్యంలో.. మూడు దుకాణాలపై దాడులు చేసి బస్తాలను స్వాధీనం చేసుకున్నారు.

కాగా, మహబూబ్‌నగర్ జిల్లా అచ్చంపేటలో అనిల్ ట్రేడర్స్ ఎరువులను అధిక ధరలకు అమ్ముతోందంటూ బుధవారం మంత్రి కన్నాకు ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన మంత్రి.. వెంటనే పరిశీలించి నివేదిక పంపాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. కాగా, ప్రస్తుతం రాష్ట్రంలో 7.82 లక్షల టన్నుల ఎరువులు నిల్వ ఉన్నట్లు వ్యవసాయ శాఖ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొంది. అందులో డీలర్లు, మార్క్‌ఫెడ్ వద్ద కలిపి యూరియా 1.55 లక్షలు, కాంప్లెక్స్ 3.68 లక్షలు, యూరియా 1.94 లక్షలు, ఎంఓపీ 62600 టన్నులు నిల్వ ఉన్నట్లు తెలిపింది.

బిగ్ డిబేట్‌తో అధికారుల్లో కదలిక
‘ఏబీఎన్ – ఆంధ్రజ్యోతి’ ఎండీ వేమూరి రాధాకృష్ణ మంగళవారం నిర్వహించిన ‘బిగ్ డిబేట్’ సంచలనం సృష్టిస్తోంది. ఈ కార్యక్రమానికి వివిధ జిల్లాల నుంచి రైతులు ఫోన్ చేసి.. వ్యవసాయ శాఖ మంత్రి కన్నాతో మాట్లాడారు. వారంతా విత్తనాల బ్లాక్ మార్కెటింగ్‌పై ఫిర్యాదు చేయడంతో అధికార యంత్రాంగంలో కదలిక మొదలైంది. విత్తన కొనుగోళ్లలో రైతు దయనీయ స్థితిపై కొనసాగిన బిగ్‌డిబేట్‌లో మంత్రి కన్నా కూడా బ్లాక్ మార్కెటీర్లపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్లాక్ మార్కెటింగ్‌కు పాల్పడితే డీలర్‌లతో పాటు కంపెనీ యాజమాన్యంపై కేసులు పెట్టాలని ఆదేశించారు. దీంతో అధికారులు ఉరుకులు, పరుగులు ప్రారంభించారు.

వరంగల్ జిల్లా రెవెన్యూ, వ్యవసాయ, పోలీస్ శాఖలు సంయుక్తంగా ఆకస్మిక తనిఖీలు నిర్వహించాయి. బ్లాక్ మార్కెట్‌కు తరలిపోయిన పత్తి విత్తనాలను వెలుగులోకి తెచ్చే దిశగా ఈ దాడులు సాగాయి. తమ తనిఖీలను గురువారం కూడా కొనసాగించాలని అధికార యంత్రాంగం భావిస్తోంది. వరం గల్ జిల్లా కురవిలో మంగళవారం అర్ధరాత్రి నుంచి తెల్లవారే దాకా వ్యాపారుల రహస్య గోడౌన్‌లపై అధికారులు దాడులు చేశారు. ఈ దాడుల్లో దుర్గా ఫెర్టిలైజర్ షాపు, మరి కొందరి ఇళ్లలో విత్తన పాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. షాపును సీజ్ చేసి నల్లపు ఉపేందర్, నల్లపు రవి, గూడూరు ప్రసాద్‌లను అరెస్ట్ చేశారు.

ఈ ముగ్గురితో పాటు వీరికి విత్తనాలు సరఫరా చేసిన నల్గొండ జిల్లా సూర్యాపేటకు చెందిన జగన్మోహన్‌రెడ్డి, ఖమ్మంకు చెందిన నాగరాజులపై విత్తన చట్టం, 420 కేసులు నమోదు చేశారు. కాగా, వ్యవసాయదారులకు ఖరీఫ్‌లో కావాల్సిన వరి విత్తనాలను అందజేయడానికి ఆచార్య ఎన్జీ రంగా యూనివర్సిటీ సీడ్ రీసెర్చి టెక్నాలజీ సెంటర్ డైరెక్టర్ విష్ణువర్థన్ రెడ్డి బుధవారం ఆన్‌లైన్‌కు తెలిపారు. వివిధ ప్రాంతాల్లో గల పరిశోధన కేంద్రాల్లో విత్తనాలను రైతులకు అందుబాటులో ఉంచామని ఆయన చెప్పారు.

విత్తన కొరతను అధిగమించండి: సీఎం
హైదరాబాద్: ప్రస్తుత ఖరీఫ్‌సీజన్‌లో ఎరువులు, విత్తనాల కొరత రాకుండా చూడాలని వ్యవసాయశాఖ అధికారులను సీఎం కిరణ్ ఆదేశించారు. రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ పంపిణీని వేగవంతం చేయాలని. రైతుల వ్యక్తిగత ఖాతాలకే నేరుగా చేరేలా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. మధ్య దళారుల ప్రమేయం లేకపోవడంతో.. పారదర్శకంగా రైతుకు సబ్సిడీ అందుతుందని ఆయన పేర్కొన్నారు.

