రైతాంగంపై వాతావ‘రణం’!

భూవాతావరణంలో వస్తున్న పెనుమార్పుల ప్రభా వం మనకు నిత్యమూ అనుభవంలోకి వస్తూనే ఉంది. వ్యవసాయం ప్రధానంగా వాతావరణంపై ఆధారపడి సాగే ఉత్పత్తి కార్యకలాపం. నిజానికి వాతావరణంలోని మార్పులు, వ్యవసాయం పరస్పరం ప్రభావాన్ని నెరపుతుంటాయి. వాతావరణంలోని మార్పు ల ప్రభావాన్ని తక్కువగా అంచనావేయడం తరచుగా జరుగుతోంది. అలాగే వాతావరణంపై వ్యవసాయం కలుగజేస్తున్న మార్పులను కూడా చిన్నచూపు చూస్తు న్నాం. అందువల్లనే సాధారణంగా వాతావరణ మార్పులకు అనుగుణమైన వ్యవసాయ పద్ధతులు, సాంకేతిక పరిజ్ఞానం చుట్టూనే చర్చలు సాగుతుం టాయి. నిజంగానే వాతావరణ మార్పులకు అనువైన సేద్య పద్ధతులను రూపొందించాలన్నా, అమలు చేయాలన్నా ముందుగా వ్యవసాయం, వాతావరణాల మధ్య పరస్పర ప్రభావ సంబంధాలను సమగ్రంగా అర్థం చేసుకోవడం అవసరం. భారత రైతాంగం ఇప్పటికే అనుభవిస్తున్న జీవావరణ, ఆర్థిక, సామాజిక రాజకీయ సంక్షోభపు విశాల నేపథ్యం నుంచి వాటిని అవగాహన చేసుకోవడం అంతకంటే అవసరం.

వ్యవసాయానికి, వాతావరణ మార్పులకు మధ్య సంబంధం త్రిముఖమైనది. ఒకటి, వృక్ష, జంతు, జీవప్రక్రియలపై వ్యవసాయంలోని మార్పులు కలుగజేసే ప్రత్యక్ష ప్రభావం. రెండు, నేలలోనూ, నేలలోని తేమలోనూ వచ్చే మార్పులు, చీడపీడలూ, వ్యాధులూ తదితర వ్యవసాయ జీవావరణ సంబంధమైన మార్పులు. మూడు భూతాపం పెరుగుదలతో వాతావరణంలో వస్తున్న మార్పుల రీత్యా ఎదురవుతున్న సవాళ్లను ఎదుర్కోవడంలో ప్రత్యేకించి గ్రామీ ణ ప్రాంతాలలో ప్రస్తుతం ఉన్న సామాజిక, ఆర్థికసంస్థల శక్తిసామర్థ్యాలు.

వ్యవసాయంపై వాతావరణ మార్పుల ప్రభావం

వాతావరణ మార్పులు దేశవ్యాప్తంగా పలు విధాలుగా రూపు తీసుకుంటాయి. ప్రాంతీయమైన తేడాలున్నా దేశవ్యాప్తంగా పలుచోట్ల వేసవిలో వర్షపాతం పెరగడం, మొత్తంగా వర్షం కురిసిన రోజుల సంఖ్య తగ్గడం కనిపిస్తోంది. ఇక ఉష్ణోగ్రతలకు సంబంధించి గత వందేళ్లలో 0.6 డిగ్రీల సెల్సియస్ పెరుగుదల మాత్రమే ఉంది. కానీ 2100 నాటికి ఉష్ణోగ్రతలో పెరుగుదల 3.5 నుంచి 5 డిగ్రీల సెల్సియస్ వరకు పెరగవచ్చని అంచనా. బొగ్గుపులుసు వాయువు సాంద్రత మాత్రం ఏడాదికి 1.9 పీపీఎం మేర పెరుగుతోంది. 2050 నాటికి అది 550 పీపీఎంలకు చేరుతుంది. అతి వేడి, అతి శీతల గాలులు, దుర్భిక్షాలు, వరదలు వంటి అసాధారణ వైపరీత్యాలు ఇప్పటికే మన అనుభవంలోకి నిత్యం వస్తూనే ఉన్నాయి. భారత వ్యవసాయం ప్రధానంగా వర్షాధారం. వాతావరణ మార్పుల కారణంగా వర్షపాతంలో మార్పులు సంభవిస్తాయని పరిశోధనలు ఎప్పుడో తేల్చి చెప్పాయి. రుతుపవనాలు, వాతావరణం, నీటి వనరుల మధ్య సన్నిహిత సంబంధం ఉంది. ఉదాహరణకు దేశంలో మొత్తంగా పంట వేసిన ప్రాంతంలో మూడింట రెండువంతులు క్షామపీడిత ప్రాంతమని, 4 కోట్ల హెక్టార్లు వరదలకు గురయ్యే ప్రాంతమని అంచనా. వాతావరణ మార్పుల తాకిడికి ఎక్కువగా గురయ్యేది నిరుపేద రైతులే. వాళ్లు ప్రధానంగా వర్షాధార భూములపైనా, చేపల పెంపకంపైనా ఆధారపడి ఉంటారు. పైగా వారి భూములు నిస్సారమైనవిగా, వరదలకు గురయ్యేవిగా ఉంటాయి. వాతావరణ మార్పులను తట్టుకోగలిగిన ఆర్థిక స్థోమత వారికి ఉండదు.

వాతావరణంలోని మార్పుల ఫలితంగా నేలలోని జీవసేంద్రియ పదార్థాలు, తేమ స్థాయి తగ్గుతుంది. భూసారం కొట్టుకుపోతుంది. ఫలితంగా పంట స్వభావంలో మార్పులు సంభవిస్తాయి. నైట్రోజన్, ప్రొటీన్‌లస్థాయి తగ్గి, ఎంజైమ్‌లస్థాయి పెరుగుతుంది. వరిలో జింకు, ఇనుము శాతం తగ్గి, జంతువుల పునరుత్పత్తి క్షీణిస్తుంది. దీంతో చీడపీడలు పెరిగిపోతాయి. క్లుప్తంగా చెప్పాలంటే భూతాపం పెరగడం వల్ల నీరు ఆవిరై, వాతావరణంలో సగటు ఆవిరి పెరుగుతుంది. రుతుపవన సంవిధానంలో గణనీయమైన మార్పులు చోటుచోసుకొని సుదీర్ఘమైన వర్షాభావానికి, కుంభవృష్టికి దారితీస్తాయి. తుఫానుల క్రమంలోనూ మార్పులు వస్తాయి. ఫలితంగా చీడపీడలు, తెగుళ్లు, వ్యాధికారక క్రిములు విస్రృతంగా ఒక చోటి నుంచి మరో చోటికి వ్యాప్తి చెందుతాయి.

చీడపీడలు, తెగుళ్లు, వ్యాధుల సంబంధమైన మార్పులు

వ్యవసాయ జీవావరణ వ్యవస్థలలో నేల, మొక్కలు, జంతువుల మధ్య నిరంతర సంసర్గం, చలనశీలమైన సమతూకం అవసరం. ఈ జీవావరణ వ్యవస్థ సమతూకంలో వచ్చే మార్పులతోపాటూ చీడపీడలు, వ్యాధులలో కూడా మార్పులు రావడం కనబడుతుంది. పంటల పద్ధతులు, చీడపీడల నివారణ పద్ధతులలోని మార్పుల మూలంగా హానికరమైన, మేలుచేసే క్రిమికీటకాల మధ్య సహజమైన సమతూకం దెబ్బతినిపోతుంది. వాతావరణ మార్పులు నేరుగా చీడపీడలు పెరగడానికి దోహదం చేస్తాయి.
జీవరాశి అంతా అత్యంత పరిమితమైన ఉష్ణోగ్రతా పరిధుల మధ్యనే మనుగడ సాగించగలుగుతుంది. ఆవశ్యకమైన ఉష్ణోగ్రతా పరిధుల తర్వాత కొంత అవధి దాటిన వెంటనే ఆయా జాతుల మనుగడకు ముప్పు ఏర్పడుతుంది. సాధారణంగా హానికారకమైన క్రిమికీటకాలు, చీడ పీడలకంటే వాటిని ఆశించిబతికే మేలుకలుగజేసే క్రిమికీటకాలకు ఉష్ణోగ్రతలోని హెచ్చుతగ్గులను తట్టుకునే శక్తి తక్కువగా ఉంటుంది. ఉదాహరణకు, పచ్చదోమకు, దాన్ని ఆశించి బతికే పరాన్నభుక్కు సూక్ష్మ క్రిమికి మధ్య ‘తెగులు-సహజ శత్రువు’ సంబంధం ఉంది. పచ్చదోమకు దాని సహజ శత్రువుకంటే 17 రెట్లు ఎక్కువగా అధిక ఉష్ణోగ్రతను తట్టుకోగల శక్తి ఉంది.
నేలకు సంబంధించిన క్రిమికీటకాలు చాలావరకు పొడి వాతావరణంలోనే బతుకుతాయి. అవి మొక్కల నుంచి స్వీకరించే ఆహారంతో పాటే వాటికి నీరు కూడా లభిస్తుంది. పంటలకు వచ్చే తెగుళ్లను నివారించడంలో ఈ క్రిమికీటకాలు కీలక పాత్రను నిర్వహిస్తాయి. అయితే అసాధారణమైన వేడిగాలి, వర్షాభావం వాటికి ప్రాణాంతకంగా మారుతుంది. తెలంగాణలోని గత రెండేళ్ల అసాధారణ వర్షాభావ పరిస్థితులలో ఆ కారణంగానే తాటాకు తెగులు ప్రబలింది.

ఆకులను, పళ్లను తిని బతికే గొంగళి పురుగుల స్థానే రసాన్ని పీల్చేసే తెగుళ్లు ప్రవేశించడం ఇటీవల కనిపిస్తోంది. ఒకే పంటను లేదా ఒకే రకాన్ని పండించడమూ, రసాయనిక క్రిమినాశనకారుల వాడకమూ ఈ మార్పునకు కారణం. ఉదాహరణకు, పత్తి విషయంలో ప్రత్యేకించి బీటీ పత్తిని ప్రవేశపెట్టిన తర్వాత పచ్చదోమ వంటి తెగుళ్లు ప్రబలుతున్నాయి. వేరుశనగకు పేనుబంక, తామరపురుగు, మిరప పంటకు పచ్చనల్లి తెగులు అలాగే వ్యాపించాయి. ఈ పీల్చేసే తెగుళ్లు, పలు వైరల్ వ్యాధులకు కారకాలుగా కూడా ఉంటున్నాయి. ఉదాహరణకు, వేరుశెనగకు మొవ్వకుళ్లు, పత్తికి ‘పొగాకు ఈనె వ్యాధి’ అలాగే సంక్రమించాయి. చాలా వరకు పళ్లు, కూరగాయలకు ఇలాంటి వైరల్ వ్యాధులే సంక్రమిస్తున్నాయి.

