జన్యుమార్పిడి పంటలు … సామాజక కోణం…

విజ్ఞాన వీచిక డెస్క్   Tue, 27 Mar 2012, IST

కంపెనీ, ప్రభుత్వ సమాచారం ప్రకారం బిటి పత్తి సాంకేతికం ఇటీవల ఫలవంతమైన సాంకేతికాల్లో ఒకటి. కాయ తొలుచు పురుగు నివారణకు ఏ మందులూ వాడాల్సిన పనిలేదని, అధిక దిగుబడి వస్తుందనే లక్ష్యంతో దీని సేద్యానికి 2002, మార్చి 26న అనుమతివ్వబడింది. దీంతో బిటి సాంకేతికానికి దశాబ్దకాల అనుభవం. అయినా, 2004-05 నాటికి పత్తిలో దీని విస్తీర్ణం 5.6 శాతం మాత్రమే. ఆ తర్వాత ఇది వేగంగా విస్తరించి, 2011-12 నాటికి 90 శాతానికి చేరింది. కానీ, ఇదే జన్యువులు కలిగిన బిటి వంగ సేద్యానికి ప్రజల్లో పెద్దఎత్తున వ్యతిరేకత వ్యక్తమైంది. ఫలితంగా ఇది సురక్షితమని తేలేంతవరకూ అనుమతి నిరవధికంగా వాయిదాపడింది. దీంతో దాదాపు 20కి పైగా ఇతర ఆహార పంటల్లో ఈ సాంకేతికంతో రూపొందించిన కొత్తరకాల విడుదలకు అన్నీ సిద్ధమై ఆగిపోయాయి. కంపెనీ, ప్రభుత్వం చెప్తున్నట్లుగా బిటి పత్తి సఫలమైతే, అదే జన్యువుల్ని కలిగిన బిటి వంగ పట్ల ప్రజల్లో ఇంత వ్యతిరేకత ఎందుకు వచ్చిందనేది ఆలోచించా ల్సిన అంశం. పెరుగుతున్న ఆహార, ఇతర వ్యవసాయోత్పత్తుల అవసరాలని తీర్చుకోవాలంటే జన్యుమార్పిడి పంటలు మినహా మరో గత్యంతరం లేదని, అందువల్ల బిటి వంగను వ్యతిరేకిస్తున్న వారిని ఆధునిక సాంకేతిక వ్యతిరేకులుగా, అభివృద్ధి నిరోధకులుగా ముద్ర వేస్తున్నారు. ఫలితంగా రైతులకు, దేశానికి ఎంతో నష్టం కలిగిస్తున్నారని ముద్ర వేస్తున్నారు. ఈ వ్యతిరేకతకు సాంకేతిక కారణాలకన్నా, ఇతర కారణాలే ఎక్కువగా కనిపిస్తున్నాయనీ దుష్ప్రచారమూ చేస్తున్నారు. ఈ లోపల ఆంధ్రప్రదేశ్‌లో ఈ సంవత్సరం (2011-12) పత్తి రైతుల ఆత్మహత్యలు ఒకేసారి పెరిగి, కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో జన్యుమార్పిడి పంటల సాంకేతికంలో ఇమిడి వున్న సామాజిక కోణాలను ‘ప్రొఫెసర్‌ అరిబండి ప్రసాదరావు’ సహకారంతో సంక్షిప్తంగా తెలుపుతూ మీ ముందుకొచ్చింది ఈ వారం ‘విజ్ఞానవీచిక’.

గత పదేళ్లుగా వాణిజ్యస్థాయిలో సేద్యమవుతున్న జన్యు మార్పిడి పంట బిటి పత్తి. దీనిలో ‘బాసిల్లస్‌ తురింజినిసిస్‌’ అనే బ్యాక్టీరియాకు సంబంధించిన జన్యువులను ప్రవేశపెట్టారు. ఫలి తంగా పత్తిలో ఈ బ్యాక్టీరియాకు సంబంధించిన విషపదార్థం నిరంతరం ఉత్పత్తై వేరు సహా మొక్క అన్నిభాగాలకు విస్తరి స్తుంది. కాయలో ఉన్న ఈ విషపదార్థం కాయతొలుచు పురుగు లను నియంత్రిస్తుంది. ఇది ఈ సాంకేతికంలో ఇమిడి ఉన్న సిద్ధాంతం. ఈ సాంకేతికాన్ని ‘అంతర్గత బిటి విష ఉత్పత్తి (ఎం డోటాక్సిన్‌) సాంకేతికం’ గా వ్యవహరిస్తున్నారు. ఈ విషపదార్థం ప్రధానంగా సీతాకోకచిలుకకు సంబంధించిన లార్వాలను చంపుతుంది, నియంత్రిస్తుంది. ఈ జన్యువులను ఇప్పటికే 35 పంటల్లో ప్రవేశపెట్టారు. వీటిలో ఆహారపంటలు ముఖ్యమైనవి.

బిటి సాంకేతిక ప్రభావం..

ఈ సాంకేతికానికి స్వతహాగా అధిక దిగుబడి ఇచ్చే గుణం లేదు. 2002లో మొదట మహికో మోన్‌శాంటో కంపెనీకి చెంది న బిటి ఎంఇసిహెచ్‌-12, 162, 184 హైబ్రీడ్‌రకాలకు వాణిజ్యసేద్యానికి అనుమతిచ్చారు. ఈ రకాలు అప్పటికే సేద్యంలో ఉన్న హైబ్రీడ్‌లతో పోటీపడి, అధికదిగుబడిని ఇవ్వలేకపోయాయి. ఫలితంగా 2005లో వీటి అనుమతి రద్దు చేయబడింది. ఆ తర్వాత ఈ బిటి జన్యువులను అప్పటికే ప్రాచు ర్యం పొందిన బన్నీ, బ్రహ్మ వంటి హైబ్రీడ్‌లలో ప్రవేశపెట్టారు. దీని తర్వాత మాత్రమే ఈ సాంకేతికం ద్వారా రూపొందించిన కొత్త రకాలు అధిక దిగుబడిని తాత్కాలికంగానైనా ఇచ్చాయి. అంటే, బిటి హైబ్రీడ్‌ అధికదిగుబడి వచ్చిన సందర్భాలలో ఆయా హైబ్రీడ్‌ల అంతర్గత సామర్థ్యం వల్లనే కానీ, బిటి సాంకేతికం వల్ల కాదని నిర్ద్వందంగా నిరూపితమవుతుంది. ఇప్పుడు ఇలా 780 బిటి హైబ్రీడ్ల సేద్యానికి అనుమతి ఉంది. 2011-12 నాటికి సేద్యమవుతున్న మొత్తం 850 లక్షల ఎకరాల పత్తిలో 90 శాతం బిటి రకాలే సేద్యమవుతున్నాయి. వీటిలో కూడా ఒకే ఒక కంపెనీకి (మోన్‌శాంటో) చెందిన హైబ్రీడ్లు 85 శాతం మేర సేద్యమవుతున్నాయి.

బిటి సేద్యం తర్వాత పత్తి ఉత్పత్తి రెట్టింపుకు పైగా పెరిగింది. ఈ కాలంలో విస్తీర్ణం మూడున్నర రెట్లు పెరిగింది. మొత్తం హైబ్రీడ్‌ రకాలే వాడుతున్నారు. ఎరువుల వినియోగం పెరిగింది. సాగునీటి విస్తీర్ణమూ పెరిగింది. ఉత్పత్తి పెరుగు దలకు ఇవన్నీ కారణాలే. కానీ, మోన్‌శాంటో కంపెనీ మాత్రం పెరిగిన ఉత్పత్తంతా తన సాంకేతికం వల్లనేనని తప్పుడు ప్రచారం చేస్తోంది. రైతులకు రూ.31,500 కోట్లు అదనపు ఆదాయం వచ్చినట్లు ప్రచారం చేస్తోంది. రైతులకు ఇంత అదనపు ఆదాయం వస్తే వారు ఎందుకు ఆత్మహత్యలు చేసుకోవాల్సి వస్తుంది? ఇటీవల పెరిగి, కొనసాగుతున్న పత్తి రైతుల ఆత్మహత్యలకు కంపెనీ ఏమీ జవాబు చెప్పడం లేదు. తప్పుడు ప్రచారాన్ని కంపెనీ తొలగించాలని అడ్వర్టయిజ్‌ మెంటల్‌ కౌన్సిల్‌ కూడా తీర్పు చెప్పింది.

వచ్చిన నేపథ్యం..

సంస్కరణలు, స్వేచ్ఛా వ్యాపారం నియంత్రణ చేయలేని లద్దె, పచ్చ పురుగుల వల్ల 1997లో పత్తి రైతులు వరంగల్‌- కరీంనగర్‌ జిల్లాల్లో బాగా నష్టపోయారు. ఆత్మహత్యలు చేసుకున్నారు. ఆ నేపథ్యంలో, పచ్చ పురుగుల్ని తట్టుకునే శక్తి ఉందంటూ బిటి పత్తి ప్రవేశపెట్టబడింది. అప్పట్లో సామాజిక కార్యకర్తలు, కొంతమంది శాస్త్రజ్ఞులు బిటి సాంకేతిక లోపాల్ని ఎత్తి చూపుతూ రాగల ప్రమాదాల్ని ముందే హెచ్చరించినా, ప్రభుత్వం పట్టించుకోలేదు. మహికో బిటి హైబ్రీడ్‌లు విఫలమై, అప్పటికే ప్రాచుర్యం పొందిన బన్నీ, బ్రహ్మ వంటి హబ్రీడ్‌లలో బిటి జన్యువుల్ని పెట్టిన తర్వాత మాత్రమే ఇవి నిలదొక్కు కున్నాయి. ఇతర మెట్ట పైర్ల సంక్షోభ నేపథ్యంలో ధరలు కూడా ఇతర పంటల ధరలకన్నా ఆకర్షణీయంగా ఉండటంతో బిటి పత్తి సేద్యం వేగంగా విస్తరించింది.

అవాస్తవ ప్రచారం..

బిటి కొత్తగా ప్రవేశపెట్టినపుడు తన హైబ్రీడ్‌లను వాడితే కాయతొలుచు పురుగు నియంత్రణకు ఎటువంటి మందునూ వాడాల్సిన అవసరంలేదనీ, అధిక దిగుబడి వస్తుందనీ, ఖర్చు తక్కువవుతుందనీ ప్రచారం చేసింది. ఈ పదేళ్ల అనుభవంలో ఇవన్నీ అవాస్తవాలని ఋజువైనాయి. కొద్ది కాలంలోనే బోల్‌గార్డ్‌-1 కాయతొలుచు పురుగును తట్టుకొనే శక్తిని కోల్పోయింది. ఆ తర్వాత దీనిని కంపెనీ కూడా అంగీకరించాల్సి వచ్చింది. ఇదే జన్యువులు కలిగిన బోల్‌గార్డ్‌-2 రకాన్ని విడుదల చేసింది. దీనిలో కూడా తట్టుకునే శక్తి వేగంగా వస్తుంది. పురుగు ఉధృతాన్ని గమనిస్తూ అవసరమనుకుంటే కాయతొలుచు పురుగు నియంత్రణకు మందుల్ని వాడాలని ఇపుడు కంపెనీయే సూచిస్తుంది. పిచికారీల (స్ప్రే) సంఖ్య మొదట తగ్గినా ఆ తర్వాత పెరిగాయి. ముఖ్యంగా రసం పీల్చు పురుగుల ఉధృతం పెరిగింది. వాటి ద్వారా వచ్చే తెగుళ్లూ ఎక్కువయ్యాయి. ఆకుముడత తెగులు బెడదగా మారింది. దీంతో పురుగుల మందు వినియోగం దాదాపు ముందు స్థాయికి పెరిగింది. రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయ ప్రకారం బిటి రకానికి 15 శాతం ఎరువుల్ని ఎక్కువగా వేయాలి. సాగునీటి అవసరమూ ఎక్కువే. బెట్టనూ ఏమాత్రం తట్టుకోలేదని రైతులు గ్రహించారు. మొదట దిగుబడి పెరిగినట్లు కనిపించినా ఆ తర్వాత దిగుబడి తగ్గిపోతూ ఉంది (వివరాలు వేరేచోట). అంతిమంగా, రైతులకు ఖర్చులూ పెరిగాయి. రిస్కూ పెరిగింది. తద్వారా కంపెనీ ప్రచారంలోని డొల్లతనం వెల్లడైంది.

ఆహారంలో..