రాష్ట్రమంతటా విస్తారంగా వర్షాలు కురిసిన నేపథ్యంలో వివిధ శాఖల మంత్రులు, అధికారులతో బుధవారం ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. రైతులకు ఎరువులు, విత్తనాలు సరఫరా చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు సీఎంకు అధికారులు వివరించారు. డీఏపీ, కాంప్లెక్స్, యూరియా తదితర ఎరువులు అందుబాటులో ఉన్నాయన్నారు. 1.9 కోట్ల ప్యాకెట్ల పత్తి విత్తనాలను అందుబాటులో ఉంచామని చెప్పారు. వీటిలో ఇప్పటికే 60.73 లక్షల ప్యాకెట్ల పంపిణీ కూడా జరిగిందన్నారు.

5.43 లక్షల క్వింటాళ్ల వేరుశనగ విత్తనాలు అందుబాటులో ఉండ గా.. ఇప్పటికి 4.70 లక్షల క్వింటాళ్లు పంపిణీ జరిగిందని సీఎంకు చెప్పారు. ఎరువుల నిల్వలను పర్యవేక్షించేందుకు జిల్లా స్థాయిలో మానిటరింగ్ సెల్‌ను ఏర్పాటు చేశామని వివరించారు. రాష్ట్ర సరిహద్దుల్లో, ఇతర కీలక ప్రాంతాల్లో ఎరువుల రవాణాపై విజిలెన్స్ నిఘాను పెంచినట్లు తెలిపారు. ఈ సమావేశంలో వ్యవసాయశాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ, ముఖ్య కార్యదర్శి, కమిషనర్ పాల్గొన్నారు.

విత్తన ఇబ్బందితోనే మంత్రికి ఫోన్: రైతు సైదులు
“పత్తి విత్తనాల కోసం పడని పాట్లు లేవు. తిరగని షాపు లేదు. అయినా ఒక్క ప్యాకెట్ దొరికే పరిస్థితి లే దు” అని కురవి మండలం బలపాలకు చెందిన రైతు నామా సైదులు అన్నారు. “షాపుల్లో అడిగితే మహికో విత్తనాలు రూ.2 వేలు అంటున్నారు. ఏం చేయాలో తెలియక ఆలోచిస్తున్నా. మంగళవారం రాత్రి ఏబీఎన్ చానల్ చూస్తుండగా మంత్రి కన్నా లక్ష్మినారాయణ రైతులతో సంభాషిస్తున్నారు. వెంటనే.. ఇచ్చిన నెంబరుకు ఫోన్ చేశాను.

తొలుత పత్తి విత్తన కొరతపై ప్రశ్నించిన నేను ఆపై విత్తన బ్లాక్ మార్కెటింగ్‌పై అడిగాను. ఎక్కడ జరుగుతుందని అడగ్గా మా జిల్లా అంతా ఇదే పరిస్థితని చెప్పాను. డిబేట్ అయిపోయాక మంత్రి నాకు ఫోన్ చేసి, మీది ఏ మండలం? అని అడగ్గా కురవి అని చెప్పాను. రాత్రికి రాత్రే ఆర్డీవో బిక్షానాయక్, కురవి సీఐ రవీందర్ ఆధ్వర్యంలో దాడులు జరిగాయని, 143 పత్తి విత్తన ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారని తెలిసి ఆశ్చర్యపోయాను” అని వివరించారు.

విత్తన సరఫరాలో సర్కారు విఫలం
సబ్సిడీ సొమ్ము ప్రైవేటు పరం..
బ్లాక్ మార్కెట్‌కు పత్తి విత్తనాలు
22న నిరసన ప్రదర్శనలు, జైల్‌భరో: కిషన్‌రెడ్డి

హైదరాబాద్: వర్షాల రాకతో రైతాంగం విత్తనాల కోసం ఎదురు చూస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కుంభకర్ణ నిద్ర పోతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ధ్వ జమెత్తారు. నాలుగైదేళ్లుగా విత్తనాల సమస్య తీవ్రమవుతున్నా, ప్రభుత్వం విత్తనాల పంపిణీ విధానాన్ని మార్చకుండా.. బాధ్యతలను ప్రైవేటు కంపెనీలకు అప్పగించేసి కళ్లు మూసుకుని కూర్చుందన్నారు.