వాతావరణ మార్పులకు తట్టుకోవాలంటే?

మొక్కల జన్యువులు మొదలుకొని, జాతులు, జీవావరణ వ్యవస్థల వరకు సార్వత్రికమైన జీవవైవిధ్యాన్ని పెంపొందింపజేయడం ద్వారా వాతావరణంలో వస్తున్న మార్పుల దుష్ఫలితాలను తట్టుకునే శక్తి పెరుగుతుంది. జన్యుపరంగా భిన్నత్వం కలిగిన పంటలు, మొక్కలు, వివిధ జాతులతో సుసంపన్నమైన జీవావరణ వ్యవస్థలను నెలకొల్పడం ఇందులో కీలకం. దేశీయ, స్థానిక రకాల మొక్కలు, పంటలను, జంతువులను ఉపయోగించాలి. తద్వారా అసాధారణమైన పరిస్థితులను తట్టుకోగల రకరకాల పంటలు, జంతు జీవవైవిధ్యంపెంపొందుతాయి. రైతులు వాతావరణ మార్పులను తట్టుకోగలుగుతారు.

పెంపొందింపజేయాల్సిన పంటలు, జంతువులకు సంబంధించిన కృషిని వ్యవసాయ జీవావర ణ నిర్వహణా కృషి నుంచి వేరుచేయకూడదు. ఉదాహరణకు మన ప్రధాన ఆహార పంట అయిన వరిలో అధిక ఉష్ణోగ్రతలను, చౌడుదనాన్ని, దుర్భిక్షాన్ని, వరదలను తట్టుకునే శక్తి ఉన్న పలు రకాలు ఉన్నాయి. ఉదాహరణకు, 2004 సునామీ కారణంగా దెబ్బ తినిపోయిన పంట భూములలో అలాంటి రకాలను వాడి మంచి ఉత్పత్తిని సాధించవచ్చు. శ్రీవరి సాగు వంటి పద్ధతుల వల్ల నీటి వాడకం తగ్గడంతో పాటు 4 రెట్లు తక్కువ మిథేన్, 5 రెట్లు తక్కువ నైట్రస్ ఆక్సైడ్ విడుదల అవుతాయి.

వాతావరణ మార్పులను తట్టుకునే వ్యవసాయ పద్ధతులు అతివృష్టి కారణంగా సాగునీరు ఎక్కువయ్యే పరిస్థితులను, వర్షాభావం వల్ల ఏర్పడే నీటి ఎద్దడి పరిస్థితులను తట్టుకునేవిగా ఉండడం తప్పనిసరి. నేలలోని సేంద్రియ పదార్థమే ఈ రెండు సమస్యలకు కీలకం. అది నేల నిర్మాణాన్ని మెరుగుపరుస్తుంది, స్థిరీకరిస్తుంది. తద్వారా పైపొర, భూసారం కొట్టుకుపోకుండానే, దిగువన ముంపునకు గురికాకుండానే నేలలు ఎక్కువ నీటిని పీల్చుకోగలుగుతాయి. ఎక్కువగా దున్నడం వలన భూసేంద్రియ పదార్థం క్షీణిస్తుంది. తక్కువగా దున్నడం, నేలను శాశ్వతంగా కప్పి ఉంచడం (పంటలు, పంట అవశేషాలతో లేదా నేలను కప్పే పంటలు) వల్ల భూ సేంద్రియ పదార్థం పెరుగుతుంది. అసలు దున్నకుండా వదిలేస్తే భూమి నిర్మాణంతో పాటూ దాని జీవజాలం కూడా చెక్కుచెదరకుండా ఉంటుంది. వానపాములు, చెదలు, వేళ్లు ఎక్కువ నీరు బయటికిపోయే మార్గాలుగా పనిచేస్తాయి. నేలను గడ్డితో కప్పి ఉంచడం నేలను అధిక ఉష్ణోగ్రతల నుంచి కాపాడుతుంది. పంటకు అవసరమయ్యే నీటిని 30 శాతానికి తగ్గిస్తుంది. అందువలన సేంద్రియ, జీవవారణ వ్యవసాయం నేలలోని జీవ సేంద్రియాలను పెంపొందింపజేసి, క్షార ఎరువుల వాడకాన్ని తగ్గిస్తుంది. ఫలితంగా వ్యవసాయ వ్యయాలు తగ్గుతాయి.

ఉత్పత్తిలోని అస్థిరతలను తట్టుకోడానికి పలు నీటి నిర్వహణ పద్ధతులున్నాయి. భూసార పరిరక్షణ పద్ధతులు వర్షాభావ కాలాల్లో నేలలోని తేమను పెంచడానికి గణనీయంగా తోడ్పడతాయి. అతివృష్టి ప్రాంతాల్లో నేలను కప్పి ఉంచడం, దున్నకుండా సేద్యం చేయడం ద్వారా భూసారం కొట్టుకుపోకుండా కాపాడుకోవచ్చు. అయితే ఏడాదికి ఏడాదికి మధ్య అధిక వర్షపు నీటిని నిల్వ చేయడమనేదే సమర్థమైన నీటి నిర్వహణ పద్ధతి. ఇక పశువుల పెంపకంలో మార్పులు తేవడం ద్వారా గ్రీన్‌హౌస్ వాయువుల విడుదల సమస్య ప్రభావాన్ని పరిహరించగలుగుతాం. బయోగ్యాస్ తదితర పద్ధతుల ద్వారా వ్యర్థాల నిర్వహణను చేపట్టాలి. వాతావరణ మార్పుల దుష్ర్పభావానికి ఎక్కువగా గురయ్యేది పేద రైతులే, కాబట్టి వాతావరణంలోని అసాధారణ మార్పులను తట్టుకునే పద్ధతులు వారికి ఎక్కువగా అవసరం. జీవావరణ వ్యవసాయం, సేంద్రియ వ్యవసాయం, క్రిమిసంహారక మందులు లేని వ్యవసాయం, శ్రీసాగు తదితర పద్ధతులతో కూడిన సుస్థిర వ్యవసాయం అటు రైతుకు, వినియోగదారునికి కూడా లాభదాయకం. అంతేకాదు, వాతావరణ మార్పులను ఉపశమించేది కూడా అదే!

పోరు వాక పొలం వదలి వీధికెక్కిన రైతన్న విత్తనం కోసం రైతన్న అగచాట్లు..

http://www.andhrajyothy.com/mainnewsshow.asp?qry=2012/jun/21/main/21main1&more=2012/jun/21/main/main&date=6/21/2012

ధర్నాలు, ఆందోళనలు, నిలదీతలు

మార్చిలోనే చేతులెత్తేసిన మహికో..
ప్రత్యామ్నాయంపై సర్కారు ఉదాసీనత
బ్లాక్ మార్కెట్ పాపం డీలర్లదే అంటున్న విత్తన కంపెనీలు
వరంగల్ జిల్లాలో సోదాలు..
‘నల్ల’ విత్తనాల పట్టివేత, కేసులు నమోదు
ఖరీఫ్ పర్యవేక్షణపై మంత్రి కన్నా దృష్టి.. అమెరికా పర్యటన రద్దు
రుతు పవనాలకు ‘ఎల్‌నినో’ గండం.. ఆగస్టు చివరి నుంచి ప్రతికూలతలు?
కృష్ణా డెల్టాకు నీటి కష్టాలు.. ఇన్‌పుట్ సబ్సిడీపై సీఎం సమీక్ష
పంపిణీ వేగవంతం చేయాలని ఆదేశం..
సరిపడా ఎరువులున్నాయని భరోసా

ఏరువాక… దానితోపాటే మొదలైన పోరువాక! విత్తనాల దగ్గరే రైతు చిత్తు చిత్తు! విత్తనాలున్నాయని ప్రభుత్వం చెబుతుంది. కానీ… రైతు కోరుకునే విత్తనాలు మాత్రం బ్లాక్ మార్కెట్‌కు వెళ్లిపోయాయి. ఈ సమస్య అలా ఉండగానే… ఎరువుల దరువు మొదలైంది. బుధవారం అటు విత్తనాలు, ఎరువుల ధరలపై పలు జిల్లాల్లో రైతులు రోడ్డెక్కారు. ఆందోళనలకు దిగారు. విత్తన సమస్యపై మంగళవారం ఏబీఎన్‌లో మంత్రి కన్నా లక్ష్మీనారాయణతో రైతులు స్వయంగా తమ గోడు వినిపించుకున్నారు. బ్లాక్ మార్కెట్ బండారాన్ని బయటపెట్టారు. మంత్రి ఆదేశాలతో అధికారులు కదిలారు. వరంగల్ జిల్లాలో ‘నల్ల’ విత్తనాలను బయటపెట్టారు. ఖరీఫ్ సీజన్ ఊపందుకున్న నేపథ్యంలో… ఈనెల 29 నుంచి వెళ్లాల్సిన అమెరికా పర్యటనను కన్నా రద్దు చేసుకున్నారు.

హైదరాబాద్, జూన్ 20 : తొలకరి తర్వాత సజావుగా ఏరువాక సాగించాల్సిన అన్నదాత అష్టకష్టాలు పడుతున్నాడు. ప్రకృతి కరుణించినా..విత్తనాలు, ఎరువుల కొరత, అధిక ధరలు, నకిలీ విత్తనాల సమస్యతో తల్లడిల్లుతున్నాడు. మెదక్‌లోని జహీరాబాద్‌లో జనుము, సోయాబీన్ విత్తనాల కోసం రైతులు వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేశారు. నారాయణఖేడ్‌లో సోమవారం విత్తనాల కోసం టోకెన్లు పొందిన రైతులు బుధవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు షాపుముందే పడిగాపులు పడి నిరాశగా వెనుదిరిగారు. నర్సాపూర్‌లో విత్తనాలు అందుబాటులో లేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. సోయా విత్తనాలు సరిపడా రాకపోవడంతో నిజామాబాద్ జిల్లా రైతులు ప్రతీరోజు రోడ్డెక్కుతున్నారు.