వంగలో బిటి జన్యువుల్ని పెట్టారు. కోసే సమయంలో కాయలో బిటి విషం పురుగును చంపేస్థాయిలో ఉంటుంది. అదే కాయల్ని తిన్నప్పుడు విషం నేరుగా జీర్ణకోశంలోకి ప్రవేశిస్తుంది. ఇది ఆరోగ్యానికి ప్రమాదకరం కాదని నిర్ద్వందంగా నిరూపించాల్సిన బాధ్యత కంపెనీదే. దీనికి అవసరమైన పరీక్షల్ని క్షుణ్ణంగా చేయకుండానే తనకున్న పలుకుబడితో బిటి వంగను వాణిజ్య సేద్యానికి అనుమతి పొందేందుకు యత్నించింది. దాదాపుగా సఫలమైంది. కానీ, ఇది ముందుగానే తెలుసుకొని మేల్కొన్న ప్రజలు పెద్దఎత్తున ఆందోళనలు చేశారు. రాష్ట్ర ప్రభు త్వాలూ వ్యతిరేకించాయి. ఈ నేపథ్యంలో, ప్రజాభిప్రాయాన్ని సేకరించిన అప్పటి పర్యావరణ శాఖ కేంద్ర మంత్రి అవసరమైన పరీక్షలు పూర్తయ్యి, సురక్షితమని నిరూపించేవరకూ అనుమతిని నిరవధికంగా వాయిదా వేశారు. నేరుగా తినని బిటి పత్తి, తినే ఆహారం ఒకటే కాదని ప్రజలు గ్రహించారు. కానీ కంపెనీ, జనెటిక్‌ ఇంజనీరింగ్‌ అప్రూవల్‌ కమిటీలు గుర్తించకపోవడం దేశ దౌర్భాగ్యం. ఈనాటికీ, శరీరంలో ప్రవేశించిన బిటి విషం ఎలాంటి ప్రభావాల్ని కలిగిస్తుందనేది నిర్దిష్టంగా నిరూపించే పరిశోధనలు చేయకుండానే బిటి వంగను వ్యతిరేకించిన వారంతా ఆధునిక సాంకేతిక వ్యతిరేకులుగా ముద్ర వేస్తున్నారు. సంబంధిత కేంద్రమంత్రినీ వేరే శాఖకు మార్చి వేశారు. కారణాల్ని ఊహించడం కష్టం కాదు.

ఇతర జన్యుమార్పిడి పంటలు…

అందుబాటులో ఉన్న సమాచారం మేరకు ఇప్పుడు 50కి పైగా పంటల్లో జన్యుమార్పిడి పరిశోధనలు పెద్దఎత్తున కొనసాగుతున్నాయి. వీటన్నింటిలో విదేశీ, బహుళజాతి సంస్థలే కీలకం. జాతీయ పరిశోధనా సంస్థల పాత్ర నామమాత్రపు స్థాయికి దిగజారింది.

బిటి సాంకేతిక సామర్థ్యంపై విమర్శ వచ్చినప్పుడల్లా పెరుగుతున్న ఆహార, వ్యవసాయోత్పత్తుల అవసరాల్ని తీర్చుకోవడానికి ‘జన్యు మార్పిడి సాంకేతికం’ అనివార్యమని బిటి సమర్థకులు ప్రచారం చేస్తున్నారు. ఈ కొత్త సాంకేతికం బెట్ట పరిస్థితులనూ, చవిటి నేల పరిస్థితులనూ తట్టుకోవడానికి, పోషకలోపాల్ని సరిదిద్దడానికి, ముఖ్యంగా విటమిన్‌ ఎ సరఫరాకు, ఇతర పోషకాల్ని సమర్థవంతంగా అందించడానికి అవసరమని చెప్తుంటారు. అంతర్గత విష తయారీ సాంకేతికపై వీరు నేరుగా చర్చించరు. సమగ్ర సస్యరక్షణ పద్ధతుల కన్నా లేక అసలు పురుగు మందుల్నే నేరుగా వాడని పురుగు నియంత్రణ పద్ధతులకన్నా అంతర్గత విష తయారీ సాంకేతికం (ఎండో టాక్సిన్‌ ప్రొడక్షన్‌) సమర్ధవంతమైందని, సుస్థిరమైందని నిరూపించే ఏ ప్రయోగాల ఫలితాల్నీ చూపించడం లేదు. ఏ కొత్త సాంకేతికాల్ని ప్రవేశపెట్టాలన్నా అప్పటికే వాడుకలో ఉన్న సాంకేతికం కన్నా కొత్తది మెరుగైనదని నిరూపించిన తర్వాతనే అంగీకరించాలి. ఇది సైన్స్‌ సూత్రం. దీన్ని పాటించకుండా కేవలం రాజకీయ, ఆర్థిక పలుకుబడితో జన్యు మార్పిడి సాంకేతికాల్ని రుద్దే ప్రయత్నం అభిలషణీయం కాదు.

గుత్తాధిపత్యం..

ప్రపంచీకరణ విధానాలు, భారత-అమెరికా వ్యవసాయ విజ్ఞాన చొరవ ఒప్పందం తర్వాత భారత వ్యవసాయ పరిశోధనల ఎజెండా మారిపోయింది. చిన్నకమతాల రైతుల అవసరాలకు బదులు కంపెనీల అవసరాలనే కేంద్ర బిందువుగా మార్చి, అమలు చేయబడుతుంది. విత్తన నియంత్రణ, సరఫరా బాధ్యత నుండి ప్రభుత్వం తప్పుకుని, ప్రయివేటు కంపెనీలకు అప్పగించింది. దీని ఫలితమే కేవలం 3, 4 ఏళ్లల్లో మోన్‌శాంటో కంపెనీకి పత్తి ఉత్పత్తిపై గుత్తాధిపత్యం ఏర్పడింది. దీంతో విత్తన ధరలు, అందించే సాంకేతికం వంటి అన్ని విషయాలపై ఈ కంపెనీయే పెత్తనం చేస్తోంది. పైకి ఏమి చెప్పినప్పటికీ ప్రభుత్వ పాత్ర ప్రేక్షకస్థాయికి దిగజారింది. ఆహారధాన్యాల్లో ఈ గుత్తాధి పత్యం ఏర్పడితే రాబోయే ఆర్థిక, రాజకీయ, సామాజిక పరిణామాలు ఊహించడానికే భయంకరంగా ఉంటాయి. ఇవి బ్రిటిష్‌ వలసపాలనను పోలి ఉంటాయి.

గమనిక: ఈ పేజీపై మీ స్పందనలను, 9490098903కి ఫోను చేసి తెలియజేయండి.

సంక్షోభంలో పత్తిరైతు..

భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి కేంద్ర పత్తి పరిశోధనా సంస్థల సమాచారం ఆధారంగా జనవరి 9, 2012న పత్తి వేసే అన్ని రాష్ట్రాలకూ రహస్య సలహాల్ని అందించినట్లు తెలుస్తుంది. వీటి ప్రకారం వివిధ సేద్య వాతావరణ ప్రాంతాల్లో మంచి స్థానిక సమగ్ర వ్యవసాయ ఉత్పత్తి పద్ధతులను గుర్తించి, వారి అనుభవాలను ఇతర చిన్న రైతులకు అందించాలని సలహా ఇచ్చినట్లు తెలుస్తుంది. గత కొన్నేళ్లుగా బిటి పత్తి ఉత్పాదకత తగ్గుతూ సంక్షోభ పరిస్థితుల్ని ఎదుర్కొంటున్న నేపథ్యంలో 2011-12లో ఒకేసారి పత్తి రైతుల ఆత్మహత్యలు బాగా పెరిగాయి. ఈ కాలంలో విత్తనం, సస్యరక్షణ మందులు, ఎరువుల ధరలు, సాగునీటి ఖర్చులు పెరిగాయని, అదే సమయంలో పత్తి ఉత్పత్తి తగ్గిందని ఈ సలహాల్లో పేర్కొనట్లు తెలుస్తుంది.

రాష్ట్రంలో..

బిటి పత్తి 2002-03లో ప్రవేశపెట్టిన తర్వాత విస్తీర్ణం క్రమంగా పెరుగుతూ 2010- 11 నాటికి 44.6 లక్షల ఎకరాలకు చేరింది. ఈ మధ్య కాలంలో దూది ఉత్పత్తి ప్రభుత్వ లెక్కల ప్రకారం 19.75 లక్షల బేళ్ల నుండి 53.0 లక్షల బేళ్లకు పెరిగింది. సగటు ఎకరా దూది దిగుబడి 167 కిలోల నుండి 2006-07లో 252 కిలోలకు, 2007-08లో 276 కిలోలకు పెరిగింది. ఆ తర్వాత ఇది క్రమంగా తగ్గుతూ 2010-11 నాటికి 202 కిలోలకు పడిపోయింది. ఇది 2003-04 స్థాయికన్నా చాలా తక్కువ. ఇక 2011-12లో పత్తి 47 లక్షల ఎకరాల్లో సేద్యమైంది. ఉత్పత్తి, దిగుబడి పూర్తి అంచనాలు అందుబాటులో లేవు. వేసిన పైరులో 70 శాతం పైగా బెట్ట వల్ల 50 శాతం పైగా ఉత్పాదకతను కోల్పోయినట్లు ప్రాథమిక ప్రభుత్వ అంచనాలు తెలియజేస్తున్నాయి.

మీకు తెలుసా..?

* సాంప్రదాయ బ్రీడింగ్‌ (ప్రజననం) పద్ధతిలో ఒకే పంటలో అభిలషణీయమైన గుణగణాలు కలిగిన రెండు రకాల మధ్య సంక్రమణం సాధ్యమవుతుంది. తద్వారా కొత్త రకాల్ని రూపొందిస్తారు. భిన్న జాతుల మధ్య ఇలాంటి సంక్రమణం సాధ్యం కాదు. ఇలా వచ్చిన సంతాన గుణగణాలకు స్థిరమైన వేలాది జన్యువులు కలిగిన క్రోమోజోములు ఆధారం. ఇవి స్థిరత్వం కలిగి ఉంటాయి.

* జన్యుమార్పిడి రకాల్లో భిన్న జాతుల మధ్య గుర్తించిన కొన్ని జన్యువులను ఎంపిక చేసిన వేరే జాతిలో ప్రవేశపెట్టవచ్చు. తద్వారా వచ్చిన సంతానం తల్లిదండ్రుల గుణాలు కలిగి ఉంటాయి. అయితే, ఇవి కొన్ని జన్యువుల ఆధారంగానే ఉండడంతో వీటి స్థిరత్వం తక్కువ. ఉదా: బిటి పత్తిలో బ్యాక్టీరియాకు చెందిన క్రై1ఏసి లాంటి జన్యువులను పత్తిలో ప్రవేశపెట్టడం వల్ల వచ్చిన సంతానంలో బాక్టీరియాకు చెందిన విషపదార్థ తయారీ గుణం ఉంటుంది. కొత్తరకాల్ని రూపొందించడంలో ఈ పద్ధతి ఎక్కువ అవకాశాల్ని అందిస్తుంది. కానీ, అన్ని పరిమాణాల్నీ ముందే ఊహించలేం. సాంప్రదాయ బ్రీడింగ్‌ పద్ధతిలో రూపొందించిన సంతానంతో జన్యుమార్పిడి సంతానాన్ని నేరుగా పోల్చలేం. దేని ప్రత్యేకత దానిదే.

* పత్తి:-గింజలతో కూడినది. దీనిలో దూది బరువు కేవలం మూడోవంతు కాగా, మిగతాది గింజల బరువే.

* దూది:- గింజలు తీసివేసినది.

రాష్ట్రం లో రైతు ఆత్మహత్యల లెక్క దాస్తున్నారు -డిల్లీ లో ఆశా నివేదిక విడుదల

రాష్ట్రంలో గత ఏడేళ్లలో 3775 మంది బలవన్మరణం; జయతి ఘోష్‌ సిఫార్సులు ఇంతవరకు అమలు చేయలేదు; ప్రభుత్వ విధానాల వల్లే ఆత్మహత్యలు; రాష్ట్రంలో తీవ్ర దురి్భక్షం నెలకొంది; ‘ఆశ’ స్వచ్ఛంద సంస్థ పరిశోధన నివేదిక
న్యూఢిల్లీ – న్యూస్‌టుడే

పెరుగుతున్న ఖర్చులు, తరుగుతున్న ఆదాయం, ప్రభుత్వాల సవతి తల్లి విధానాలు కలగలిపి అన్నదాతల గొంతులకు ఉరితాళ్లు పేనుతున్నట్లు ‘అలయన్స్‌ ఫర్‌ సస్టెయినబుల్‌ హోలిస్టిక్‌ అగ్రికల్చర్‌'(ఆశా) అనే స్వచ్ఛంద సంస్థ తేల్చింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతుల ఆత్మహత్యలను తక్కువచేసి చూపుతూ నిజాలకు పాతరేస్తున్నట్లు తెలిపింది. ఆంధ్రప్రదేశ్తోపాటు దేశవ్యాప్తంగా గత 15 ఏళ్లుగా జరిగిన అన్నదాతల ఆత్మహత్యల లెక్కలు, అందుకు దారితీస్తున్న పరిస్థితులపై ఆశా సంస్థ ఒక పరిశోధనా నివేదికను ఇక్కడ విడుదల చేసింది. 1995-2010 మధ్యకాలంలో దేశవ్యాప్తంగా 2,56,913 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నట్లు తెలిపింది. ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే 1997 జనవరి నుంచి 2011 ఆగస్టు మధ్యకాలంలో 5251 మంది చనిపోయినట్లు తేల్చింది. 1997 నుంచి 2003 వరకు 1476 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకోగా, కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన 2004 నుంచి ఇప్పటివరకూ 3775 మంది చనిపోయినట్లు ‘ఆశా’ వెల్లడించింది. అయితే నేషనల్‌ క్రైమ్‌రికార్డ్స్‌ బ్యూరో ప్రకారం 2010లోనే రాష్ట్రంలో 2525 మంది చనిపోయినట్లు పేర్కొంది. రైతుల ఆత్మహత్యలు అరికట్టడానికి వై.ఎస్‌ సర్కార్‌ జయతీ ఘోష్‌ కమిషన్‌ ఏర్పాటు చేసినప్పటికీ ఆ సిఫార్సుల్లో చాలావరకు అమలే చేయలేదని చెప్పింది. ‘ఆశా’ నివేదిక ప్రకారం రైతు ఆత్మహత్యల్లో గత పదేళ్లలో వరంగల్‌(725 మంది), అనంతపురం (654), కరీంనగర్‌ (541) జిల్లాలు మొదటి మూడు స్థానాల్లో, విజయనగరం(2) పశ్చిమ గోదావరి(11), శ్రీకాకుళం(11), విశాఖపట్నం(23) చివరి మూడు స్థానాల్లో ఉన్నాయి. ఆత్మహత్యలు చేసుకొనే సగటు రైతు వయస్సు కేవలం 36 ఏళ్లు మాత్రమేని ఆశా ప్రతినిధి సజయ కాకర్ల చెప్పారు.