రైతులకు చెందాల్సిన విత్తన సబ్సిడీని ప్రైవేటు కంపెనీలకు ధారాదత్తం చేస్తోందని ఆరోపించారు. విత్తనాల కోసం రైతులు క్యూలలో నిలబడి, లాఠీదెబ్బలు తినాల్సి రావడం దేశంలో ఎక్కడా లేదన్నారు. పత్తి విత్తనాలు బ్లాక్ మార్కెట్‌కు తరలిపోయినా సర్కారు నుంచి చర్యల్లేవని ధ్వజమెత్తారు. కాగా కాంగ్రెస్ ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ నెల 22న అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసన ప్రదర్శనలు, జైల్‌భరో కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

బీటీ విత్తనంపై పర్మిట్ తొలగించాలి
దీని వల్ల విత్తనాల లభ్యత మెరుగు: ఏపీ సీడ్స్‌మెన్ అసోసియేషన్

హైదరాబాద్: రాష్ట్రంలో ఓ కంపెనీ బీటీ విత్తనాలపై ఉన్న పర్మిట్ విధానాన్ని తొలగించాలని ఏపీ సీడ్స్ అసోసియేషన్ కోరింది. పర్మిట్ వ్యవస్థను ప్రవేశ పెట్టడం వల్ల ఆ విత్తనానికి అనవసరమైన ‘హైప్’ లభిస్తోందని, దీన్ని తొలగిస్తే దుకాణాల్లో అవసరమైన మేరకు విత్తనాలు దొరుకుతాయని అభిప్రాయపడింది.

రాష్ట్రంలో 1.27కోట్ల బీటీ విత్తన ప్యాకెట్లు అవసరముంటే అందులో 85 శాతం విత్తనాలు ఇప్పటికే పం పిణీ చేశామని ఏపీ సీడ్స్‌మెన్ అసోసియేషన్ కార్యదర్శి వెంకటరెడ్డి అన్నారు. కొన్ని ప్రాంతాల్లో రైతులు ఒక బ్రాండునే అడుగుతున్నందున సమస్య వస్తోందన్నారు. ప క్క రాష్ట్రాల నుంచి బీటీ విత్తనాలు తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతున్నారని, వాటిపై తమ నియంత్రణ ఎలా ఉంటుందని సీడ్స్‌మెన్ ప్రతినిధి భాస్కర్‌రావు ప్రశ్నించారు.

మంత్రి కన్నా అమెరికా పర్యటన రద్దు
ఈ నెల 29 నుంచి తలపెట్టిన అమెరికా పర్యటనను మంత్రి కన్నా లక్ష్మీనారాయణ రద్దు చేసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురిసి ఖరీఫ్ సీజన్ ఊపందుకోవడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి కార్యాలయం ప్రకటించింది.

Double standards on organic cotton in State?

The unbridled promotion of genetically modified (GM) cotton in the State, including Mysore district, has left organic farmers peeved due to the absence of an institutional mechanism to supply non-Bt cotton seeds in the market.

The cotton seed scarcity that plagued the district and other parts of the State in May mainly pertained to Bt cotton seeds which is used by over 90 per cent of growers in H.D. Kote and other cotton-growing areas of the district.

According to statistics available with the Department of Agriculture here, nearly 40,000 hectares of land was brought under cotton cultivation in 2010. The area is expected to increase to 54,000 hectares this year.

Of the 40,000 hectares under cotton cultivation in the district, the area under organic cotton is around 4,000 hectares. But in the absence of non-Bt cotton seeds, farmers using eco-friendly and organic methods may be forced to switch to chemical farming.

Vivek Cariappa, organic farmer from H.D. Kote, told The Hindu that a large number of farmers shifted from cereals and pulses to cotton, anticipating a good price. As a result, the area under maize, ragi and banana declined. He said that the Government was catering to their requirements by ensuring supply of Bt cotton seeds.

“However, there are scores of farmers who have rejected Bt technology, shifted focus from conventional chemical-intensive practices and are practitioners of organic farming. These farmers have been left to fend for themselves,” Mr. Cariappa said.

He pointed out that though the State’s policy was to promote organic farming, it was encouraging Bt technology.

Contamination

Mr. Cariappa and other organic farmers expressed the view that the germplasm of the non-Bt variety of seeds had been contaminated and that the University of Agricultural Sciences (UAS), Dharwad, was the only place in the country where the germplasm of the non-Bt variety of cotton was not contaminated.

Hence, Mr. Cariappa suggested that the State Government be pro-active in funding the UAS to produce non-Bt varieties of cotton seeds. He said that even indigenous cotton varieties such as Jayadhar cotton, which was cultivated extensively in Hubli and Gadag, were not available and it was imperative for the State to intervene and ensure that the germplasm of these indigenous varieties were produced, preserved and made available to farmers.

The Organic Farmers’ Association of H.D. Kote pointed out that each packet of Bt cotton seeds contained a small pouch of non-Bt cotton seeds because it was mandatory for farmers to plant them in the periphery of their fields to prevent contamination of transgenic plants with non-transgenic plants through pollination.

However, Mr. Cariappa said there was no independent laboratory or agency to certify that these pouches indeed contained non-Bt cotton seeds.

The onus was on the Government to establish or appoint an agency to check the seeds and ensure that non-Bt cotton seeds were supplied to farmers.

There is no institutional mechanism to supply non-Bt cotton seeds in the market
‘Farmers using organic methods may be forced to switch to chemical farming’