బిచ్కుందలో వ్యవసాయ శాఖ కార్యాలయానికి తాళం వేసి ఉండడంతో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు పడిగాపులు కాసిన రైతులు.. అధికారులు రాకపోవడంతో ఆగ్రహం చెంది ధర్నా చేశారు. అలాగే బాల్కొండలో రైతులు తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించారు. కాగా, ఖమ్మం జిల్లా కారేపల్లి మండలంలో మహారాష్ట్రకు చెందిన నకిలీ నీరజ, బ్రింట్ రకం విత్తనాలు వేసి రైతులు మోసపోయారు. కారేపల్లి విత్తన దుకాణం వద్దకు వెళ్లి గొడవ చేయడంతో యజమానులు కొందరికి డబ్బు, మరికొందరికి వేరే బీటీ విత్తనాలను అందించారు.

ఎరువుల ధరలపైనా ఆందోళన..
ఎరువులను అధిక ధరలకు విక్రయించడంపై కూడా రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధిక ధరలపై మహబూబ్‌నగర్ రైతులు కన్నెర్ర చేశారు. సీపీఐ ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు. బిజినేపల్లి మండలం లట్టుపల్లికి చెందిన భద్రయ్య అనే రైతు మండల కేంద్రంలోని వెంకటేశ్వర ఫర్టిలైజర్స్‌లో ఎనిమిది డీఏపీ సంచులను కొనుగోలు చేశాడు. అందుకు రూ.8,016 తీసుకోవాల్సి ఉండగా.. దుకాణం యజమాని 9,300 తీసుకొని రసీదు ఇచ్చాడు. వెల్గండకు చెందిన కృష్ణారెడ్డి డీఏపీ బస్తాను కొనుగోలు చేయగా రూ.1002కు గాను 1,260 తీసుకున్నాడు. విషయం తెలుసుకున్న సీపీఐ కార్యకర్తలు అక్కడికి చేరుకుని ధర్నా చేశారు.

ఏడీఏ ఆంజనేయులుగౌడ్, ఏవో హరినాథ్ సంఘటనా స్థలానికి చేరుకోగా దాడికి దిగారు. అనంతరం ఏడీఏ, ఏవో.. దుకాణంలోని రికార్డులను పరిశీలించి స్వాధీనం చేసుకున్నారు. నిజామాబాద్ జిల్లా కామారెడ్డిలోని విత్తన, ఎరువుల దుకాణాలపై విజిలెన్స్ అధికారులు బుధవారం ఆకస్మిక దాడులు నిర్వహించారు. రైతులు ఎక్కువ ధరకు ఎరువులు కొని రసీదులు తీసుకున్న కొద్ది సేపటికే రాష్ట్ర విజిలెన్స్ అధికారి అశోక్‌కుమార్ ఆధ్వర్యంలో.. మూడు దుకాణాలపై దాడులు చేసి బస్తాలను స్వాధీనం చేసుకున్నారు.

కాగా, మహబూబ్‌నగర్ జిల్లా అచ్చంపేటలో అనిల్ ట్రేడర్స్ ఎరువులను అధిక ధరలకు అమ్ముతోందంటూ బుధవారం మంత్రి కన్నాకు ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన మంత్రి.. వెంటనే పరిశీలించి నివేదిక పంపాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. కాగా, ప్రస్తుతం రాష్ట్రంలో 7.82 లక్షల టన్నుల ఎరువులు నిల్వ ఉన్నట్లు వ్యవసాయ శాఖ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొంది. అందులో డీలర్లు, మార్క్‌ఫెడ్ వద్ద కలిపి యూరియా 1.55 లక్షలు, కాంప్లెక్స్ 3.68 లక్షలు, యూరియా 1.94 లక్షలు, ఎంఓపీ 62600 టన్నులు నిల్వ ఉన్నట్లు తెలిపింది.

బిగ్ డిబేట్‌తో అధికారుల్లో కదలిక
‘ఏబీఎన్ – ఆంధ్రజ్యోతి’ ఎండీ వేమూరి రాధాకృష్ణ మంగళవారం నిర్వహించిన ‘బిగ్ డిబేట్’ సంచలనం సృష్టిస్తోంది. ఈ కార్యక్రమానికి వివిధ జిల్లాల నుంచి రైతులు ఫోన్ చేసి.. వ్యవసాయ శాఖ మంత్రి కన్నాతో మాట్లాడారు. వారంతా విత్తనాల బ్లాక్ మార్కెటింగ్‌పై ఫిర్యాదు చేయడంతో అధికార యంత్రాంగంలో కదలిక మొదలైంది. విత్తన కొనుగోళ్లలో రైతు దయనీయ స్థితిపై కొనసాగిన బిగ్‌డిబేట్‌లో మంత్రి కన్నా కూడా బ్లాక్ మార్కెటీర్లపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్లాక్ మార్కెటింగ్‌కు పాల్పడితే డీలర్‌లతో పాటు కంపెనీ యాజమాన్యంపై కేసులు పెట్టాలని ఆదేశించారు. దీంతో అధికారులు ఉరుకులు, పరుగులు ప్రారంభించారు.

వరంగల్ జిల్లా రెవెన్యూ, వ్యవసాయ, పోలీస్ శాఖలు సంయుక్తంగా ఆకస్మిక తనిఖీలు నిర్వహించాయి. బ్లాక్ మార్కెట్‌కు తరలిపోయిన పత్తి విత్తనాలను వెలుగులోకి తెచ్చే దిశగా ఈ దాడులు సాగాయి. తమ తనిఖీలను గురువారం కూడా కొనసాగించాలని అధికార యంత్రాంగం భావిస్తోంది. వరం గల్ జిల్లా కురవిలో మంగళవారం అర్ధరాత్రి నుంచి తెల్లవారే దాకా వ్యాపారుల రహస్య గోడౌన్‌లపై అధికారులు దాడులు చేశారు. ఈ దాడుల్లో దుర్గా ఫెర్టిలైజర్ షాపు, మరి కొందరి ఇళ్లలో విత్తన పాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. షాపును సీజ్ చేసి నల్లపు ఉపేందర్, నల్లపు రవి, గూడూరు ప్రసాద్‌లను అరెస్ట్ చేశారు.

ఈ ముగ్గురితో పాటు వీరికి విత్తనాలు సరఫరా చేసిన నల్గొండ జిల్లా సూర్యాపేటకు చెందిన జగన్మోహన్‌రెడ్డి, ఖమ్మంకు చెందిన నాగరాజులపై విత్తన చట్టం, 420 కేసులు నమోదు చేశారు. కాగా, వ్యవసాయదారులకు ఖరీఫ్‌లో కావాల్సిన వరి విత్తనాలను అందజేయడానికి ఆచార్య ఎన్జీ రంగా యూనివర్సిటీ సీడ్ రీసెర్చి టెక్నాలజీ సెంటర్ డైరెక్టర్ విష్ణువర్థన్ రెడ్డి బుధవారం ఆన్‌లైన్‌కు తెలిపారు. వివిధ ప్రాంతాల్లో గల పరిశోధన కేంద్రాల్లో విత్తనాలను రైతులకు అందుబాటులో ఉంచామని ఆయన చెప్పారు.

విత్తన కొరతను అధిగమించండి: సీఎం
హైదరాబాద్: ప్రస్తుత ఖరీఫ్‌సీజన్‌లో ఎరువులు, విత్తనాల కొరత రాకుండా చూడాలని వ్యవసాయశాఖ అధికారులను సీఎం కిరణ్ ఆదేశించారు. రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ పంపిణీని వేగవంతం చేయాలని. రైతుల వ్యక్తిగత ఖాతాలకే నేరుగా చేరేలా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. మధ్య దళారుల ప్రమేయం లేకపోవడంతో.. పారదర్శకంగా రైతుకు సబ్సిడీ అందుతుందని ఆయన పేర్కొన్నారు.

రాష్ట్రమంతటా విస్తారంగా వర్షాలు కురిసిన నేపథ్యంలో వివిధ శాఖల మంత్రులు, అధికారులతో బుధవారం ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. రైతులకు ఎరువులు, విత్తనాలు సరఫరా చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు సీఎంకు అధికారులు వివరించారు. డీఏపీ, కాంప్లెక్స్, యూరియా తదితర ఎరువులు అందుబాటులో ఉన్నాయన్నారు. 1.9 కోట్ల ప్యాకెట్ల పత్తి విత్తనాలను అందుబాటులో ఉంచామని చెప్పారు. వీటిలో ఇప్పటికే 60.73 లక్షల ప్యాకెట్ల పంపిణీ కూడా జరిగిందన్నారు.

5.43 లక్షల క్వింటాళ్ల వేరుశనగ విత్తనాలు అందుబాటులో ఉండ గా.. ఇప్పటికి 4.70 లక్షల క్వింటాళ్లు పంపిణీ జరిగిందని సీఎంకు చెప్పారు. ఎరువుల నిల్వలను పర్యవేక్షించేందుకు జిల్లా స్థాయిలో మానిటరింగ్ సెల్‌ను ఏర్పాటు చేశామని వివరించారు. రాష్ట్ర సరిహద్దుల్లో, ఇతర కీలక ప్రాంతాల్లో ఎరువుల రవాణాపై విజిలెన్స్ నిఘాను పెంచినట్లు తెలిపారు. ఈ సమావేశంలో వ్యవసాయశాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ, ముఖ్య కార్యదర్శి, కమిషనర్ పాల్గొన్నారు.

విత్తన ఇబ్బందితోనే మంత్రికి ఫోన్: రైతు సైదులు
“పత్తి విత్తనాల కోసం పడని పాట్లు లేవు. తిరగని షాపు లేదు. అయినా ఒక్క ప్యాకెట్ దొరికే పరిస్థితి లే దు” అని కురవి మండలం బలపాలకు చెందిన రైతు నామా సైదులు అన్నారు. “షాపుల్లో అడిగితే మహికో విత్తనాలు రూ.2 వేలు అంటున్నారు. ఏం చేయాలో తెలియక ఆలోచిస్తున్నా. మంగళవారం రాత్రి ఏబీఎన్ చానల్ చూస్తుండగా మంత్రి కన్నా లక్ష్మినారాయణ రైతులతో సంభాషిస్తున్నారు. వెంటనే.. ఇచ్చిన నెంబరుకు ఫోన్ చేశాను.