నివేదికలోని ముఖ్యాంశాలు
1. గత పదేళ్లలో వ్యవసాయ విధానంలో విపరీత మార్పులొచ్చాయి. 90 శాతం భూమిలో కేవలం వరి, పత్తి, వేరుశనగ, మొక్కజొన్న సాగవుతోంది.
2 ఈ ఏడాది తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. విద్యుత్తు కోతలు తోడయ్యాయి. 2011 ఖరీఫ్‌లో 51 లక్షల ఎకరాల్లో పంట ఎండిపోయింది. ప్రభుత్వపరంగా సాయం లేదు. 50 శాతం సాగువిస్తీర్ణం ఎండిపోయిన తర్వాత ప్రభుత్వం కరువుపీడిత ప్రాంతాలను ప్రకటించింది. వర్షపాతం నెలలో 20 మిల్లీమీటర్లకంటే తక్కువగా ఉంది.

3. సాగు ఖర్చులు విపరీతంగా పెరిగిపోయాయి. పౌష్ఠికాధార సబ్సిడీ విధానం అమలులోకి వచ్చిన తర్వాత ఎరువుల ధరలు పెరుగుతూ పోతున్నాయి. ఏడాదిలో డీఎపీ ఖర్చు రెట్టింపయింది. అయిదేళ్లలో విత్తనాల ధరలు 100 శాతం పెరిగాయి. వర్షాధారిత ప్రాంతాల్లో ఒక్కో బోరు తవ్వకానికి కనీసం రూ.50 వేలు ఖర్చవుతోంది.

4. వ్యవసాయ విధానం రైతుకు అనుకూలంగా లేదు. పెట్టుబడులు పెరిగాయి. నష్టాల ముప్పు అధికంగా ఉంటోంది. కొన్ని వాణిజ్య పంటలే వేస్తూ వెళ్లడం వల్ల చిన్న రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారు. నీళ్లు, భూసారం విషయాల్లో కూడా నష్టపోతున్నారు. ఈ ఏడాది 47 లక్షల ఎకరాల్లో (దాదాపు 25%) పత్తి మాత్రమే వేశారు. ఈ పంటకు తమ భూములు తగినవో కాదో రైతులకు తెలియదు. పత్తిసాగుకు కేవలం బోరుబావుల పైనే ఆధారపడటంతో భూగర్భ జలాలు సన్నగిల్లాయి. 60 శాతానికి పైగా ఉన్న వర్షాభావ ప్రాంతం ప్రభుత్వ నిర్లక్ష్యానికి గురవుతోంది. పంట మార్పిళ్లు జరిగేలా ప్రభుత్వం చొరవ తీసుకోవడంలేదు. రక్షిత సాగునీరూ అందించడం లేదు. పశు పోషణ ఆధారిత భృతి కల్పించడం లేదు. దాంతో రైతులు వాణిజ్య పంటలకు మరలి కష్టాల్లో కూరుకు పోతున్నారు.

5. వరికి కనీస మద్దతు ధర రూ.1130 ఉంటే ఖర్చు క్వింటాల్‌కు రూ.1400 అవుతోంది. కౌలు రైతులకు ఖర్చు రూ.1800 వరకు ఉంటోంది.

6. 27 శాతం మందికే బ్యాంకు రుణం లభిస్తోంది. అందే రుణం కూడా స్వల్పం. ఎకరా వరిసాగుకు రూ.17,500 ఖర్చవుతుంటే (కౌలు ఖర్చు సీజన్‌కు పదివేలు అదనం) రుణం మాత్రం రూ.17,000 మాత్రమే వస్తోంది. వాణిజ్య పంటల ఖర్చు-రుణాల మధ్య అగాధం చాలా ఎక్కువగా ఉంటోంది. రైతులు బలవంతంగా వడ్డీవ్యాపారులను ఆశ్రయించాల్సి వస్తోంది.

7. కౌలు రైతులకు బ్యాంకు రుణాలు అందడంలేదు. రాష్ట్రంలో 25 లక్షల మంది కౌలురైతులుంటే గుర్తింపు కార్డులు 5 లక్షల మందికే ఉన్నాయి. ఇందులో 75 వేలమందికి ఖరీఫ్‌లో బ్యాంకు రుణాలు అందాయి.

ఆత్మహత్యలపై సర్కారుకు సూచనలు
చి మూడేళ్లలో వరుసగా పంటలు నష్టపోయిన రైతులను గుర్తించి ఎకరాకు కనీసం పదివేల రూపాయల పరిహారం ఇప్పించాలి. రైతులకు భరోసా ఇచ్చినట్లవుతుంది. ఆత్మహత్య ఆలోచన రాకుండా అడ్డుకుంటుంది.
చి రైతులకు అనుకూలంగా ఎగుమతి, దిగుమతి సుంకాలను సవరించాలి.

చి కనీస మద్ధతు ధర నిర్ధారణ, పంట సేకరణ విధానాలను మార్చాలి. ఎఫ్‌సీఐ, సీసీఐలాంటి ప్రభుత్వం ఏజెన్సీల ద్వారా నేరుగా రైతుల నుంచి సేకరణ జరపాలి.

చి ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను గుర్తించి తక్షణం పరిహారం అందించాలి. ఆత్మహత్యలను గుర్తించలేని అధికారులపై చర్యలు తీసుకోవాలి. రైతు ఆత్మహత్యల్లో వ్యవసాయ, వ్యవసాయేతర తేడాలు వద్దు. 2010లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేవలం 158 ఆత్మహత్యలను గుర్తిస్తే, నేషనల్‌ క్రైమ్‌రికార్డ్స్‌ బ్యూరో 2525 మంది బలవంతంగా ప్రాణం తీసుకున్నట్లు తేల్చింది.

చి పంట ఖర్చుపై 50 శాతం లాభం వచ్చేలా కనీస మద్దతు ధర నిర్ణయించాలి. రాకపోతే నష్టపోయిన మొత్తాన్ని ప్రభుత్వం చెల్లించాలి. వినియోగదారుల ధరల కోసం రైతులను బలిచేయొద్దు.

బీటీ పత్తి నిలువునా ముంచింది: 16.36 లక్షల ఎకరాల్లో ఎండిన పంట; రూ.6,545 కోట్లు కోల్పోయిన రైతులు

పత్తి రైతుల ఆశలను కరవు మింగేసింది. తీవ్ర వర్షాభావంతో పంట పూర్తిగా పోవడంతో పెట్టిన పెట్టుబడులు కూడా తిరిగి రాక అప్పుల ఊబిలో చిక్కుకుపోయేలా చేసింది. తెగుళ్లను తట్టుకుని అధిక దిగుబడులిస్తుందని, కాసుల వర్షం కురిపిస్తుందని నల్లబజారులో అధిక ధరలకు కొని సాగుచేసిన బీటీ పత్తి ఎండలకు తట్టుకోలేక నిలువునా ఎండిపోయింది. ఈ రకం వంగడాలు రాష్ట్రంలో నెలకొన్న అధిక వేడి వాతావరణాన్ని తట్టుకోలేకపోయాయి. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ఎన్నో ఏళ్లుగా పండించే సాధారణ పత్తి వంగడాలను సాగుచేస్తే వర్షాభావ పరిస్థితులకు తట్టుకుని కొంత పంటయినా చేతికొచ్చేదని ఆచార్య రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు తెలిపారు.
చిరాష్ట్రంలో కరెంటు కోత, తీవ్ర వర్షాభావంతో ఎండిపోయిన పత్తిపంట విస్తీర్ణం 16.36 లక్షల ఎకరాలకు చేరిందని వ్యవసాయ శాఖ తాజాగా ప్రభుత్వానికి నివేదించింది. వేరుశెనగ తరవాత అత్యధికంగా ఎండిపోయిన పంట ఇదే. ఈ ఏడాది 43 లక్షల ఎకరాల్లో పత్తి సాగుచేశారు. మిగిలిన 27 లక్షల ఎకరాల్లోని పంటయినా సక్రమంగా వస్తుందా అన్న ఆందోళన నెలకొంది.
చిసాధారణంగా ఎకరం పొలంలో 10 క్వింటాళ్ల పత్తి దిగుబడి వస్తుంది. ప్రస్తుతం క్వింటా ధర రూ.4వేలు ఉంది. ఈ ధర ప్రకారం లెక్కవేసినా మొత్తం ఎండిపోయిన 16.36 లక్షల ఎకరాలకు సంబంధించి పత్తి రైతులు కోల్పోయిన సొమ్ము రూ.6546 కోట్లని అధికారిక నివేదిక చెబుతోంది. ఈ నష్టం మరింత పెరిగే అవకాశమూ ఉంది.
చిసాధారణంగా ఎకరం పొలంలో 10 క్వింటాళ్ల పత్తి దిగుబడి వస్తుంది. ప్రస్తుతం క్వింటా ధర రూ.4వేలు ఉంది. ఈ ధర ప్రకారం లెక్కవేసినా మొత్తం ఎండిపోయిన 16.36 లక్షల ఎకరాలకు సంబంధించి పత్తి రైతులు కోల్పోయిన సొమ్ము రూ.6546 కోట్లని అధికారిక నివేదిక చెబుతోంది. ఈ నష్టం మరింత పెరిగే అవకాశమూ ఉంది.

చిబీటీ విత్తనాలను నల్లబజారులో 450 గ్రాముల ప్యాకెట్‌ను రూ.2500 చొప్పున కొని ఐదెకరాలు సాగుచేస్తే...ఇప్పుడు విత్తనాల ఖర్చు కూడా తిరిగి వచ్చే పరిస్థితి కానరావడం లేదని మెదక్‌ జిల్లా కొండపాకకు చెందిన రైతు నర్సింహ వాపోయారు. ఎకరానికి విత్తనాల ఖర్చే రూ.5 వేలు తేలిందని ఆవేదన వ్యక్తం చేశారు.

జీవ వైవిధ్యం లేకనే నష్టం 
రైతులు మూకుమ్మడిగా బీటీ విత్తనాలే సాగుచేయడం వల్ల జీవ వైవిధ్యం లేకుండా పోయింది. బీటీ పత్తి కొంత, మరికొంత స్థానిక రకాలైన నర్సింహ, ఎల్‌కే861 వంటివి సాగుచేయాలి. స్థానిక రకాలు ఒకసారి ఎండలకు కాత, పూత రాలిపోయినా...మరో వర్షానికి మళ్లీ చిగురించి రైతులకు కొంతయినా పంట చేతికొచ్చేది. అసలు తేలిక నేలల్లో వర్షాలను నమ్ముకుని పత్తి సాగుచేయడం కూడా సరైంది కాదు. వాతావరణం ప్రతికూలిస్తే...ఇక్కడ నష్టాలు తప్పవు.