తొలుత పత్తి విత్తన కొరతపై ప్రశ్నించిన నేను ఆపై విత్తన బ్లాక్ మార్కెటింగ్‌పై అడిగాను. ఎక్కడ జరుగుతుందని అడగ్గా మా జిల్లా అంతా ఇదే పరిస్థితని చెప్పాను. డిబేట్ అయిపోయాక మంత్రి నాకు ఫోన్ చేసి, మీది ఏ మండలం? అని అడగ్గా కురవి అని చెప్పాను. రాత్రికి రాత్రే ఆర్డీవో బిక్షానాయక్, కురవి సీఐ రవీందర్ ఆధ్వర్యంలో దాడులు జరిగాయని, 143 పత్తి విత్తన ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారని తెలిసి ఆశ్చర్యపోయాను” అని వివరించారు.

విత్తన సరఫరాలో సర్కారు విఫలం
సబ్సిడీ సొమ్ము ప్రైవేటు పరం..
బ్లాక్ మార్కెట్‌కు పత్తి విత్తనాలు
22న నిరసన ప్రదర్శనలు, జైల్‌భరో: కిషన్‌రెడ్డి

హైదరాబాద్: వర్షాల రాకతో రైతాంగం విత్తనాల కోసం ఎదురు చూస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కుంభకర్ణ నిద్ర పోతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ధ్వ జమెత్తారు. నాలుగైదేళ్లుగా విత్తనాల సమస్య తీవ్రమవుతున్నా, ప్రభుత్వం విత్తనాల పంపిణీ విధానాన్ని మార్చకుండా.. బాధ్యతలను ప్రైవేటు కంపెనీలకు అప్పగించేసి కళ్లు మూసుకుని కూర్చుందన్నారు.

రైతులకు చెందాల్సిన విత్తన సబ్సిడీని ప్రైవేటు కంపెనీలకు ధారాదత్తం చేస్తోందని ఆరోపించారు. విత్తనాల కోసం రైతులు క్యూలలో నిలబడి, లాఠీదెబ్బలు తినాల్సి రావడం దేశంలో ఎక్కడా లేదన్నారు. పత్తి విత్తనాలు బ్లాక్ మార్కెట్‌కు తరలిపోయినా సర్కారు నుంచి చర్యల్లేవని ధ్వజమెత్తారు. కాగా కాంగ్రెస్ ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ నెల 22న అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసన ప్రదర్శనలు, జైల్‌భరో కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

బీటీ విత్తనంపై పర్మిట్ తొలగించాలి
దీని వల్ల విత్తనాల లభ్యత మెరుగు: ఏపీ సీడ్స్‌మెన్ అసోసియేషన్

హైదరాబాద్: రాష్ట్రంలో ఓ కంపెనీ బీటీ విత్తనాలపై ఉన్న పర్మిట్ విధానాన్ని తొలగించాలని ఏపీ సీడ్స్ అసోసియేషన్ కోరింది. పర్మిట్ వ్యవస్థను ప్రవేశ పెట్టడం వల్ల ఆ విత్తనానికి అనవసరమైన ‘హైప్’ లభిస్తోందని, దీన్ని తొలగిస్తే దుకాణాల్లో అవసరమైన మేరకు విత్తనాలు దొరుకుతాయని అభిప్రాయపడింది.

రాష్ట్రంలో 1.27కోట్ల బీటీ విత్తన ప్యాకెట్లు అవసరముంటే అందులో 85 శాతం విత్తనాలు ఇప్పటికే పం పిణీ చేశామని ఏపీ సీడ్స్‌మెన్ అసోసియేషన్ కార్యదర్శి వెంకటరెడ్డి అన్నారు. కొన్ని ప్రాంతాల్లో రైతులు ఒక బ్రాండునే అడుగుతున్నందున సమస్య వస్తోందన్నారు. ప క్క రాష్ట్రాల నుంచి బీటీ విత్తనాలు తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతున్నారని, వాటిపై తమ నియంత్రణ ఎలా ఉంటుందని సీడ్స్‌మెన్ ప్రతినిధి భాస్కర్‌రావు ప్రశ్నించారు.

మంత్రి కన్నా అమెరికా పర్యటన రద్దు
ఈ నెల 29 నుంచి తలపెట్టిన అమెరికా పర్యటనను మంత్రి కన్నా లక్ష్మీనారాయణ రద్దు చేసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురిసి ఖరీఫ్ సీజన్ ఊపందుకోవడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి కార్యాలయం ప్రకటించింది.

విత్తనాల కోసం ముప్పుతిప్పలు

చేలో ఉండాల్సిన రైతులు క్యూలో..
http://www.sakshi.com/Main/Fullstory.aspx?catid=396873&Categoryid=1&subcatid=33

విత్తు కష్టాలు షురూ!
బ్లాక్ మార్కెట్‌లో అన్నదాత నిలువు దోపిడీ
రూ. 950 ఉన్న పత్తి విత్తనాలు రూ.1,500కు అమ్ముతున్న కంపెనీలు
నల్ల బజారులో రూ. 200 కోట్లు నష్టపోనున్న రైతులు
సోయాబీన్ విత్తనాలకు తీవ్ర కొరత… వేరుశనగకు నాణ్యత దెబ్బ
చివరికి ఆముదం విత్తనాలు కూడా బ్లాక్ మార్కెట్‌లోనే..

హైదరాబాద్, న్యూస్‌లైన్: విత్తు కష్టాలకు తెరలేచింది! మార్కెట్ మాయాజాలంలో రైతన్న ఎప్పట్లాగే నిలువు దోపిడీకి గురవుతున్నాడు!! గత ఏడాది కరువు నష్టాలను మరిచిపోయి కోటి ఆశలతో ఏరువాకకు సిద్ధమవుతున్న రైతులను విత్తు కష్టాలు చుట్టుముట్టాయి. రాష్ట్రంలో ఎమ్మార్పీ ధరలకు నాణ్యమైన విత్తనం దొరకడం గగనంగా మారింది. ‘అదనులో వ్యవసాయం..’ అన్న మాటను రైతుల కంటే బాగా ఒంట బట్టించుకున్న విత్తన వ్యాపారులు.. అమాయక రైతుల అవసరాలను బ్లాక్ మార్కెట్ రూపంలో సొమ్ము చేసుకుంటున్నారు. విత్తనాలను ఉత్పత్తి చేయడమే ప్రధాన విధిగా ఉన్న ప్రభుత్వ ఆధ్వర్యంలోని ‘ఏపీ సీడ్స్’ వద్ద కూడా విత్తనాలు లేకపోవడంతో ప్రైవేటు వ్యాపారుల నుంచి సేకరిస్తోంది. ఇలా సర్కారు ఇచ్చేది ప్రైవేటు వ్యాపారులు సరఫరా చేసే విత్తనాలే కావడంతో నాణ్యతాపరమైన సందేహాలు తలెత్తుతున్నాయి. ఫలితంగా రైతులు చేసేది లేక పెద్ద కంపెనీల విత్తనాల వైపు చూస్తున్నారు. ఇదే అదనుగా కంపెనీలు అడ్డగోలు రేట్లతో రైతుల నడ్డి విరుస్తున్నాయి. రెట్టింపు ధరలకు విక్రయిస్తూ నిలువునా దోచుకుంటున్నాయి. ఈ అక్రమాలను నిరోధించాల్సిన వ్యవసాయ శాఖ అన్ని దశల్లోనూ వ్యాపారులకే అండగా నిలుస్తోంది.

ప్రస్తుతం రాష్ట్రంలో జోరుగా వానలు కురుస్తుండడంతో రైతులు విత్తనాలు వేయడం మొదలుపెట్టారు. ఖరీఫ్‌లో 2.20 కోటి ఎకరాల్లో పంటలు సాగవుతాయని వ్యవసాయ శాఖ ప్రణాళిక వేసింది. ఈ విస్తీర్ణంలో అన్ని పంటలు కలిపి 40.86 లక్షల క్వింటాళ్ల విత్తనాలు అవసరమవుతాయని అంచనా వేసింది. వరి, వేరుశనగ, సోయాబీన్, కందులు, పెసలు, మినుములు, మొక్కజొన్నలు, జొన్నలు, రాగులు, సజ్జలు, ఆముదం, నువ్వులు, జీలుగ, జనుము, పిల్లిపిసర విత్తనాలు కలిపి 11.62 లక్షల క్వింటాళ్లను సబ్సిడీపై పంపిణీ చేయాలని నిర్ణయించింది. సకాలంలో విత్తన రైతుల నుంచి విత్తనాలను సేకరించడంలో వ్యవసాయ శాఖ, విత్తన ఏజెన్సీలు విఫలమయ్యాయి. దీంతో విత్తన రైతులు తమ పంటను మార్కెట్‌లో అయినకాడికి అమ్ముకున్నారు. రైతుల నుంచి కొనుగోలు చేసేందుకు మీనమేషాలు లెక్కించిన వ్యవసాయ శాఖ.. ప్రైవేటు వ్యాపారుల నుంచి అధిక ధరలు వెచ్చించి విత్తనాలు సేకరించింది. వీటిని రూ.153 కోట్ల సబ్సిడీతో రైతులకు సరఫరా చేసేందుకు సిద్ధమైంది. అయితే ఇవి నేరుగా విత్తన రైతుల నుంచి సేకరించిన విత్తనాలు కాకపోవడంతో సర్కారు విత్తనాల నాణ్యతపై రైతుల్లో సందేహాలు నెలకొన్నాయి.

చివరికి ఆముదం విత్తనాలు కూడా..

పత్తి విత్తనాల బ్లాక్ మార్కెటింగ్ రెండేళ్లుగా జరుగుతుండగా.. రాష్ట్ర చరిత్రలో మొదటిసారిగా ఇప్పుడు ఆముదం విత్తనాలను బ్లాక్ మార్కెట్‌లో అమ్ముతున్నారు. రాష్ట్రంలో 5 లక్షల ఎకరాల్లో సాగు చేసే ఆముదం విత్తనాల ధరలను ప్రభుత్వం ఈ ఏడాది అమాంతంగా పెంచేసింది. గత ఏడాది వీటి ధర క్వింటాల్‌కు రూ.5 వేలు ఉండగా ప్రభుత్వం 50 శాతం సబ్సిడీ ఇచ్చింది. దీంతో రైతులకు రూ.2,500కే విత్తనాలు దొరికాయి. ఈ ఏడాది వాటి ధరను రూ.5,200కు పెంచిన సర్కారు సబ్సిడీని రూ.1,200లకు తగ్గించింది. దీంతో రైతులు క్వింటాల్‌కు రూ.3 వేలు వెచ్చించి కొనుక్కొవాల్సి వస్తోంది. సర్కారే ధర పెంచినందున తాము పెంచితే తప్పేంటన్న ఉద్దేశంతో కంపెనీలు ఆముదం విత్తనాలను బ్లాక్ మార్కెట్‌లో విక్రయిస్తున్నాయి. రూ.400 ఉండే 3 కిలోల ఆముదం విత్తనాల ప్యాకెట్‌ను మహబూబ్‌నగర్, రంగారెడ్డి, అనంతపురం జిల్లాల్లో కంపెనీలు రూ.700లకు చొప్పున అమ్ముతున్నాయి. రైతుల ప్రయోజనాల విషయంలో రాష్ట్ర సర్కారుకు ఏ మాత్రం శ్రద్ధలేదని చెప్పేందుకు విత్తనాల్లో బ్లాక్ మార్కెట్ దందాయే నిదర్శమని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం అధ్యక్షుడు కె.రామకృష్ణ మండిపడ్డారు.

సోయాబీన్… పెరిగిన భారం రైతులపైనే

గత ఖరీఫ్‌తో పోల్చితే సోయాబీన్ విత్తనాల ధరను సర్కారు క్వింటాల్‌కు రూ.1,140 పెంచింది. గత ఏడాదిలో క్వింటాల్ సోయాబీన్ విత్తనాలను రైతులకు రూ.1,540కి పంపిణీ చేయగా ఇప్పుడు రూ.2,680కి పెంచారు. రాష్ట్రంలో సోయాబీన్ సాగు సగటు విస్తీర్ణం నాలుగు లక్షల ఎకరాలు. అవసరాలకు సరిపడా విత్తనాల సేకరణను నవంబర్‌లోనే చేయాల్సి ఉన్నా.. వ్యవసాయ శాఖ, ఆంధ్రప్రదేశ్ విత్తనాభివృద్ధి సంస్థ (ఏపీ సీడ్స్) ఉన్నతాధికారులు పట్టించుకోలేదు. నవంబర్‌లో క్వింటాల్ సోయాబీన్ విత్తనాల ధర రూ.2,014 ఉంది. వ్యాపారుల లబ్ధి కోసం ఆలస్యం చేయడంతో సోయాబీన్ విత్తనాల ధర అమాంతంగా క్వింటాల్‌కు రూ.4 వేలకు పెరిగింది. ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా సోయాబీన్ విత్తనాల సేకరణ ఖర్చు రూ.20 కోట్ల నుంచి రూ.40 కోట్లకు పెరిగింది. అధికారుల నిర్లక్ష్యంతో పెరిగిన విత్తనాల సేకరణ ఖర్చును భరించాల్సిన ప్రభుత్వం.. దాన్ని రైతులపై వేసింది. అంతటితో ఆగకుండా సోయాబీన్ విత్తనాలను గత ఖరీఫ్‌లో 50 శాతం సబ్సిడీపై రైతులకు పంపిణీ చేయగా ఇప్పుడు దాన్ని 33 శాతానికి తగ్గించారు. దీంతో ఈ విత్తనాల ధర కూడా భారీగా పెరిగింది. నిజామాబాద్ జిల్లాలో ఎక్కువ మంది రైతులు ఈ ఏడాది సోయాబీన్ సాగు చేయాలని చూస్తున్నారు. సర్కారు మాత్రం వీరికి సరిపడా విత్తనాలను సరఫరా చేసే పరిస్థితి కనిపించకపోవడంతో రైతుల్లో ఆందోళన మొదలైంది.

పత్తి రైతు… అంతులేని దోపిడీ

వచ్చే ఖరీఫ్‌లో రాష్ట్రవ్యాప్తంగా 50 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేస్తారని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. 36 కంపెనీలు సరఫరా చేసే 1.27 కోట్ల పత్తి విత్తన డబ్బాలు/ప్యాకెట్లు (450 గ్రాములు) సరిపోతాయని నిర్ధారించింది. బ్లాక్ మార్కెటింగ్ రుచికి అలవాటు పడ్డ పెద్ద కంపెనీలు వ్యవసాయ శాఖ అధికారుల సహకారంతో పత్తి రైతులను దోపిడీ చేస్తున్నాయి. రైతులు ఎక్కువగా డిమాండ్ చేసే మహికో కంపెనీ… 10 లక్షల డబ్బాల విత్తనాలు ఇస్తామని మొదట చెప్పింది. కానీ కేవలం 5 లక్షల డబ్బాలే ఇచ్చి చేతులు దులుపుకుంది. మిగిలిన సగం విత్తనాలను సొంత డీలర్ల ద్వారా రూ.930 ఎమ్మార్పీ ఉన్న ఈ విత్తనాలను రైతులకు రూ.1,500 చొప్పున బ్లాక్ మార్కెట్‌లో విక్రయిస్తోంది. అక్రమ దందాలో పండిపోయిన మరో నాలుగు కంపెనీలు కూడా ఇలాగే చేస్తున్నాయి. సర్కారు అండతో జరుగుతున్న కంపెనీల బ్లాక్ మార్కెటింగ్‌తో పత్తి రైతులు ఒక్క ఈ ఖరీఫ్‌లోనే రూ.200 కోట్ల మేర దోపిడీకి గురవుతారని అంచనా!

వేరుశనగ… నాణ్యతకు సెగ

రాష్ట్రంలో 44 లక్షల ఎకరాల్లో సాగుచేసే వేరుశనగ విత్తనాలకు నాసిరకం సమస్య పట్టుకుంది. గత ఏడాది కరువుతో వేరుశనగ రైతులే ఎక్కువగా నష్టపోయారు. ఈ సమయంలో వారిని ఆదుకోవాల్సిన సర్కారు వేరుశనగ విత్తనాల ధరలను అడ్డగోలుగా పెంచింది. గత ఏడాది అన్ని రకాల వేరుశనగ విత్తనాల ధర క్వింటాల్‌కు రూ.3,600ఉండగా ఇప్పుడు రూ.3,950కి పెరిగింది. సబ్సిడీ విత్తనాల ధరకు, బహిరంగ మార్కెట్‌లో ధరలు తేడా లేకపోవడంతో ఎక్కువ మంది రైతులు సొంతంగానే విత్తనాలు సమకూర్చుకుంటున్నారు. గత ఏడాది కరువు పరిస్థితులకు తట్టుకుని బాగా దిగుబడి ఇచ్చిన కే6 రకం వేరుశనగ విత్తనాలకు ఇప్పుడు డిమాండ్ ఎక్కువగా ఉంది. వ్యవసాయ శాఖ మాత్రం వీటిని కాకుండా ఇతర రకాలను సిద్ధం చేసింది. దీంతో సబ్సిడీ విత్తనాలకు రైతులు ప్రాధాన్యం ఇవ్వడంలేదు. ఇదే అదనుగా కొందరు విత్తన వ్యాపారులు ఆయిల్‌ఫెడ్, హాకా, మార్కెఫెడ్ సంస్థల ద్వారా ధ్రువీకృతం అని చెప్పి సాధారణ విత్తనాలను సరఫరా చేశారు. ప్రాసెస్ కూడా సరిగా చేయకపోవడంతో కొనుగోలు చేసిన రైతులు బస్తాలు విప్పి చూస్తే ప్రతి బస్తాలో 6 కిలోలు విత్తుకు పనికి రాని తాలుకాయలు బయటపడుతున్నాయి. దీంతో రైతులు మళ్లీ విత్తనాలు కొనుగోలు చేయాల్సి రావడంతో సబ్సిడీకి అర్థమే లేకుండా పోతోంది.

విత్తనాల కోసం బారులు…

జహీరాబాద్ , న్యూస్‌లైన్: మెదక్ జిల్లా జహీరాబాద్ వ్యవసాయ శాఖ కార్యాలయం వద్ద సోమవారం రైతులు విత్తనాల కోసం భారీ సంఖ్యలో బారులు తీరారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు క్యూలో నిల్చున్నారు. ఆదివారం రాత్రి భారీ వర్షం కురియడం, విత్తనాల పంపిణీ కార్యక్రమాన్ని సోమవారం రోజునే ప్రారంభించడంతో పెద్ద సంఖ్యలో రైతులు వ్యవసాయశాఖ కార్యాలయానికి తరలి వచ్చారు. మధ్యాహ్నం వర్షం రావడంతో విత్తనాల పంపిణీ నిలిపివేశారు. కూపన్లు పొందిన రైతులకు మంగళవారం పంపిణీ చేస్తామని అధికారులు చెప్పారు. దీంతో కొందరు రైతులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో.. పోలీసులు జోక్యం చేసుకుని పరిస్థితిని చక్కదిద్దారు.

విత్తు కోసం మొత్తుకోలు రోడెక్కిన అన్నదాతలు,

http://www.andhrajyothy.com/mainnewsshow.asp?qry=2012/jun/19/main/19main5&more=2012/jun/19/main/main&date=6/19/2012

పలు ప్రాంతాల్లో ధర్నాలు, రాస్తారోకోలు, ఆందోళనలు

నల్లగొండ జిల్లా నకిరేకల్,
కృష్ణా జిల్లా గంపలగూడెంలో ఆందోళనలు
బ్లాక్ మార్కెట్‌లో పత్తి రైతు, రూ.930 ప్యాకెట్ రూ.2000 వరకు విక్రయం, ఓ కంపెనీ విత్తనాలకు అత్యధిక డిమాండ్, ముందే అమ్మేసినట్లు రికార్డులు, ఆనక బ్లాక్ మార్కెట్‌లోకి విత్తనాలు, కరీంనగర్ జిల్లా ఝరిలో షాపు సీజ్

హైదరాబాద్, జూన్్ 18 : బీటీ పత్తి విత్తనం ధర ప్యాకెట్‌కు రూ.930! కానీ, రాష్ట్రంలో రూ.1500 నుంచి రూ.2000 వరకూ వెచ్చించి బ్లాక్ మార్కెట్‌లో కొనుక్కోవాల్సిన దుస్థితి! ఇక, ప్రభుత్వం తరఫున ఒక రైతుకు ఒకే ప్యాకెట్ ఇస్తున్నారు. కొన్నిచోట్ల లాటరీలు తీసి, మరి కొన్నిచోట్ల పోలీసుస్టేషన్లో పెట్టి విక్రయిస్తున్నారు. మహికో విత్తనాల కొరత తారస్థాయికి చేరింది. అవే కావాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. అవి తప్ప.. అంటూ అధికారులు తేల్చి చెబుతున్నారు. దీంతో, రాష్ట్రంలోని పలుచోట్ల పత్తి విత్తనాల కోసం ధర్నాలు, ఆందోళనలు ఊపందుకున్నాయి. నల్లగొండ జిల్లాను పత్తి విత్తనాల కొరత పీడిస్తోంది.