- మొవ్వ రామారావు, మాజీ వ్యవసాయ శాస్త్రవేత్త
బీటీ వేయాల్సింది 30 శాతం విస్తీర్ణంలోనే... 
రాష్ట్రంలో బీటీ పత్తి సాగు వేలం వెర్రిలా మారింది. కరవు పరిస్థితుల నెలకొనడంతో రైతులు నష్టపోయారు. వాస్తవానికి 30 శాతం విస్తీర్ణంలోనే బీటీ సాగుచేయాలని శాస్త్రీయ పరిశోధనలు చెబుతున్నాయి. కానీ 90 శాతానికి మించి వేయడం వల్ల ఎండలకు తేలికపాటి నేలల్లో పంట ఎండిపోతోంది. బీటీ అనేది తెగుళ్ల నివారణకే పరిమితం. కరవు పరిస్థితుల్లో ఈ మొక్కల ఎదుగుదల సరిగా ఉండటం లేదు.
- రంగా వర్శిటీ ముఖ్యశాస్త్రవేత్త గోపీనాథ్, 
మాజీ శాస్త్రవేత్త జలపతిరావ

శాస్త్రీయ విధానంలో మద్దత్తు ధర (ఎంఎస్‌పి)

సెంటర్ ఫర్ సస్టైనబుల్ అగ్రికల్చర్, May 25th, 2011

వరిధాన్యానికి కనీస మద్దతు ధరను శాస్ర్తియ విధానంలో నిర్ణయిస్తేనే రైతులకు గిట్టుబాటు అవుతుంది. ప్రస్తుతం అవలంభిస్తున్న విధానం లోపభూయిష్టంగా ఉంది. దాంతో రైతులు ఆర్థికంగా కుంగిపోయి జీవిస్తున్నారు. వ్యవసాయ ఉత్పత్తుల ధరలను నిర్ణయించడానికి, వ్యవసాయేతర ఉత్పత్తుల ధరలు నిర్ణయించడానికి అసలు పొంతనే లేదు. ప్రస్తుత ధరలను 1997-98తో పోలిస్తే వ్యవసాయ ఉత్పత్తుల ధరలు కేవలం 25 శాతం పెరిగితే సిమెంట్, స్టీల్, ప్రాసెసింగ్ ఫుడ్ తదితర వస్తువుల ధరలు 300 నుండి 600 శాతం పెరిగాయి. ఇదే సమయంలో ఉద్యోగుల వేతనాలు 150 శాతం పెరిగాయి. రైతుల ఆదాయం మాత్రం పాతిక శాతం కూడా పెరగలేదు. పంటలకు పెట్టుబడులు పెరగడంతో పంటల ఉత్పత్తులకు లభిస్తున్న ధరలు గిట్టుబాటు కావడం లేదు. 2004-05లో క్వింటాల్ ధాన్యానికి పెట్టుబడి ఖర్చు 578 కాగా, అదే క్వింటాల్‌కు ఎంఎస్‌పి 560గా నిర్ణయించారు. 2010-11 సంవత్సరానికి క్వింటాల్ ధాన్యానికి పెట్టుబడి ఖర్చు 1500లకు పెరగగా, ఎంఎస్‌పి మాత్రం 1030గా నిర్ణయించారు. వాస్తవాలను పరిగణనలోకి తీసుకుపోవడమే ఇందుకు కారణం.

వ్యవసాయానికి పెట్టే పెట్టుబడితో పాటు రైతుల జీవన ఖర్చులను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. జాతీయ రైతు కమిషన్ చేసిన సిఫార్సు ప్రకారం పెట్టుబడి ఖర్చుతో పాటు యాభైశాతం అదనంగా కలిపి కనీస మద్దతు ధర నిర్ణయించాలి.
రైతుల నుండి కొనుగోలు చేసే ధాన్యం మొత్తాన్ని ప్రభుత్వమే నేరుగా కొనుగోలు చేసే విధంగా ఒక విధానాన్ని రూపొందించాలి. చత్తీస్‌గఢ్ రాష్ట్రం సమర్థవంతమైన కొనుగోలు విధానాన్ని అమలు చేస్తోంది. ఇదే విధానాన్ని మనం కూడా అమలు చేస్తే బాగుంటుంది. మన రాష్ట్రంలో మహిళా సంఘాల ద్వారా జరిగిన ధాన్యం కొనుగోలు బాగానే ఉంది. ఈ విధానాన్ని విస్తృతం చేస్తే బాగుంటుంది. మహిళా సంఘాలు 2006-07 నుండి కొనుగోలు చేస్తున్న ధాన్యాన్ని మిల్లింగ్ చేసి భారత ఆహార సంస్థకు విక్రయిస్తున్నాయి. దాంతో మహిళా సంఘాలు తమ ఖర్చును మినహాయించుకుని రైతులకు మంచి ధరను చెల్లిస్తున్నాయి. ఈ విధానాన్ని విస్తృతం చేసి మిల్లర నుండి ఎఫ్‌సిఐ లెవీ బియ్యం కొనుగోలు చేసే పద్ధతికి స్వస్తి పలికితే రైతులకు లాభదాయకంగా ఉంటుందనడంలో సందేహం లేదు.
2009-10లో సేకరించిన బియ్యం నిల్వలతో రాష్ట్రంలోని గోదాములు నిండి ఉన్నాయి. ఈ కారణంగానే 2010-11లో ఇప్పటి వరకు ప్రభుత్వం రైతుల నుండి కొనుగోలు చేసిన ధాన్యం 4.70 లక్షల టన్నులు మాత్రమే కావడం గమనార్హం. రబీకి సంబంధించి 60 లక్షల టన్నులు మార్కెట్లోకి వచ్చింది. ప్రస్తుతం ధాన్యం వ్యాపారం మొత్తం మిల్లర్ల చేతిలో ఉండటంతో వారు ఏవో కారణాలు చెబుతూ రైతులకు ఎంఎస్‌పి ఇవ్వడం లేదు. ఒకవైపు రైతులకు తక్కువ ధర చెల్లిస్తున్న మిల్లర్లు మరోవైపు ఎఫ్‌సిఐకి మిల్లింగ్ చేసిన బియ్యం ఎక్కువ ధరకు ఇస్తూ, బియ్యంతో పాటు వచ్చే ఉపఉత్పత్తుల ఆదాయాన్ని కూడా తినేస్తున్నారు. పంటలు వేసేందుకు ఆరు నెలల ముందే ఎంఎస్‌పిని ప్రకటించాల్సిన అవసరం ఉంది. ఈ విధానం వల్ల ఏ పంటలు వేసుకోవాలో రైతులే నిర్ణయించుకుంటారు. సకాలంలో బ్యాంకుల ద్వారా రైతులందరికీ రుణసౌకర్యం కల్పించాల్సిన అవసరం ఉంది.
– డాక్టర్ జి.వి. రామాంజనేయులు
ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, సెంటర్ ఫర్ సస్టైనబుల్ అగ్రికల్చర్

 

వ్యవసాయం చేస్తే పెళ్లి చేసుకోం


కాలం మారుతోంది..సామాజిక పరిస్థితులు మారుతున్నాయి. అయితే మారుతున్న తీరు కొన్నిసార్లు సమాజంలోని కొన్ని వర్గాలకు ఇబ్బందికరంగా తయారవుతుంది. సమాజానికి వ్యవసాయరంగం ఎంత ముఖ్యమైనదో అందరికీ తెలుసు. కానీ క్రమేపీ ఆ రంగం పట్ల ఆదరణ తగ్గుతోంది. వ్యవసాయం చేసేవారిని చిన్నచూపు చూస్తున్నారు. చివరకి పరిస్థితి ఏరకంగా వచ్చిందంటే వ్యవసాయం చేసే యువకులను పెళ్లి చేసుకోమని యువతులు చెప్పేంతవరకు వెళ్లింది. ఒకప్పుడు ఒక యువకుడు వెనుక ఎంత భూమి ఉందని చూసేవారు. ఇప్పుడు ఏ ఉద్యోగం చేస్తున్నాడు, ఎంత సంపాదిస్తున్నాడని చూస్తున్నారు. మరి అంతా ఉద్యోగాలకే వెళ్తే వ్యవసాయం ఎవరి చేయాలి? అకాల వర్షాలు, కరువు కాటకాలు , మద్ధతుధరలు వంటి సమస్యలతో సతమతమవుతున్న రైతుబిడ్డలకు తగిన జోడీ కూడా దొరకకపోవడం సమాజానికి మంచిదా అన్నది ఆలోచించాలి. విజయవాడలో వివాహబంధం అనే సంస్థ దీనిపై ఓ సర్వే నిర్వహించింది. ఏ వృత్తిలో ఉన్నవారిని వివాహమాడతారన్న ప్రశ్నకు ఆశ్చర్యకరమైన ఫలితం వచ్చింది. సర్వేలో పాల్గొన్నవారిలో కనీసం ఒక్కరు కూడా వ్యవసాయవృత్తి దారుణ్ని పెళ్లి చేసుకోవడానికి ప్రాధాన్యత ఇవ్వలేదు. పిల్లల తల్లిదండ్రులు కూడా ఇదే ధోరణితో ఉన్నారు. దాదాపు 200మందిని ఈ సంస్థ ప్రశ్నిస్తే, అందులో ఎక్కువగా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు, తరువాత ప్రభుత్వ ఉద్యోగులకే మొగ్గుచూపారు. ఇలా మారిపోయింది మన సమాజం..

 

పచ్చని పల్లె -ఏనాబావి

http://eenadu.net/htm/weekpanel1.asp”>http://eenadu.net/htm/weekpanel1

110515 enabavi download PDF

రైతంటే ఆత్మహత్యలే ఎందుకు గుర్తుకు రావాలి? సేద్యంలో అప్పులే ఎందుకు మిగలాలి? పొలిమేరలో కాలుపెట్టగానే క్రిమిసంహారకాల వాసనే ఎందుకు గుప్పుమనాలి? ‘రసాయన రహిత గ్రామం’గా రికార్డుకెక్కిన వరంగల్‌జిల్లాలోని ఏనెబావి… పల్లెలకు పాఠం, రైతులకు ఆదర్శం, సమష్టి కృషికి నిదర్శనం.

గామీణ స్వావలంబన గురించి ఏసదస్సులో చర్చకు వచ్చినా ఆ వూరిపేరే చెబుతారు. క్రిమిసంహారకాల్లేని సేద్యం గురించి ఎక్కడ మాట్లాడాల్సి వచ్చినా ఆ వూరినే ఉదాహరణగా చూపుతారు. నీటి పొదుపు గురించి ఎవరు అధ్యయనం చేయాలన్నా ఆ వూరికే వస్తారు. విత్తనాల కొరతను అధిగమించడం ఎలాగో ఆ వూరి రైతులనే అడుగుతారు. ‘అప్పుల్లేని రైతులు ఎక్కడైనా ఉన్నారా’ అన్న ప్రశ్నకూ ఆ వూరే సమాధానం. …ఏనెబావి! ఆ గ్రామస్థుల ఆలోచనలు, నిర్ణయాలు, శ్రమజీవనం, పర్యావరణ ప్రియత్వం… అంతర్జాతీయ సమాజాన్ని ఆకర్షిస్తున్నాయి. దాదాపు 30 వేలమంది రైతులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు, ఉన్నతాధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు… ఆ పల్లెను పర్యాటక కేంద్రమంత ఆసక్తితో తిలకించారు. ఆధ్యాత్మిక క్షేత్రమంత భక్తితో దర్శించుకున్నారు. ఆ ఘనత వెనుక చాలా శ్రమ ఉంది. సంఘర్షణ ఉంది. వైఫల్యాలున్నాయి. చేదు అనుభవాలున్నాయి. ఆ రైతులు అన్నింటినీ భరించారు, ఎదిరించారు, గెలిచారు, చరిత్రకెక్కారు. అనగనగా…

ఏనెబావి శివారు పల్లె. వరంగల్‌ జిల్లా జనగామ రెవెన్యూ డివిజన్‌ పరిధిలోని లింగాలఘనపురం మండలంలో ఉంది. మాణిక్యపురం గ్రామపంచాయతీ పరిధిలోకి వస్తుంది. 280 ఎకరాల విస్తీర్ణం ఉన్న ఆ పల్లెలో 51 కుటుంబాలు ఉన్నాయి. జనాభా… పిల్లాపెద్దా కలిసి 207 మంది. నిజమే, చాలా చిన్న పల్లెటూరే. కానీ, ఆ పల్లె వెనుక పెద్ద కథే ఉంది.

జనగామ డివిజన్లోని గ్రామాలన్నీ ఇంకా తెలంగాణ సాయుధ పోరాట ప్రభావంలో ఉన్న సమయమది. పెత్తందారీ విధానానికి వ్యతిరేకంగా రైతులు పోరాటం సాగిస్తున్నారు. నర్మెట్టలో భూస్వామ్య వ్యవస్థ ఛాయలు పూర్తిగా సమసిపోలేదు. ఉన్నపొలమంతా నలుగురైదుగురు సంపన్నులదే. పల్లెపల్లెంతా పాలేర్లే! కొన్ని కుటుంబాలవారు ఆ బానిస బతుకులు బతకలేక..సంకెళ్లు తెంచుకునే అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు. దగ్గర్లోని ఓ గ్రామంలో ముస్లిం భూస్వామికి పదిహేనువందల ఎకరాల బంజరుభూమి ఉందని ఎవరో చెప్పారు. ఆ నేలను సాగుచేసుకోవాలన్న ఆశ కలిగింది. ఆ పంజరంలోంచి బయటపడాలన్న ఆకాంక్ష పెరిగింది. తమ ఆలోచన తెలిస్తే పెత్తందార్లు కళ్లెర్రజేస్తారేమో అన్న భయమొకవైపు. ఇట్టెబోయిన యాదయ్యకు ఆ సంగతులింకా గుర్తున్నాయి… ‘‘మాది నర్మెట్ట. లింగాలఘనపురం నుంచి ఓ శాలాయన బట్టలు తెచ్చి అమ్మేవాడు. ఓ వూళ్లో వందల ఎకరాల బంజరు భూమి ఉందని అతనే మా పట్వారీకి చెప్పాడు. పట్వారీ మాకు చెప్పాడు. 1962లో మాకున్న గుడిసేగుట్టా అమ్ముకుని మొత్తం అయిదు కుటుంబాల వాళ్లం బయల్దేరాం. ఆతర్వాత ఇంకో ఎనిమిది కుటుంబాలు వచ్చాయి. ముందుగా, నల్గొండ జిల్లా ఆలేరు మండలంలోని టంగుటూరికి చేరుకున్నాం. ఆ ఊరి సంపన్నుడిదే భూమి. ఆస్తులన్నీ అమ్మగా వచ్చిన డబ్బంతా పోగేస్తే పాతికవేలైంది. 133 ఎకరాలు కొన్నాం. కొనడమైతే కొన్నాం కానీ… అంతా బీడుభూమి. ఎటుచూసినా రాళ్లూరప్పలే. ఎదురుగా ఏనె (చిన్న గుట్టలాంటిది), పక్కనే బావి. ఏనెబావి అని పిలుచుకున్నాం! ఆ భూమిని సాగులోకి తీసుకురావడానికి రెక్కలు ముక్కలు చేసుకున్నాం. అదే బతుకన్నంత కష్టపడ్డాం. నిద్రలేచింది మొదలు… చికటి పడేవరకూ… అదే పని, అదే ధ్యాస! ఆకలి తెలియదు, దప్పిక తెలియదు. మాకు కష్టం కొత్తకాదు. కానీ ఎప్పుడూ మాకోసం మేం కష్టపడింది లేదు. మా చెమటంతా పెత్తందార్ల కోసమే ధారపోశాం. ఇప్పుడు… మా కోసం మేం శ్రమిస్తున్నాం. ఆ మట్టి మాది. ఆ నీరు మాది. ఆ గడ్డిపరక మాది. అందుకేనేమో, మాకు అలసట తెలియలేదు. భూమి ఒక చోట..కాపురం మరోచోట అయితే సేద్యం సాగదని తొందర్లోనే అర్థమైంది. అందుకే ఏనెబావి దగ్గరే తాటి కమ్మలతో గుడిసెలు వేసుకున్నాం”.

అలా పల్లె పుట్టింది. పొలం సిద్ధమైంది.


రంకెలేస్తూ బసవన్న వచ్చాడు. ఉత్సాహంగా కాడె భుజానికెత్తుకున్నాడు. లక్షణంగా గోవుమాలచ్చిమి వచ్చింది. ఇంటింటా పాలు పొంగించింది. కామధేనువు కాలుపెట్టింది. మరి, కల్పవృక్షం! చెరువే కల్పవృక్షమైంది. చేనుకు చేవ రావాలంటే, భూమిలో జీవం ఉండాలి. అదేమో బీడు భూమి. అంత సారవంతమైన మట్టి ఎక్కడ దొరుకుతుంది? ఆ చెరువులోని మట్టికి పరుసవేది విద్య తెలుసు. ఆ స్పర్శతో పంట బంగారమవుతుంది. తలోచేర¬ వేసి మట్టిని తరలించారు. ‘చెరువు మా కన్నతల్లి..కంటి పాప. బుక్కెడు బువ్వ నోట్లోకి పోతోందంటే… మా గరిసెల్లో ధాన్యం కుప్పలున్నాయంటే… ఆ చెరువు మట్టే కారణం’ అంటారు ఏనెబావి ప్రజలు. గుణపాఠం… ఓ రైతు. అతని దగ్గర రోజుకో బంగారు గుడ్డు పెట్టే బాతు. కొంతకాలం సంతోషంగానే ఉన్నాడు. మెల్లగా దురాశ మొదలైంది. దురాలోచన వేధించింది. కడుపుకోస్తే బోలెడన్ని బంగారు గుడ్లు దొరుకుతాయని ఆశపడ్డాడు. మిగిలిందేమిటి? నిరాశే! చిన్నప్పుడు చదువుకున్న కథే. పెద్దయ్యాక, ఆ కథలోని నీతి తెలియాల్సిన సమయానికి మన ఆలోచనారీతి దారితప్పిపోతుంది. ఏనెబావి విషయంలోనూ అదే జరిగింది. కొంతకాలానికి సంప్రదాయ సేద్యం మొహంమొత్తిపోయింది. రసాయన ఎరువులు చూసిన కళ్లకి… చెరువు మట్టి ఆనలేదు. క్రిమిసంహారకాల ఘాటు ముందు… పెంటకుప్పలు చిన్నబోయాయి. మరింత పంట పండాలి? మరింత దిగుబడి కావాలి? మట్టిని గట్టిగా పిండుకుందాం. సారాన్ని బలవంతంగా పీల్చుకుందాం. రసాయన ఎరువులు వెదజల్లుదాం. క్రిమిసంహారకాలు పిచికారీ చేద్దాం. .. రైతు రైతులా ఆలోచించినంత కాలం వ్యవసాయం హాయిగా సాగింది. ఎప్పుడైతే వ్యాపారిలా ఆలోచించడం మొదలుపెట్టాడో… ఆక్షణమే పతనం మొదలైంది. ఏనెబావి కూడా అందుకు మినహాయింపు కాదు. 1975 నుంచి 1995 దాకా… అది వ్యవసాయం కాదు. రసాయన విధ్వంసం. కృత్రిమమైన దిగుబడి. విచ్చలవిడిగా ఎరువులేశారు. వేలకొద్దీ పెట్టుబడులు పెట్టారు. మితిమీరిన ఆశలు పెట్టుకున్నారు. వ్యవసాయాన్ని జూదంతో పోలుస్తారు. యాదృచి్ఛకమే కావచ్చు కానీ, జూదానికి అలవాటుపడిన కొత్తలో రాబడి బ్రహ్మాండంగా ఉంటుంది. పట్టిందల్లా బంగారమే అనిపిస్తుంది. అది కాకి బంగారమని తెలియడానికి ఎంతోకాలం పట్టదు. తెలిసేలోపు, పరిస్థితులు అదుపుతప్పిపోతాయి. ఇక్కడా అంతే. ఒకటిరెండు పంటలు విరగపండాయి. డబ్బే డబ్బు! రైతు రెచ్చిపోయాడు. పెట్టుబడి రెట్టించాడు. ఇంకో లోడు ఎరువులు దించాడు. క్రిమిసంహారకాలు టోకున కొన్నాడు. ఆ దెబ్బకి చిడపీడలు రాటుదేలిపోయాయి. మందుల్ని తట్టుకునే సత్తువ కూడగట్టుకున్నాయి. రైతన్న పప్పులు ఉడకలేదు. అప్పులే మిగిలాయి. అదో పాడుకాలం. పంటలేకాదు, మనశ్శాంతీ కరవైన కాలం.

కొత్త జీవితం… రైతులో ఆలోచన మొదలైంది. దారి తప్పామని అర్థమైపోయింది. రసాయనాల ఊబిలోంచి బయటపడాలన్న తపన కనిపించింది. కానీ, ఎలా? వేలుపట్టుకు నడిపించేదెవరు? దారిచూపి పుణ్యంకట్టుకునేదెవరు?కష్టాలు, నష్టాలు, అప్పులు… ఇవి చాలవన్నట్టు రాకాసి బొంతపురుగులు! బొంతపురుగు సేద్యానికి బొంద పెడుతుంది. హద్దూ అదుపూ లేని రసాయనాల వాడకంతో… ఓ దశదాటాక పురుగులు నిరోధకశక్తిని పెంచుకున్నాయి. ఏ మందులూ ఏమీ చేయలేని పరిస్థితి. అప్పులతో నష్టాలతో సతమతమౌతున్న రైతన్నకు ఇదో పెద్దదెబ్బ! సరిగ్గా అప్పుడే… జనగామ కేంద్రంగా పనిచేస్తున్న క్రాప్స్‌ (సీఆర్‌వోపీఎస్‌- సెంటర్‌ ఫర్‌ రూరల్‌ ఆపరేషన్స్‌ ప్రోగ్రామ్‌ సొసైటీ) కేంద్ర గ్రామీణాభివృద్ధి కార్యక్రమాల సంస్థ బొంతపురుగు నివారణకు ఓ ఉద్యమాన్ని ప్రారంభించింది. క్రాప్స్‌ వ్యవస్థాపకుడు రేకల లింగయ్య తన బృందంతో ఏనెబావికి వచ్చాడు. రైతుల కన్నీళ్లు చూశాడు. కష్టాలు విన్నాడు. దీపపు ఎరలతో తల్లిపురుగులను ఎలా నాశనం చేయవచ్చో ప్రత్యక్షంగా చూపించాడు. దెబ్బకి దెయ్యం వదిలింది. పురుగు పరుగుపెట్టింది. ఏనెబావి ప్రజలకు సంప్రదాయ సేద్యమంటే గురి కుదిరింది. నిజమే. మన తాతముత్తాతలు, వాళ్ల తాతముత్తాతలు… పర్యావరణానికి హాని జరగకుండా, రైతుకు నష్టం వాటిల్లకుండా… సమాజానికంతా మంచి జరిగేలా చక్కని వ్యవసాయ పద్ధతుల్ని రూపొందించారు. తాత్కాలిక లాభాలకు ఆశపడి మనం వాటిని దూరంచేసుకుంటున్నాం. అది తప్పు’ అన్న పశ్చాత్తాపం కనిపించింది. అదే మార్పుకు తొలి అడుగు. ఆ అడుగు పొన్నం మల్లయ్యది. మిగిలిన రైతులంతా ఆ దార్లోనే నడిచారు. క్రాప్స్‌ సహకారం ఉండనే ఉంది. ఏనెబావి రైతులు 1995 నుంచి రసాయన ఎరువులు, క్రిమిసంహారకాల వాడకాన్ని తగ్గించారు. 2005 నాటికి పూర్తిగా వదులుకున్నారు. దీంతో ‘సెర్ప్‌ (సొసైటీ ఫర్‌ ఎలిమినేషన్‌ ఆఫ్‌ రూరల్‌ పావర్టీ) సంస్థ ఏనెబావిని రసాయన రహిత గ్రామంగా ప్రకటించింది. అప్పటి నుంచి సేద్యంలో ఘాటైన రసాయనాల్లేవు. ప్రకృతికి నష్టం కలిగించే క్రిమిసంహారకాల్లేవు. ఆ గాలి స్వచ్ఛం. ఆ నీరు స్వచ్ఛం. ఆ పైరు స్వచ్ఛం. ఆ పంట స్వచ్ఛం.రసాయన సేద్యానికి బానిసైపోయాక రైతుకు పేడఎరువుల అవసరం లేకపోయింది. మూగజీవాల్ని నిర్లక్ష్యం చేశాడు. ఫలితంగా పశుసంపద తగ్గిపోయింది. సేంద్రియ వ్యవసాయం చేపట్టగానే దూరమైపోయిన పశువుల అవసరం గుర్తుకొచ్చింది. ఏనెబావి రైతుల వ్యవసాయ పద్ధతుల గురించి తెలుసుకున్న ఆంధ్రాబ్యాంకు అధికారులు పశువుల్ని సమకూర్చుకోడానికి రుణాలిచ్చారు. ఇంకేముంది, గోధూళితో పల్లె పావనమైపోయింది. ఇప్పుడు అక్కడ, రోజుకు వంద లీటర్ల పాలు ఉత్పత్తి అవుతున్నాయి. ఐదువందలకుపైగా పశుసంపద ఉంది. ఆ ఊళ్లో గేదెలే కాదు, ఆవులూ కనిపిస్తాయి. సేంద్రియ వ్యవసాయంలో గోమాతకు చాలా ప్రాధాన్యం ఇచ్చారు. ఆవు పేడ, పంచితం (మూత్రం), పాలు, పెరుగు, నెయ్యి కలిస్తే..పంచగవ్యం. ఇది చేనుకు చేవనిస్తుంది. ఇక గోమూత్రం, శనగపిండి, బెల్లంతో తయారు చేసే ‘జీవామృతం’ నేలకు రోగనిరోధక శక్తినిస్తుంది. వేపపిండి, వేపనూనె, వేప కషాయం, పొగాకు కషాయం, పచ్చిమిరప, వెల్లుల్లి కషాయం… ఇవే సేంద్రియ సాగులో తిరుగులేని క్రిమిసంహారిణులు. ‘పర్యావరణంలో ప్రతిజీవి ప్రాణమూ విలువైందే..రసాయన ఎరువులు వాడితే శత్రుపురుగుల నాశనం సంగతి దేవుడెరుగు..మేలు చేసే నేస్తాలు కూడా నామరూపాల్లేకుండా పోతాయ్‌.. అందుకే మేం ఏ పురుగులనూ చంపడానికి ఇష్టపడం. సేంద్రియ విధానంలో సాగు చేస్తున్నాం. రెండేళ్లుగా సంప్రదాయ క్రిమిసంహారిణులను కూడా వాడటం లేదు’ అని రైతులు సగర్వంగా చెబుతారు. నిజమే, రైతుకు పంచడమే తెలుసు. చంపడం అతని ప్రవృత్తి కాదు. అయిదు సంవత్సరాలుగా ఏనెబావి రైతులు ఎరువుల దుకాణాలకు వెళ్లడం లేదు. మరీ అవసరమైతే కోడిపెంటను వినియోగిస్తారు. దేశవాళి విత్తనాలనే నాటుతున్నారు. తమ భూమిలో పండిన విత్తనాల్నే తిరిగి వాడుకుంటున్నారు. నల్గొండ జిల్లా చొల్లేరులో జరిగిన విత్తన మేళాలో ఏకంగా 96 రకాల విత్తనాల్ని ప్రదర్శించి అభినందనలు అందుకున్నారు.