విత్తనాలు కావాలంటూ నల్లగొండ జిల్లా నకిరేకల్ జాతీయ రహదారిపై రైతులు రాస్తారోకో చేశారు. కృష్ణా జిల్లా గంపలగూడెంలో ఒకే ఒక్క పత్తి విత్తన విక్రయ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. దీనిని నిరసిస్తూ అక్కడి రైతులు సోమవారం రాస్తారోకో నిర్వహించారు. రాష్ట్రమంతటా విస్తారంగా వర్షాలు కురుస్తుండడంతో బీటీ పత్తి విత్తనాల కోసం రైతుల పరుగు మొదలైంది. ఇదే అదనుగా వ్యాపారుల బ్లాక్ మార్కెటింగ్‌కూ తెరలేచింది. వ్యవసాయశాఖ లెక్కల ప్రకారం, రాష్ట్రంలో 50 లక్షల ఎకరాల్లో పత్తిని సాగు చేస్తున్నారు. వరి తర్వాత ఎక్కువ విస్తీర్ణంలో సాగవుతున్నది పత్తి పంటే. ఇందులో అధికంగా సాగు చేస్తున్నది బీటీ రకాలే.

రుతుపవనాల రాకకు నెల రోజుల ముందు నుంచే బీటీ పత్తి విత్తనాల అమ్మకాలు జరుగుతున్నాయి. ఓ కంపెనీ విత్తనాలకు డిమాండ్ ఎక్కువగా ఉండడంతో 10 లక్షల ప్యాకెట్లను అందుబాటులో ఉంచాలంటూ వ్యవసాయ శాఖ సదరు కంపెనీకి ప్రతిపాదన పెట్టింది. అయితే, ఆరు లక్షల ప్యాకెట్లను మాత్రమే సరఫరా చేయగలమని ఆ కంపెనీ తేల్చి చెప్పింది. దీంతో నెల కిందటే బ్లాక్ మార్కెట్‌కు తెరలేచింది. దాంతో, వ్యవసాయ శాఖ ఆ కంపెనీ విత్తనాలపై ‘స్టాప్ సేల్’ విధించింది. కొద్ది రోజుల తర్వాత ఎత్తివేయడంతో బ్లాక్ మార్కెట్‌లో మళ్లీ అమ్మకాలు ఊపందుకున్నాయి. రైతుల నుంచి నిరసనలు వెల్లువెత్తడంతో మళ్లీ ‘స్టాప్ సేల్’ ప్రకటించింది. అదే సమయంలో, రాష్ట్రవ్యాప్తంగా విత్తన విక్రయ షాపులను వ్యవసాయ అధికారులు తనిఖీలు చేశారు.

అయితే, ప్రస్తుతం జరుగుతున్న బ్లాక్ మార్కెటింగ్‌కు పునాది ఈ సమయంలోనే పడినట్లు చెబుతున్నారు. అధికారులు తనిఖీలు చేసినప్పుడు.. తమకు కేటాయించిన విత్తనాల్లో అధిక భాగాన్ని అప్పటికే అమ్మేసినట్లు వ్యాపారులు రికార్డులు చూపినట్లు తెలిసింది. తమకు తెలిసిన రైతుల పేర్లను రికార్డుల్లో చూపి భారీ ఎత్తున విత్తనాల ప్యాకెట్లను మాయం చేసినట్లు సమాచారం. అప్పట్లో రికార్డుల్లో చూపిన విత్తనాలను తొలకరి పలకరింపుతో బ్లాక్ మార్కెట్లో రైతులకు అమ్ముతున్నట్లు తెలుస్తోంది. కాగా, ఇప్పటి వరకు ఒక కంపెనీకి చెందిన విత్తనాలే బ్లాక్‌లో అమ్మకాలు జరగగా.. రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తుండడంతో ఇతర కంపెనీల విత్తనాలూ బ్లాక్‌లో అమ్మకాలు ఊపందుకున్నాయి.

కొన్ని రకాలు రూ.2000కు పైగా పలుకుతున్నాయి. అన్ని విత్తనాల్లో ఉండే బీటీ జినోమ్ ఒకటేనన్న వాస్తవాన్ని రైతులకు అవగాహన కల్పించడంలో అధికారులు విఫలమయ్యారు. బ్లాక్ మార్కెటింగ్‌కు తెర లేపడంతో అధికారులు ఎక్కడికక్కడ షాపులను సీజ్ చేస్తున్నారు. ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధరకు పత్తి విత్తనాలను విక్రయిస్తున్న ఓ షాపును ఆదిలాబాద్ జిల్లా భైంసా ఇన్‌చార్జి ఏడీఏ కోటేశ్వరరావ్ సోమవారం సీజ్ చేశారు. తానూర్ మండలం ఝరి గ్రామానికి చెందిన రైతులు రాందాస్, బాబన్న సోమవారం మధ్యాహ్నం భైంసాలోని మహేష్ ట్రేడర్స్ షాపులో అజిత్ -155 రకం విత్తనాలు కొనుగోలు చేశారు.

షాపు యజమాని విత్తన ప్యాకెట్‌ను రూ.930లకు విక్రయించాల్సి ఉండగా, రూ.1500లకు విక్రయించాడు. దీంతో రైతులు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయడంతో జేడీఏ ఆదేశాల మేరకు షాప్‌ను సీజ్ చేశారు. అయినా, అదును దాటి పోతుందన్న ఆందోళనతో రెట్టింపు ధర పెట్టి విత్తనాలను కొనక తప్పని పరిస్థితి రైతన్నకు ఏర్పడింది. అధిక ధర పెట్టడానికి సిద్ధమైనా ఆ విత్తనాలకూ భరోసా లేదు. విత్తనాలు కొన్నందుకు రసీదులు ఇవ్వడం లేదు. బ్లాక్‌లో అమ్మేవారు

నకిలీ విత్తనాలు అంటగట్టినా.. బీటీ జినోమ్‌లేనివి ఇచ్చినా.. విత్తనాలు ఫెయిల్ అయినా నష్టపరిహారం క్లెయిమ్ చేయలేని పరిస్థితి ఏర్పడుతుందని వ్యవసాయ శాఖాధికారులు హెచ్చరిస్తున్నారు. కాగా, రైతుల్లో డిమాండ్ ఉన్న ఓ కంపెనీ బీటీ విత్తనాలు వ్యవసాయ యూనివర్శిటీ జరిపిన పరిశీలనలో ఉత్పత్తికి సంబంధించి 5, 8 స్థానాల్లో ఉన్నాయని వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి నాగిరెడ్డి ప్రకటించారు. విత్తన సమస్య వచ్చిన తర్వాత కానీ ఈ అంశాన్ని తెరపైకి తేలేదు. సమయం మించిపోయిన తర్వాత కరపత్రాల రూపంలో ప్రచారం నిర్వహించారు.

అసెంబ్లీ సమావేశాలు పెట్టాలి: జూలకంటి
హైదరాబాద్: రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న కరువు, కరెంటు కోత, వలసలు, విత్తనాలు, ఎరువులు తదితర ప్రజా సమస్యలను చర్చించడానికి వీలుగా శాసనసభా సమావేశాలు ఏర్పాటు చేయాలని సీపీఎం శాసనసభాపక్ష నేత జూలకంటి రంగారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

నేల తల్లీ.. విలపిస్తోంది రైతు రాజ్యంలో రైతే కూలీ!.. లక్ష ఎకరాల సంతర్పణ భూములు కోల్పోయిన రైతులు 52,235 మంది అవి పొందిన పారిశ్రామికవేత్తలు కేవలం 250!

బ్యాంకుల్లో తాకట్టు.. జగన్ కంపెనీల్లో రూ.కోట్లు పెట్టుబడులు
పరిశ్రమలూ రాలేదు.. సాగుకూ యోగ్యం కాదు
అన్నమో రామచంద్రా అంటున్న అన్నదాత
ఉపాధి వేటలో వలసబాట.. ఒక్కడి కోసం వేల మంది బలి!

హైదరాబాద్, జూన్ 4 : రాష్ట్రంలో కారు చౌకగా భూములు పొందేందుకు వైఎస్ రాజశేఖర రెడ్డి హయాం ఓ స్వర్ణ యుగం! తన హయాంలో ఆయన లక్షకుపైగా ఎకరాల ప్రైవేటు భూములను అస్మదీయులకు సంతర్పణ చేశారు. ప్రభుత్వ భూములను పక్కన పెడితే 53,235 మంది చిన్న, సన్నకారు రైతుల నుంచి సేకరించారు. వీటి విలువ సుమారు రూ.92,650 కోట్లు! ఈ భూములన్నిటినీ కేవలం 250 మందికి మాత్రమే కట్టబెట్టారు. భూములు పొందిన పారిశ్రామిక వేత్తలు ఆ మేళ్లకు ప్రతిఫలంగా జగన్‌కు చెందిన కంపెనీల్లో పెట్టుబడులు పెట్టారు.

వెనకబడిన అనంతపురం జిల్లాలో ప్రతిష్ఠాత్మక సైన్స్ సిటీ ఏర్పాటుకు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి నడుం కట్టారు. ఈ ప్రాజెక్టు కోసం 60 వేల ఎకరాలు సేకరించాలని నిర్ణయించారు. జిల్లాలోని ఆమడగూరు మండలంలో 42,883 ఎకరాలను, ఓడి చెరువులో 16,767 ఎకరాలను సేకరించాలని నిర్ణయించారు.

పేద రైతులను పీడించి మరీ తక్కువ ధరకే భూములు లాక్కున్నారు. ఫలితంగా, 23 గ్రామాలు కూడా కనుమరుగయ్యాయి. ఆ భూములను బ్యాంకుల్లో తాకట్టు పెట్టి పారిశ్రామికవేత్తలు రుణాలు తీసుకున్నారు. జగన్ కంపెనీల్లో పెట్టుబడులూ పెట్టారు. కానీ, సైన్స్ సిటీ అటకెక్కింది. ఇటు ఫ్యాక్టరీలూ రాలేదు. అటు సాగు చేయడానికీ వీల్లేదు. రైతు మాత్రం జీవచ్ఛవంగా మారాడు.

గుంటూరు – ప్రకాశం జిల్లాల్లో వాన్‌పిక్ ప్రాజెక్టుకు 25 వేల ఎకరాలు సేకరించాలని నిర్ణయించారు. ఇందులో 18 వేల ఎకరాలను సేకరించారు. ఈ భూ సేకరణ ప్రక్రియలో ఎంతోమంది మత్య్సకారులు తమ భూములను కోల్పోయారు. ఇక్కడ వాన్‌పిక్ ప్రాజెక్టు రాలేదు. అక్కడి రైతులకు ఉపాధి దొరకలేదు. కానీ, జగన్ కంపెనీల్లోకి రూ.800 కోట్ల నిధులు మాత్రం ప్రవహించాయి.

కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలో బ్రహ్మణి స్టీల్స్ ఏర్పాటుకు మైనింగ్ మాఫియా కింగ్ గాలి జనార్దన రెడ్డికి 14 వేల ఎకరాలు కేటాయించారు. ఇక్కడ పరిశ్రమల రాకతో లక్ష మందికిపైగా స్థానికులకు ఉపాధి లభిస్తుందని ప్రకటించారు. ఆ భూములను తాకట్టు పెట్టి గాలి జనార్దన రెడ్డి రూ.350 కోట్ల రుణం తీసుకున్నారు. కానీ, అక్కడ పరిశ్రమా రాలేదు. రైతులకు ఉపాధీ దొరకలేదు. ఇక, వైఎస్ హయాంలో ప్రత్యేక ఆర్థిక మండళ్ల హవా నడిచింది. దేశంలోనే అత్యధికంగా రాష్ట్రంలో 119 ప్రత్యేక ఆర్థిక మండళ్లకు గ్రీన్ సిగ్నల్ లభించింది.

వీటి కోసం దాదాపు ప్రతి జిల్లాలోనూ వేలాది ఎకరాల పచ్చని పైరు భూములను సేకరించారు. సెజ్‌ల ఏర్పాటుతో రూ.1,05,445 కోట్ల పెట్టుబడులు వస్తాయని ఊహల పల్లకిలో ఊరేగించారు. ప్రత్యేక ఆర్థిక మండళ్లు రాలేదు. కానీ, ఏపీఐఐసీ సేకరించిన ఆ భూములు రియల్ ఎస్టేట్ మండళ్లుగా మారాయి. భూములు కోల్పోయిన రైతులకు, ఉద్యోగాలు ఆశించిన నిరుద్యోగ యువతకు ఎలాంటి ప్రయోజనం దక్కలేదు. కానీ, ప్రత్యేక ఆర్థిక మండళ్లలో భూములు పొందిన అరబిందో, హెటెరో తదితర సంస్థలు జగన్ కంపెనీల్లోకి పెట్టుబడులను మాత్రం ప్రవహింపజేశాయి.

త్రిశంకు స్వర్గంలో భూములు
భూమికి పచ్చకోక కట్టినట్లు 2004కు ముందు కళ కళ లాడిన భూములు ఇప్పుడు ఎందుకూ కొరగాకుండా ఉన్నాయి. అప్పట్లో దేశానికి ఆహార భద్రత కల్పించిన అన్నదాత ఇప్పుడు తన బతుకుకే భద్రత కరువై విలవిల్లాడుతున్నాడు. బ్రహ్మణీ నుంచి వాన్‌పిక్ వరకూ జరిగిన తంతు గమనిస్తే.. తెర ముందు కనిపించే పారిశ్రామికవేత్తలు ఎవరైనా.. తెర వెనుక ‘మేళ్లు’ మాత్రం జగన్‌కే. ఆయన ఒక్కడికీ లబ్ధి చేకూర్చేందుకు కొంతమందికి గాలం వేసి వేలమంది రైతులను వీధులపాలు చేశారు.

ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కొత్తలో నల్లారి కిరణ్‌కుమార్ రెడ్డి రాష్ట్రంలో ఒక్కో పారిశ్రామికవేత్తకు ఒక్కో విధంగా భూ కేటాయింపు చేయడం అశాస్త్రీయమని, అసంబద్ధమని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో కొత్త భూ పంపిణీ విధానాన్ని తీసుకువస్తామని అట్టహాసంగా ప్రకటించారు.

గతంలో రైతులకు తక్కువ ధర చెల్లించి లాక్కున్న భూములను తిరిగి వారికే అప్పగించాలని వాన్‌పిక్ విషయంలో మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు సీఎం కిరణ్‌కు లేఖ రాశారు. దీనికితోడు, పరిశ్రమల పేరిట కేటాయించిన భూములు రాష్ట్రవ్యాప్తంగా వృథాగా పడి ఉన్నాయి. వాటిని వెనక్కు తీసుకుని తిరిగి రైతులకే అప్పగిస్తారా లేక ఆ భూములను ప్రభుత్వం తన ఆధీనంలో ఉంచుకుంటుందా అనే సందేహాలకు కిరణ్ సర్కారు నుంచి ఇప్పటి వరకు జవాబు లేదు.

ఉన్న భూమి పోయింది
నాకున్న రెండెకరాలను పరిశ్రమల పేరుతో ప్రభుత్వం తీసుకుంది. అందిన పరిహారం రుణాలకు, వ్యక్తిగత అవసరాలకు సరిపోయింది. ఉన్న భూమి పోయి కూలీగా మారాం. పరిశ్రమలో ఉద్యోగాలు, ఇంటి స్థలాలు ఇస్తామన్నారు. ఆ మాటే మరిచారు. భూమికి యజమానులుగా ఉన్న మేము ప్రస్తుతం కూలీలుగా మారాం.
– మాతయ్య, కోనేటిరాజుపాళెం,
నాయుడుపేట, నెల్లూరు జిల్లా

బజారున పడ్డాం
శ్రీసిటీ సెజ్ కోసం నా భూములు లాక్కున్నారు. వచ్చిన పరిహారం అప్పులకే చాలలేదు. ముందు చెప్పినట్లు ఫ్యాక్టరీల్లో ఉద్యోగాలివ్వలేదు. దున్నడానికి భూముల్లేవు. చెయ్యడానికి పనీ లేదు. ఇప్పుడు బజారున పడ్డాం.
– మునికృష్ణయ్య, చెంగంబాకం,
సత్యవేడు మండలం, చిత్తూరు జిల్లా

దక్షిణ క్షేత్ర వ్యవసాయ యంత్రముల శిక్షణ మరియు పరీక్షణ సంస్థ

మీ ప్రాంతంలోని రైతు సోదరులకు ఈ సంస్థ గురించి తెలియజేయండి

నాలుగు రోజుల క్రితం  అనంతపురం పట్టణానికి సమీపంలోని గార్లదిన్నె దగ్గర ఉన్నభారత ప్రభుత్వ వ్యవసాయ మంత్రిత్వ శాఖ వారిచే నడుపబడే “దక్షిణ క్షేత్ర వ్యవసాయ యంత్రముల శిక్షణ మరియు పరీక్షణ సంస్థను” సందర్శించడం జరిగింది.స్నేహితులొకరు దాదాపు 12 సంవత్సరాలు అమెరికాలో పనిచేసి తిరిగి మళ్ళీ మన దేశంలో పూణే నగరంలో రెండేళ్ళు నెలకు ఆరు అంకెల మంచి జీతంతో పనిచేస్తూ వ్యవసాయంపై మక్కువతో ఉద్యోగాన్ని వదలి ప్రకాశం జిల్లా కందుకూరు దగ్గర తన స్వంత గ్రామానికి దగ్గరగా పొలం తీసుకుని వ్యవసాయం ప్రారంభించారు.రైతులు ,వినియోగదారులూ మరచిపోతున్న జొన్న,సజ్జ,కొర్రలాంటి తృణధాన్యాలను పండించి  వాటి విలువను గురించి ప్రజలలో అవగాహన తీసుకురావాలని ఆలోచిస్తున్నారు.ఆ వ్యవసాయంతో పాటుగా  ఆవులను కొనుగోలు చేసి డైరీ కూడా ప్రారంభించారు.సేంద్రియ ఎరువును మాత్రం(సాధ్యమయినంతవరకు)వాడుతూ క్రిమి సంహారక మందులు వాడకుండా పర్యావరణానికి హాని చేయని సహజ పద్దతులు పాటిస్తూ వ్యవసాయం సాగిస్తున్నారు.

మనం ఎలాంటి వారమంటే మన దగ్గరున్న,మన ప్రాంతంలో పండుతున్నఈ తృణధాన్యాలను విస్మరించి విదేశాలనుంచి దిగుమతి అవుతున్న ఓట్స్ గురించి అత్యంత శ్రద్ధ తీసుకుని వాటి గురించి ప్రచారం చేస్తూ మధుమేహవ్యాధిగ్రస్తులకు మేలైన ఆహారమంటూ మనకు మనమే ప్రచారం చేస్తూ వాటిని వాడుతున్నాము.మధుమేహవ్యాధిగ్రస్తులకు జొన్నరొట్టె,జొన్నన్నము,రాగి సంగటి,కొర్రన్నము  కన్నా మించిన ఆహారం వేరే లేదు .ప్రజలకు  ఈ విషయం తెలియజేసే దిశగా ప్రభుత్వం,ఆహార నిపుణులు దృష్టి పెట్టడంలేదు .

దిగిన తర్వాతగానీ లోతు తెలియలేదన్నట్లు వ్యవసాయంలో దిగిన తర్వాతే  తెలిసిందిమా మా మిత్రునికి భారద్దేశంలో వ్యవసాయం ఎగసాయమని.రైతు పరిస్థితి అమ్మబోతే అడవి కొనబోతే కొరివి అని.ప్రభుత్వంవారు గొప్పగా చెప్పుకునే  ఆహారానికి పని పథకంవల్ల కాదు కాదు పనికి ఆహారపథకంవల్ల కూలీల సమస్య ఎదురై వ్యవసాయంలో యాంత్రీకరణను ఎక్కువగా ఉపయోగించుకోవాలని భావించి వాటి గురించి శిక్షణ,అవగాహన కలిగిస్తున్నఈ సంస్థ గురించి తెలుసుకుని ఇక్కడకు వచ్చారు వారితో పాటుగా ,వారికి సహాయంగా నేనూ వెళ్ళాను.ఆధునిక వ్యవసాయాన్ని సులభ పద్ధతుల్లో వివరిస్తూ రైతులకు తగిన శిక్షణనిస్తూ,ప్రస్తుతం సేద్యంలో ముఖ్య పాత్ర వహించే ట్రాక్టర్,దాని అనుబంధ పరికరాలను గురించి శిక్షణ ఇచ్చే సంస్థను దక్షిణ భారత రైతు సోదరులకోసం 1983సంవత్సరంలో అనంతపురం జిల్లా గార్లదిన్నె కేంద్రానికి 5కి.మీ దూరంలో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది.దేశంలో మిగిలిన మూడు ప్రాంతాల్లో కూడా ఇలాంటి సంస్థలనే స్థాపించింది.మధ్యభారతానికిబుధినిలో,ఉత్తరభారతానికి హర్యానాలో,ఈశాన్య రాష్ట్రాలకోసం అసోం రాష్ట్రంలోని బిశ్వంత్ చెరోలీలో ఏర్పాటు చేసారు.http://farmech.gov.in/

సంస్థ గురించి ,సంస్థ లక్ష్యాల గురించి,వ్యవసాయ యంత్రాలు,వాటి వాడకం గురించి  సంస్థ ఉద్యోగి శ్రీ కనకప్పగారు తమ అమూల్యమయిన సమయాన్ని మాకు కేటాయించి  చక్కగా వివరించి చెప్పారు.ఏ ప్రాంత రైతులయినా ఒక గ్రూపుగా వస్తే వారికి ప్రాధాన్యమిచ్చి చక్కటి శిక్షణను అందజేస్తామని తెలియజేసారు.