అప్పుల తిప్పల్లేవు…

రసాయన ఎరువుల్లేకుండా ఏనెబావి రైతులు పండించిన పంటలు పేరుప్రతిష్ఠల్నే కాదు, సిరిసంపదల్నీ మోసుకొచ్చాయి. పొరుగూళ్లోని షావుకారు దగ్గరికెళ్లి ప్రతి సీజన్లోనూ ట్రాక్టర్లకొద్దీ ఎరువులు తెచ్చుకున్న రైతులు… ఇప్పుడు అటువైపు తొంగి కూడా చూడటం లేదు. ఆ అవసరమే లేకుండా పోయింది. పెట్టుబడుల భారం తప్పింది. అప్పుల వూబిలోంచి బయటపడ్డారు. దానికితోడు, రసాయన ఎరువులు వేయని ఆ పంటల్ని కొనడానికి ఎక్కడెక్కడి ప్రజలో వస్తున్నారు. పంట చేతికి రాకముందే అడ్వాన్సులు ఇస్తున్నారు. ఏనెబావిలో ప్రతిరైతు ఇంట్లో కనీసం ఐదు క్వింటాళ్లకు తక్కువ కాకుండా సన్నబియ్యం నిల్వలు ఉంటాయి. ఇక పప్పుధాన్యాలు, కూరగాయలు కొనాల్సిన అవసరమే లేదు. ఎవరికి పండినా… అందరూ పంచుకుంటారు.

ఆరోగ్య సంపన్నులు

స్వచ్ఛమైన ఏనెబావి గాలి చాలు, ఏ రోగమైనా నయమైపోతుంది. రసాయనాల ఆనవాళ్లు లేని ఆ ఆహారం చాలు, రోగనిరోధకశక్తి ఇనుమడిస్తుంది. దేశమంతా వ్యాపించిన చికున్‌ గున్యా వీరి దరిదాపుల్లోకి రాలేదు. కళ్లకలక వంటి అంటువ్యాధుల వాసన కూడా సోకలేదు. అకాల మరణాల బెడదే లేదు. మూడేళ్ల క్రితం ఓ పండు ముదుసలి మరణించారు. మళ్లీ, ఈ మార్చి 19న మరో పండుముదుసలి కాలం చేశారు. ‘ప్రకృతిని కాపాడుకుంటున్నాం.. ప్రకృతి మమ్మల్ని కాపాడుతోంది’ అంటారా గ్రామస్థులు. ఎవరికీ కేన్సర్‌, గుండె జబ్బు, మధుమేహం వంటి వ్యాధులు రాలేదని సగర్వంగా చెబుతారు. రసాయన ఎరువులు అతిగా వాడటం వల్ల వచ్చే కొన్నిరకాల చర్మవ్యాధులు, శ్వాసకోశవ్యాధులు… వూరి పొలిమేరల్లో కాలుపెట్టడానికి కూడా సాహసించడం లేదు. జలమే జయం! గ్రామ ప్రజలంతా కలిసి జలసంరక్షణ సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఉన్న నీటినే సక్రమంగా వినియోగించుకోవాలని నిర్ణయించుకున్నారు. భూగర్భజలాలను కాపాడుకునేందుకు అంతా ఒక్కటయ్యారు. గ్రామంలో 26 బోర్లు, 11 బావులు ఉన్నాయి. అవసరానికి మించి బోర్లు వేయకూడదని తీర్మానం చేసుకున్నారు. జలసంపద ఎక్కువగా ఉన్నవారు..కొరతలో ఉన్న వారికి సాయం అందించాలనే కట్టుబాటును ఎలాంటి మనస్పర్ధలకూ తావులేకుండా అమలు చేస్తున్నారు. గత మూడేళ్లలో గ్రామంలో కొత్తగా ఒక్క బోరు కూడా వేయలేదు. ఆ అవసరమే రాలేదు. వ్యవసాయంలో విద్యుత్తు పాత్ర కీలకంగా మారింది. ఈ సత్యాన్ని గ్రహించిన రైతులు, పంపుసెట్లకు కెపాసిటర్లను అమర్చారు. 100 శాతం కెపాసిటర్ల అమరికలో రాష్ట్రానికే ఆదర్శమయ్యారు. అనధికారికంగా విద్యుత్తు వాడకూడదని కట్టుబాటుచేసుకున్నారు. అదనపు కనెక్షన్ల కోసం డీడీలు చెల్లించారు.

ప్రశంసలే ప్రశంసలు

ఏనాబవి కీర్తి ఎల్లలు దాటింది. ప్రకృతిని పర్యావరణాన్ని కాపాడుతున్న గ్రామస్థుల కృషికి ప్రశంసలు వెల్లువెత్తాయి. జిల్లా, రాష్ట్రం, దెస సరిహద్దులు దాటిన ఆ వ్యవసాయ విధానం గురించి తెలుసుకునేందుకు ఇప్పటిదాకా 30 వేల మంది రైతులు, వివిధ సంస్థల ప్రతినిధులు ఇక్కడికి వచరని వూరువూరంతా గర్వంగా చెబుతుంది. పొన్నం పద్మ అనే మహిళా రైతు శ్రీలంకకు వెళ్లి తమ విజయాలను వివరించింది. అక్కడి విశేషాలను విధానాలను అధ్యయనం చేసొచ్చి స్థానిక రైతులకు పాటాలు చెప్పింది. ఏనాబవి రైతులు ప్రకృతికి చేస్తున్న మేలు, పర్యావరణాన్ని కాపాడుతున్న తీరూ తెలుసుకున్న యోగా గురువు రాందేవ్ ‘కృషి గౌరవ’ అవార్డును బహుకరించారు. లక్షా నూట పదహారు రూపాయల నగదు పురస్కారాన్ని అందించారు. ప్రభుత్వం వైపు నుంచి సహకారం అందితే మరిన్ని అద్భుతాలు చేస్తామని గ్రామస్తులు అంటున్నారు. వ్యవసాయ అవసరాలకు 100 కెవి ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయాలనీ, తాగునీటి అవసరాలకు ఓ వ్యవస్థను రూపొందించాలని కోరుతున్నారు. సేంద్రియ ఉత్పత్తుల విక్రయానికి ప్రత్యెక దుకాణాల్ని నిర్మించాలని కూడా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. కేంద్ర పర్యావరణ మంత్రి జైరాంరమేశ్‌ వచ్చివెళ్లారు. సాగు పద్ధతుల్లో మార్పును అభినందించారు. కేంద్ర ప్రణాళిక సంఘం సభ్యుడు వీఎల్‌ చోప్రా, సెర్ప్‌ సీఈవో విజయ్‌కుమార్‌ తదితరులు కూడా ఏనెబావిని చూసివెళ్లారు. గతంలో వరంగల్‌ కలెక్టరుగా పనిచేసిన దమయంతి మూడు పర్యాయాలు పర్యటించి రైతులను ప్రోత్సహించారు. పదకొండు దేశాల ప్రతినిధులు వచ్చి పాఠాలు నేర్చుకున్నారు. అయితే, ఇప్పటి వరకూ రాష్ట్ర మంత్రులు కానీ, స్థానిక శాసనభ్యులు కానీ, వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు కానీ… ఇటువైపు తొంగి కూడా చూడలేదు. మనవాళ్లకు దగ్గర్లోని అదు్భతాలు కనిపించవు. దూరపుకొండలు చూడటానికి మాత్రం కోట్లు వెచ్చించి మరీ విదేశాలకు ప్రయాణమవుతారు. అలాంటి పల్లెలు మన అదృష్టం. ఇలాంటి నేతలు మన దురదృష్టం.

మా మంచి పల్లె

  • ఏనెబావి రైతులు సేంద్రియ వ్యవసాయ విధానంలోనే కాదు… జీవన విధానంలోనూ నలుగురికీ ఆదర్శంగా   నిలుస్తారు. పండుగపబ్బాలప్పుడు తప్పించి… మాంసాహారం జోలికి వెళ్లరు. ఊళ్లో గుడుంబా గుప్పు      మనదు. కొద్దిమంది మాత్రం, తమ పొలాల్లో దొరికే తాటికల్లును మాత్రమే సేవిస్తారు.
  • ఏ ఇంట్లో తోరణం కట్టినా ఊరంతా పండగే. అందరికీ విందు భోజనమే.
  • గ్రామ ప్రజలకు చదువు విలువ తెలుసు. ఇంగ్లీషు అవసరం తెలుసు. అందుకే రోజూ 13 మంది  చిన్నారులు ఆటోలో జనగామ దాకా వెళ్లి కాన్వెంట్‌ చదువులు చదువుకుంటున్నారు. నలుగురు  యువకులు డిగ్రీ పూర్తి చేశారు. అయినా, మట్టి మీద మమకారంతో సేద్యంలోనే స్థిరపడాలని  నిర్ణయించుకున్నారు.
  • పల్లెకు పోలీసుల అవసరమే లేదు. ఏ సమస్య వచ్చినా తమలో తామే పరిష్కరించుకుంటారు.  పోలీస్‌స్టేషన్లు, న్యాయస్థానాల గడప తొక్కే అవసరం ఎప్పుడూ రాలేదని గ్రామపెద్ద పొన్నం మల్లయ్య  సగర్వంగా చెబుతారు.
  • ఈ పల్లె నుంచి ఏకగ్రీవంగా ఓ సభ్యుడిని ఎన్నుకుని గ్రామపంచాయతీకి పంపుతారు. ఇప్పటిదాకా పోటీ  లేదు. భవిష్యత్‌లోనూ ఉండబోదంటారు.
  • ఏనెబావిలో ఒక్క గుడిసె కూడా కనిపించదు. అన్నీ పక్కా ఇళ్లే! గ్రామానికి తారు రోడ్డు తెచ్చుకున్నారు.  ఊరంతటికీ ఒకే వీధి… ఆ వీధికి సిమెంటు రోడ్డు వేయించుకున్నారు. ప్రతి ఇంటిమీదా సేంద్రియ  వ్యవసాయం, జలసంరక్షణ, పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన నినాదాలే చిరునామాల్లా దర్శనమిస్తాయి.
  • ఎవరికి ఏ కష్టం వచ్చినా.. అది అందరిదీ. అంతా అండగా ఉంటారు. గ్రామంలోని రైతులు శ్రీరామ, మంజునాధ, కాకతీయ రైతుసంఘాలలో సభ్యులుగా ఉన్నారు. ఈ సంఘాలన్నీ ‘ఏనెబావి సేంద్రియ రైతు సంఘం’ నాయకత్వంలో పనిచేస్తాయి. గ్రామంలోని రైతు శిక్షణ భవనంలో సమావేశాలను నిర్వహిస్తారు. నెలకు ఇరవై రూపాయల చొప్పున పొదుపుచేసి, అవసరమైన వారికి అప్పుగా ఇస్తారు. మహిళలు క్రాప్స్‌, ఇతర సంస్థల పరిధిలో పొదుపు సంఘాలను ఏర్పాటు చేసుకున్నారు.
  • అసలే చిన్న గ్రామం. అన్ని వృత్తులవారూ లేకపోవడం ఓ సమస్యే. దీంతో వ్యవసాయానికి అవసరమైన నాగలి తదితర పరికరాలను తామే తయారు చేసుకుంటారు. ఒక్కో కుటుంబం ఒక్కో వృత్తిలో నైపుణ్యాన్ని సాధించింది.
  • అవసరమైనప్పుడు రైతులే కూలీల అవతారమెత్తుతారు. ఒకరి అవసరాలకు మరొకరు వెళ్లి పనులు చేస్తారు. నాట్లు ఎక్కువగా ఉన్నప్పుడూ తామంతా సరిపోనప్పుడు మాత్రమే.. పొరుగూళ్ల సాయం తీసుకుంటారు.

ఏనెబావికి వెన్నెముక… ఏనెబావి కీర్తి ప్రతిష్ఠలు, రైతుల అభివృద్ధి, సుస్థిర వ్యవసాయం, రసాయనాల్లేని వాతావరణం..ఇన్ని విజయాలకు ప్రధాన కారణం జనగామలోని క్రాప్స్‌ సంస్థ. బొంతపురుగు నివారణ ఉద్యమం ద్వారా రైతులకు చేరువైన ఆ సంస్థ వ్యవస్థాపకుడి పేరు రేకల లింగయ్య, వ్యవసాయ శాస్త్ర పట్టభద్రుడు. ఎస్‌.ఆర్‌.శ్రీనివాస్‌, మహేందర్‌, గిరిబాబు, నర్మద, విష్ణు, లక్ష్మీనారాయణలతో పాటు మరో 12 మంది ఆయన బృందంలో సభ్యులు. సేంద్రియ వ్యవసాయ విధానాన్ని ఆచరించేలా ఓర్పుతో రైతులను ఒప్పించగలిగారు. చెరువు మట్టి తరలింపులో, కోళ్లపెంట సరఫరాలో, వర్మీకంపోస్టు, గోమూత్ర సేకరణశాలల నిర్మాణం, పాడి పశువుల కొనుగోలుకు రుణాలు…ఇలా ఎన్నో విషయాల్లో ఏనెబావి రైతులకు అండగా నిలిచింది క్రాప్స్‌. సంప్రదాయ ఎరువుల తయారీలో శిక్షణ ఇచ్చింది. శ్రీవరిసాగు ఉద్యమానికి తెరతీసింది. ‘మేం దారి చూపాం. గ్రామస్థులు నమ్మకంతో మావెంట నడిచారు. శ్రమించారు. ఫలితాలు సాధించారు. ఏనెబావిని ఆదర్శంగా నిలిపారు. తమ విజయాల్లో మాకూ స్థానం కల్పించారు. చాలా సంతోషంగా ఉంది. అయితే ఈ మార్పు.. ఈ ప్రయోగం.. ఇక్కడితో ఆగిపోకూడదు. ఇంకా ముందుకెళ్లాలి. ప్రభుత్వం కూడా గుర్తించాలి. ప్రోత్సహించాలి’ అంటారు రేకల లింగయ్య.

బిటి పత్తి .. ఆకాంక్షలు .. అనుభవాలు..

http://www.prajasakti.com/science/article-229743

విజ్ఞాన వీచిక డెస్క్ Wed, 4 May 2011, IST

రైతులు ఎదుర్కొంటున్న సంక్షోభాన్ని పరిష్కరిస్తూ వ్యవసాయోత్పత్తుల అవసరాల్ని 21వ శతాబ్దంలో కూడా తీర్చడానికి రెండవ (లేదా) నిరంతర హరిత విప్లవం కావాలని పాలకులు చెపుతున్నారు. హరిత విప్లవ కాలం (1965-85) లో వ్యవసాయోత్పత్తిలో సాధించిన విజయాలు, పరిమిత స్థాయిలోనైనా, వ్యవసాయమే జీవనాధారంగా కలవారి నిజాదాయాల్ని పెంచింది. ఆ తర్వాత అమలుచేసిన సరళీకరణ, ప్రపంచీకరణ విధానాల దుష్ప్రభావాల నేపథ్యంలో ‘మరో హరితవిప్లవం’ అవసరమని పాలకులు చెపుతున్నారు. కానీ, కొత్తగా తీసుకురావాలంటున్న హరిత విప్లవంలో రైతుల, వినిమయదారుల స్థానమేంటో స్పష్టం చేయడంలేదు. మరో హరిత విప్లవం యొక్క స్వరూప, స్వభావాల్ని కూడా వివరించడం లేదు. రైతుల బాగోగులు, వినిమయదారులకు వ్యవసాయోత్పత్తులను అతి తక్కువ ధరకు అందించాలనే ప్రధాన లక్ష్యంతో మొదటి హరితవిప్లవ కాలంలో విధానాలు రూపొందించారు. అందువల్ల ఈ హరితవిప్లవ వల్ల వచ్చిన విజయాలు అందర్నీ ఆకట్టుకున్నాయి. కానీ, ప్రపంచీకరణ విధానాలన్నీ మౌలికంగా కార్పొరేట్‌ సంస్థల బాగోగులను, వాటి లాభాలను కేంద్రబింధువుగా చేసుకుని, నిర్ధారిస్తున్నారు. జీవ-సాంకేతిక విజ్ఞానంతో రూపొందించే కొత్తరకాలు, వ్యవసాయరంగ కార్పొరేటీకరణ ‘మరో హరిత విప్లవాని’కి కీలకమని పాలకులు సూచాయగా చెప్తున్నారు. ఈ నేపథ్యంలో, బిటి పత్తి ద్వారా పెరిగిన ఉత్పత్తిని ఒక ఉదాహరణగా చూపెడు తూ మరో హరిత విప్లవంలో జన్యుమార్పిడి పంటలు తప్పవనీ వీరు చెపుతున్నారు. కానీ, ‘జన్యుమార్పిడి పంటలన్నీ ఒకే విధమైనవి కావని’ నిపుణుల చర్చల్లో అంగీకరించినా, ప్రచారంలో పూర్తి వాస్తవాల్ని వెల్లడించడం లేదు. కాగా, బిటి దుష్ప్రభావాలను కప్పిపుచ్చడానికి జన్యుమార్పిడి సాంకేతిక ఇతర ప్రయోజనాలను వాదనలలో ముందుకు తెస్తున్నారు. బిటి పత్తి సేద్యం 2002-03లో అధికారికంగా ప్రారంభమై ఇప్పటికి తొమ్మిదేళ్లు గడిచింది. దీని అనుభవాల విశ్లేషణ జన్యుమార్పిడి పంటల విషయంలో నిర్ణయాలు తీసుకోవడానికి తోడ్పడుతుంది. దీనికి వీలుగా బిటి పత్తి ద్వారా అనూకలంగా రేకెత్తించిన ప్రయోజనాలను, వచ్చిన అనుభవాలను ప్రొఫెసర్‌ అరిబండి ప్రసాదరావు సహకారంతో రేఖామాత్రంగా వివరిస్తుంది ఈ వారం ‘విజ్ఞానవీచిక’. బిటి పత్తి వల్ల సస్యరక్షణ మందుల వాడకం తగ్గుతుందని, స్ప్రే చేయాల్సిన శ్రమ తగ్గిపోతుందని, ఉత్పత్తి పెరుగుతుందని, తద్వారా ఉత్పత్తి, ఉత్పాదకత పెరుగుతుందని, రైతుల ఆదాయం పెరుగుతుందని వీటిని ప్రవేశపెట్టిన ‘మహికో-మోన్‌శాంటో’ కంపెనీ ప్రచారం చేసింది. రైతులు దీన్నే ఆశించారు. కానీ రైతుల అనుభవాలు దీనికి విరుద్ధంగా ఉన్నాయి. అనుభవాలు.. మన రాష్ట్రంలో 2002-03లో 9,310 ఎకరాలతో ప్రారంభమైన బిటి పత్తి సేద్యం 2010-11 నాటికి 44.87 లక్షల ఎకరాలకు పెరిగింది. మొత్తం సేద్యమయ్యే 45.43 లక్షల ఎకరాల్లో 98.9 శాతం బిటి పత్తే. ఈ కాలంలో దూది ఉత్పత్తి 10.87 లక్షల బేళ్లు (170 కిలోలవి) నుండి 57.81 లక్షల బేళ్లకు పెరిగింది. దూది ఉత్పాదకత ఈ కాలంలో ఎకరానికి 85 కిలోల నుండి 218.3 కిలోలకు పెరిగింది. ఇదంతా బిటి సాంకేతికం వల్లే సాధ్యమైందని బయో టెక్నాలజీ లాబీ చెపుతోంది. కాటన్‌ కార్పొరేషన్‌ సమీక్ష దీనికి విరుద్ధంగా ఉంది. రాష్ట్రంలో బిటి జన్యువు కలిగిన ఎంఇసిహెచ్‌ 162, 12, 164 హైబ్రీడ్‌ రకాలు 2002-03లో మొదట ప్రవేశపెట్టబడ్డాయి. ఇవి అప్పటికే సేద్యం చేయబడుతున్న ‘బన్నీ, బ్రహ్మ’ రకాలకన్నా దిగుబడి తక్కువగా ఇస్తుండటంతో వీటివల్ల రైతులు ఎంతో నష్టపోయారు. పరిహారం చెల్లించాలని ఆందోళన చేశారు. బ్రహ్మ, బన్నీ రకాల్లో బిటి జన్యువుల్ని ప్రవేశపెట్టిన తర్వాత మాత్రమే (2005-06) బిటి పత్తి రాష్ట్రంలో నిలదొక్కుకుంది. పత్తి దిగుబడి ఆ తర్వాత మొత్తం మీద పెరిగింది. స్వతహాగా దిగుబడి పెంచే స్వభావం బిటి సాంకేతికానికి లేదని ఈ ధోరణి తెలియజేస్తుంది. బిటి జన్యువులు పెట్టిన రకాల సామర్థ్యం మీద ఉత్పత్తి ప్రధానంగా ఆధారపడి ఉంటుందని కూడా ఇది సూచిస్తుంది. అప్పటి నుండే బిటి విస్తీర్ణం పెరిగింది. బిటి సాంకేతికం దిగుబడిని పెంచు తుందనే కంపెనీ వాదన తప్పని ఇది నిరూపిస్తుంది. ఇతర విత్తన కంపెనీలను కొనేయటం (లేదా) నియం త్రించే మేర షేర్లను సంపాదించడంతో బిటి పత్తి (మోన్‌ శాంటో-బోల్‌గార్డ్‌) రాష్ట్రం మొత్తం వ్యాపింపజేయడానికి, 98.9 శాతం మేర విస్తరింపచేయడానికి సాధ్యమైంది. తద్వారా పత్తి సేద్యం పై మహికో మోన్‌శాంటో గుత్తాధిపత్యాన్ని సంపాదించింది. ఇప్పుడు రైతులు బిటియేతర రకాల్ని వేయాలన్నా విత్తనాలు దొరకని దుస్థితి. అందువల్ల, బిటి విస్తీర్ణం పెరగడమే బిటి సాంకేతిక పరిజ్ఞాన సామర్థ్యానికి సాక్ష్యమని, మరోసాక్ష్యం అవసరంలేదని కంపెనీచేసే వాదన అసంబద్ధమైంది. ఉత్పాదకత… బిటి దూది దిగుబడి 2010-11లో ఎకరానికి 218.3 కిలోలు కాగా, బిటియేతర దిగుబడి 367.8 కిలోలు. 2002-10 మధ్య కాలంలో వార్షిక బిటి, బిటియేతర దూది దిగుబడి వివరాలను పరిశీలిస్తే ఈ ధోరణి కనిపిస్తుంది. (వివరాలు ఇవ్వడం లేదు.) బిటి పత్తి దిగుబడి (2009-10లో తప్ప) అటూ ఇటూ కొద్ది తేడాతో బిటియేతర పత్తితో సమానంగా ఉంది. 2010-11లో బిటి పత్తి దిగుబడి (218.3 కిలోలు), బిటియేతర పత్తి (367.8 కిలోలు) కన్నా చాలా తక్కువగా ఉంది. కాటన్‌ కార్పొరేషన్‌ గణాంకాల ప్రకారం 2009-10లో బిటి దూది దిగుబడి ఎకరానికి 238.4 కిలోలు. ఈ గణాంకాలు 2010-11లో బాగా తగ్గిన బిటి ఉత్పాదకతను తెలుపుతుంది. 2010-11లో పెరిగిన వర్షపాతం, వర్షపాతంలో తీవ్ర హెచ్చుతగ్గులు దీనికి కారణంగా భావించవచ్చు. బిటి కన్నా బిటియేతర హైబ్రీడ్‌ రకాలు వాతావరణ ఒడిదుడుకులను సమర్థవంతంగా తట్టుకోగలవని ఈ ధోరణి తెలియజేస్తుంది. వ్యవసాయోత్పత్తుల ఖర్చులు, ధరల కమిషన్‌ 2009-10 నివేదిక ప్రకారం (పేరా-2.102) తమిళనాడులో బిటి విస్తీర్ణం మొత్తం పత్తి విస్తీర్ణంలో 32శాతమే కాగా, సగటు ఎకరా దూది దిగుబడి 390.8 కిలోలు. ఇది ప్రపంచ సగటు దిగుబడి కన్నా (293.6 కిలోలు) చాలా ఎక్కువ. కానీ, ఇదే సంవత్సరం ఆంధ్రప్రదేశ్‌లో బిటి విస్తీర్ణం మొత్తం పత్తి విస్తీర్ణంలో 95 శాతం అయినప్పటికీ, రాష్ట్ర సగటు దిగుబడి 246.7 కిలోలు మాత్రమే అని ఈ నివేదిక తెలిపింది. ఈ సగటు దూది దిగుబడి ధోరణులు మొత్తం మీద అధిక దిగుబడికి ‘బిటి సాంకేతికం తప్పనిసరి’ అనే వాదన సరైంది కాదని నిర్ధారిస్తోంది. ఇతర రాష్ట్రాల గురించి కూడా నివేదికలో ఇదే ధోరణి కనిపించింది. సాంకేతిక లోపాలు.. రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఏ బిటి పత్తిరకాన్ని విడుదల చేయలేదు. బిటి రకాలపై కొన్ని ప్రయోగాలు చేసింది. రైతుల చేలల్లో బిటి సేద్యాన్ని పర్యవేక్షించి, వీటి అనుభవాల ఆధారంగా 2011-12 వ్యవసాయ పంచాంగం ద్వారా కొన్ని సూచనలను రైతులకు అందించింది. వీటిలో కొన్ని: * గతంలో (బిటియేతరలో) తక్కువస్థాయిలో ఉన్న పిండినల్లి ఉధృతి బిటిలో పెరిగింది. ప్రతికూల పరిస్థితుల్లో బిటి రకాల్లో సాధారణ పరిస్థితులు పునరుద్ధరించినపుడు చిగురించే శక్తి తక్కువగా ఉంది. * బిటితో పాటు బిటియేతర ఎరపంట లేకపోతే పురుగులు నిరోధకశక్తి పెంచుకోవచ్చు. * బిటి పత్తిలో మొక్క ఎదుగుదల తక్కువ. మొక్కల సంఖ్యను పెంచాల్సి ఉంటుంది. * రసం పీల్చు పురుగుల నివారణలో ప్రత్యేక శ్రద్ధ వహించాలి. అవసరాన్ని బట్టి కీటకనాశక స్ప్రేలను పెంచాలి. * బిటి రకాల్లో పోషకలోపాలు అధికంగా రావచ్చు. ఈ లోపాల్ని గుర్తిస్తూ నివారణ చర్యలు తీసుకోవాలి. * బిటి పత్తిలో పండాకు తెగులు పక్వానికి రాకుండా ఆకులు రాలిపోవడం ఎక్కువగా గమనించబడింది. వీటి నివారణకు చర్యలు తీసుకోవాలి. ఈ సూచనలన్నీ బిటి పత్తి సాంకేతిక లోపాలకు నిర్ద్వంద్వ సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. సేద్య విస్తరణ కారణాలు.. బిటి విస్తరణకు అసలు కారణాలను భారత కాటన్‌ కార్పొరేషన్‌ 2009-10 నివేదికలో వివరించింది. మిగతా పంటలకన్నా పత్తికి మంచి ధర లభించడం ఒక కారణంగా ఇది వివరించింది. దీని వివరాలను పరిశీలిద్దాం.. ఉదా: ఎస్‌-8 రకంలో 2006-07, 07-08, 08-09, 09-10, 10-11 సంవత్సరాల్లో సగటు క్వింటాలు పత్తి ధర వరుసగా రూ.2,286, 2,613, 3,850, 3,226, 4,394కు పెరిగింది. ఇదే ధోరణి మిగతారకాల్లో కూడా కొనసాగింది. అందువల్ల, రాష్ట్రంలో 2006-11 మధ్యకాలంలో విస్తీర్ణం 24.2 నుండి 46.75 లక్షల ఎకరాలకు, ఉత్పత్తి 21.78 నుండి 57.81 లక్షల బేళ్లకు పెరిగింది. అనుకూలంగా ఉన్న పత్తి ధరలు ఇతర పంటల నుండి పెట్టుబడులను ఆకర్షించాయి. (40వ యాన్యువల్‌ జనరల్‌ బాడీ మీటింగ్‌ సందర్భంగా కాటన్‌ కార్పొరేషన్‌ 27 ఆగస్టు 2010న విడుదల చేసిన ప్రెస్‌నోట్‌). అనుకూల ధరలు ఈ పైరుపై యాజమాన్య కేంద్రీకరణను పెంచింది. ఇవన్నీ పత్తి ఉత్పాదకత పెరుగుదలకు దోహదపడ్డాయి. దుష్ప్రభావాలు.. * ప్రభుత్వ పరిశోధన, విస్తరణ, మార్కెట్‌ సేవల మద్దతు నిర్వీర్యం. * గుత్తాధిపత్య ఆవిర్భావం, ప్రపంచీకరణకు సుగమ మార్గం. * విత్తన ఎంపిక, కొనుగోలు, సేద్య సాంకేతికం, ధర, అమ్మకాలలో హరించిన రైతు స్వేచ్ఛ. * చేలో పనిచేసే వారికి అలర్జీ, చర్మ, శ్వాసకోశ వ్యాధులు. * ఆకులు తినే జీవాలకు, పశువులకు అనారోగ్యం లేదా చనిపోవడం. * భూసారం క్షీణించి, ఆ తర్వాత తగ్గిన పంట దిగుబడి. * పత్తి తీత కష్టతరం. * చేలో పనిచేసే మహిళలకు గర్భస్రావాలు, పశువుల్లో ప్రత్యుత్పత్తి సమస్యలు. అత్యుత్తమమా..? సస్యరక్షణ కోసం అందుబాటులో ఉన్న అత్యుత్తమ సాంకేతిక పరిజ్ఞానం సమగ్ర సస్యరక్షణ అని భారత వ్యవసాయ పరిశోధనా మండలి గుర్తించింది. ఈ పద్ధతిలో పురుగుల ఉధృతి (సమస్య) అధికంగా, నష్టదాయకంగా ఉన్నప్పుడు మాత్రమే, అదీ చివరి ఆయుధంగా, సస్యరక్షణ మందు వినియోగాన్ని సూచిస్తున్నారు. కానీ, బిటి ప్రక్రియలో చీడపీడల ఉధృతి, అవసరంతో నిమిత్తం లేకుండా మొక్కల్లో నిరంతరం అంతర్గతంగా విషపదార్థం ఉత్పత్తి అవుతూనే ఉంటుంది. ఈ విషం మొక్కల అన్ని భాగాల్లో విస్తరిస్తుంది. ఇది వాతావరణంలో విషపదార్థాల పరిమాణాన్ని అధికం చేస్తుంది. అందువల్ల, బిటి ప్రక్రియలో నిరోధక శక్తి ఆవిర్భావం సర్వసామాన్యం. ఇప్పుడు మోన్‌శాంటో కంపెనీనే బోల్‌గార్డ్‌-1 రకంలో పింక్‌ బోల్‌వర్మ్‌లకు నిరోధకశక్తి కొన్ని ప్రాంతాల్లో వచ్చిందని ఒప్పుకుంటుంది. ప్రత్యామ్నాయంగా బోల్‌గార్డ్‌-2 విత్తనరకాలను వాడాలని సూచిస్తుంది. దీనితోపాటు కాయతొలుచు పురుగుల ఉధృతాన్ని గమనిస్తూ సస్యరక్షణ మందులను కాయతొలుచు పురుగులకు కూడా స్ప్రే చేయా లని సూచిస్తే మరి బిటి సాంకేతిక అసలు లక్ష్యం ఏమౌ తుంది? బిటి సాంకేతికంలో స్థిరత్వం లేదని కూడా ఈ పరిణామాలు తెలుపుతున్నాయి. మన రాష్ట్రంలో ఈ నిరోధక శక్తి ఎప్పుడో వచ్చిందని స్వచ్ఛంద సంస్థలు తెలిపాయి. దీనిని కంపెనీ నిర్ధారించకున్నా, బోల్‌గార్డ్‌-2 రకాల్ని సరఫరా చేస్తుంది. కీటక ఉధృతాన్ని బట్టి మందుల్ని స్ప్రే చేయమని చెప్తోంది. ఇది అసలు బిటి రకాల ఉద్దేశ్యాన్నే ప్రశ్నిస్తోంది. రాష్ట్రంలో ఇపుడు 280కి పైగా గుర్తించబడిన బిటి హైబ్రిడ్‌ రకాలను వివిధ కంపెనీలు అమ్ముతున్నాయి. వీటిలో ఏ ప్రాంతానికి ఏ రకం అత్యుత్తమమని ఎవరూ చెప్పలేకపో తున్నారు. ఈ విషయంలో రైతులకు సలహాలు ఇవ్వడంలో వ్యవసాయ శాఖ నిస్సహాయ స్థితిలో పడింది. మౌనం వహి స్తుంది. కేవలం కంపెనీ ప్రచార ఉధృతం ఆధారంగా రైతులు వేసే రకాల్ని ఎంపిక చేసుకోవాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో పత్తి సేద్యంలో బిటి అత్యుత్తమ, శ్రేష్ఠమైన సాంకేతికాన్ని అందిస్తుందని భావించలేం. రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంలో 2006-08 ప్రాంతంలో చేసిన ప్రయోగాల్లో బిటి పత్తి సేద్యం కన్నా సమగ్ర సస్యరక్షణతో బిటియేతర హైబ్రిడ్‌ పత్తి సేద్యం వల్ల సస్యరక్షణ మందుల వాడకం సగానికిపైగా (హెక్టారుకు 8725 నుండి 4000 మిల్లీలీటర్లకు) తగ్గుతుందని, రైతులకు నికర లాభం పెరుగుతుందని (హెక్టారుకు రూ.2465) నిర్ధారించింది. (రమేష్‌బాబు తదితరులు 2009లో సస్యరక్షణపై రూపొందిం చిన ఐసిఏఆర్‌ ట్రైనింగ్‌ మాన్యువల్‌ పేజీ 139-140). కారణా లు ఏమైనప్పటికీ, వ్యవసాయ విశ్వవిద్యాలయం ఈ ఫలితా లను రైతులకు అందించడం లేదు. ఫలితంగా పత్తి రైతులకు అత్యుత్తమ సాంకేతిక పరిజ్ఞానం అందడం లేదు. నికర ఆదా యాల్ని కోల్పోతున్నారు. ప్రభుత్వ విస్తరణ సేవలు బలహీన పడుతూ అదే సమయంలో ప్రైవేట్‌ కంపెనీలు, వ్యాపారస్తుల విస్తరణ సేవలు బలపడటమే దీనికి ప్రధాన కారణం. లోపాల్ని కప్పిపుచ్చుతున్న మార్కెట్‌ ధరలు.. ఈ సంవత్సరం అంతర్జాతీయంగా దూది ఉత్పత్తి తగ్గడం వల్ల ధరలు అనూహ్యంగా పెరిగాయి. 2010 మార్చి చివరలో దేశీయ రకం పత్తి ధర క్వింటాలుకు రూ.2,750 కాగా, 2011 సంవత్సరం ఇదే కాలంలో రూ.5,840కి పెరిగింది. ఇదేవిధంగా ఎస్‌6 రకం రూ.3,325 నుండి రూ.6,850కి పెరిగింది. (కాటన్‌ కార్పొరేషన్‌ ధరల సమాచారం). ఇలా రెట్టింపుకు పైగా పెరిగిన ధరల వల్ల 2010-11లో పత్తి దిగుబడి తగ్గినా రెట్టింపుకు పైగా ధర పెరగడంతో బిటి పత్తి రైతులు సంతోషంగా ఉన్నారు. మిగతా పంటలతో పోల్చినపుడు పత్తి ధరలు అనుకూలంగా ఉండటంతో, బిటి సాంకేతిక సామర్థ్యంతో సంబంధం లేకుండా బిటి పత్తి సేద్యం 2011-12లో విస్తరిస్తుందని వ్యవసాయ శాఖ చెపుతుంది. దాదాపు 50 లక్షల ఎకరాల్లో బిటి పత్తి సేద్యం విస్తరిస్తుందని అంచనా వేస్తుంది. సాంకేతిక ఎంపికలో మార్కెట్‌ ధరల ప్రభావం గణనీయంగా ఉంటుందని ఈ అనుభవం చెపుతోంది. ప్రపంచ మార్కెట్‌ ‘స్వేచ్ఛ’ పేరుతో పనిచేస్తున్నప్పటికీ అంతర్జాతీయ ఫైనాన్స్‌ పెట్టుబడి గుప్పిట్లో అత్యంత నియంత్రిత ధోరణితో మార్కెట్‌ పనిచేస్తుందని గమనంలో ఉంచుకోవాలి. మన రాష్ట్రంలో బిటి పత్తి ఇప్పటికే 98.8 శాతం విస్తరించి ఉంది. బిటియేతర విత్తనాలు కూడా మార్కెట్‌లో లభ్యం కావడంలేదు. రైతులకు ప్రత్యామ్నాయం కూడా లేదు. ఇక రైతులు స్వచ్ఛందంగా ఎంపిక చేసుకునే అవకాశం ఎక్కడుంది? గమనిక: ఈ పేజీపై మీ స్పందనలను 9490098903కి ఫోను చేసి తెలియజేయండి.