వ్యవసాయ యాంత్రీకరణకు సంబంధించి రైతుల అవసరాలకు తగినట్లుగా వివిధ యంత్రాల ఎంపిక,మరమ్మత్తులు,ఉపయోగించే పద్ధతులు,యాజమాన్యంపై రైతులకు,సాంకేతిక విద్యార్హతలు కలవారికి,ట్రాక్టర్లు,వ్యవసాయ యంత్రాల వినియోగదారులకు,ఉత్పత్తిదారులకు,విక్రేతల సిబ్బందికి,రైతు మహిళలకు వివిధ రకాల శిక్షణా తరగతులు ఇక్కడ నిర్వహిస్తారు.

అంతే కాకుండా భారత ప్రభుత్వంవారి(B.I.S)వారి నిర్ధేశిత నాణ్యతా సూత్రాలకు అనుగుణంగా,దేశంలో  ఉత్పత్తి అవుతున్న వివిధ వ్యవసాయ యంత్రాలు,ఇంజన్లు,పంపులు,పవర్ టిల్లర్ల నాణ్యతను ,మన్నికను పరీక్షించి,వినియోగదారులకు నాణ్యమైన పరికరాలు లభ్యమయ్యేటట్లు చేయడం కూడ సంస్థ మరో ఉద్దేశ్యం.

తనకు నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా ఈ సంస్థ ఎన్నో శిక్షణా తరగతులు నిర్వహిస్తూ రైతులు,విద్యార్థులు,మహిళలకు వ్యవసాయ యాంత్రీకరణలో పరిపూర్ణ విజ్ఞానాన్ని అందించుటలో తోడ్పడుచున్నది.రైతాంగానికి వ్యవసాయ రంగంలో ఆధునిక పరికరాలతో,
ట్రాక్టర్లతో సులభ పద్దతిలో క్రమశిక్షణతో నేర్పించి,రైతులను అభివృద్ధి దశలోకి తీసుకురావటం ఈ సంస్థ యొక్క ముఖ్య లక్ష్యం.

కోర్సుల వివరాలు:
1.యూజర్ లెవల్ కోర్సులు(యు-సీరిస్)
 • 1.వ్యవసాయంలో శక్తి వినియోగం 4వారాలు
 • 2.వివిధ వ్యవసాయ యంత్రాల ఎంపిక,వినియోగించే విధానం,జాగ్రత్త చర్యలు వాటి యాజమాన్యంపై శిక్షణ 6వారాలు
 • 3.పవర్ టిల్లర్లను నడుపుట,వాటి యాజమాన్యంపై శిక్షణ 2వారాలు
 • 4.మహిళా రైతులకు వివిధ వ్యవసాయ పనిముట్లపై శిక్షణ 3రోజులు
 • 5.బిందు,తుంపర్ల సేద్యం,వినియోగం,యాజమాన్యంపై శిక్షణ 1వారం
 • 6.సస్యరక్షణ పరికరాల ఎంపిక,వాటి వినియోగ విధానంపై శిక్షణ 1వారం
 • 7.చేతిపంపుల ఎంపిక,వాటి వినియోగం,యాజమాన్యంపై శిక్షణ 1వారం
 • 8.మెట్ట సేద్య వ్యవసాయ యంత్రాల ఎంపిక,వాటి నిర్వహణ,యాజమాన్యంపై శిక్షణ 2వారాలు
 • 9.పప్పు,నూనె ధాన్యాల పంటల ఉత్పత్తి,ఉపయోగించే వివిధ రకాల యంత్రాలపై శిక్షణ 1వారం
 • 10.వరిసాగులో ఉపయోగించే వివిధ రకాల యంత్రాలపై శిక్షణ 1వారం
ప్రవేశానికి అర్హతలు:
 • 1.కనీసం 8తరగతి వరకు చదివి ఉండాలి.
 • 2.వయస్సు 18సం.లు నిండి ఉండాలి.
 • 3.పొలము,వ్యవసాయ యంత్రములు కలిగిన వారికి ప్రాధాన్యమివ్వబడును.
ఈ కోర్సులన్నీ పూర్తిగా ఉచితం.

పై కోర్సులలో శిక్షణ పొందు విద్యార్థులకు నెలకు రూ.1200లు ఉపకార వేతనం కూడా ఇవ్వబడును.
శిక్షణలో చేరుటకు,శిక్షణ తర్వాత వారి స్వగ్రామం చేరడానికి బస్సు/రైలు కనీస చార్జీలు కూడా ఇస్తారు.
దరఖాస్తు విధానం: దరఖాస్తు ఫారాలను 20రూ.స్వయంగాగానీ,M.Oద్వారాగానీ చెల్లించి శని, ఆదివారాలు తప్పించి అన్ని పనిరోజులలో సంస్థ ద్వారా పొందవచ్చు.పూర్తి చేసిన ఫారాలను తగిన ప్రమాణ పత్రాలను జతపరచి ప్రారంభ తేదీకి కనీసం
నెలన్నరరోజులకు ముందుగా సంస్థ చిరునామాకు పంపవలెను.

2.టెక్నీషియన్ లెవల్ కోర్సులు(టి.సీరిస్)
 • 1.ట్రాక్టర్,డీజిల్ ఇంజన్ల మరమ్మత్తులపై శిక్షణ                                                        6వారాలు
 •  2.పవర్ టిల్లర్ మరమ్మత్తులపై శిక్షణ                                                                   2వారాలు
 •  3.వ్యవసాయ యంత్రాలు,హైడ్రాలిక్ సిస్టమ్‍పై ప్రత్యేక శిక్షణ                                      4వారాలు
 •  4.ఆటో ఎలక్ట్రికల్ పరికరాల,బ్యాటరీ మరమ్మత్తులపై శిక్షణ                                      3వారాలు
 •  5.భూమి చదును,వృద్ధి చేసే యంత్రాల నిర్వహణ,బుల్‍డోజర్ యాజమాన్యంపై శిక్షణ 4వారాలు
ప్రవేశార్హతలు:
 • 1.ఐ.టి.ఐ(డీజల్/మోటార్ మెకానిక్) కోర్సు పూర్తి చేసి ఉండాలి.
 • 2.వయస్సు 18సం.లు నిండి ఉండాలి.
 • 3.ఫీజు వారానికి రూ.50/-లు చొప్పున చెల్లించాలి.

దరఖాస్తుదారులు తమ పూర్తి వివరాలు,పేరు,చిరునామా,విద్యార్హతలు తెలియజేస్తూ తగిన ప్రమాణ పత్రాలను జతపరచి ప్రారంభ తేదీకి కనీసం
నెలన్నరరోజులకు ముందుగా సంస్థ చిరునామాకు పంపవలెను.

యాజమాన్య శిక్షణా తరగతులు:

వ్యవసాయ యంత్రాల ఉత్పత్తి దారులు/డీజల్ మెకానిక్‍లకు శిక్షణ        1వారం

విద్యార్థుల శిక్షణా కార్యక్రమాలు:
 • 1.డిగ్రీ/డిప్లొమా విద్యార్థులకు వ్యవసాయ యంత్రాల వినియోగంపై ప్రాక్టికల్ శిక్షణ                   4వారాలు
 • 2.ఐ.టి.ఐ/ఇంటర్మీడియట్ ఒకేషనల్ విద్యార్థులకు వ్యవసాయ యంత్రాల వినియోగంపై శిక్షణ 4వారాలు
అవసరాలకు అనుగుణ్యమైన కోర్సులు:
 • 1.వ్యవసాయ యంత్రాల వినియోగంపై అవసరాలకు అనుగుణ్యమైన శిక్షణా తరగతులు గ్రామం/మండల కేంద్రాలలో శిక్షణా తరగతులు                                                                                   1-2రోజులు
 • 2.ఆధునిక వ్యవసాయ యంత్రాల గురించిన అవగాహన మరియు ప్రదర్శన                    1-2రోజులు

పైన పేర్కొన్న వివిధ రకాల శిక్షణా కార్యక్రమాల నిర్వహణకు కావలసిన సదుపాయాలు ఈ శిక్షణా సంస్థలో లభ్యమవుతున్నాయి.
అవి
1.ట్రాక్టర్ అంతర్గత నిర్మాణాల ప్రదర్శనశాల
2.ట్రాక్టర్ హైడ్రాలిక్ విధానం ప్రదర్శనశాల
3.ఇంజన్ల ప్రదర్శనశాల
4.సస్యరక్షణ పరికరాల ప్రదర్శనశాల
5.నీటి పారుదల యంత్రాల ప్రదర్శనశాల
6.విద్యుత్ పరికరాల ప్రదర్శనశాల
7.విద్యుత్ డమ్మీ యంత్రాల ప్రదర్శనశాల
8.రైతు మహిళా వ్యవసాయ పరికరాల ప్రదర్శనశాల
9.సాంప్రదాయేతర ఇంధనముల పరికరాల ప్రదర్శనశాల
10.దృశ్య,శ్రవణ కేంద్రము
11.వ్యవసాయ యంత్రాల సంగ్రహాలయము
12.మెట్ట సేద్య వ్యవసాయ యంత్రాల ప్రదర్శనశాల
13.విభిన్న రకాలైన వ్యవసాయ యంత్రాల ప్రదర్శనా క్షేత్రము

శిక్షణా కాలంలో అభ్యర్థులకు వసతి సదుపాయాలు:

1.వసతి గృహము:శిక్షణ పొందు విద్యార్థులకు అన్ని సౌకర్యములుగల అధునాతన వసతి గృహము కలదు.
ఇందులో సుమారు వందమంది విద్యార్థులకు ఉచిత సౌకర్యము కల్పించడమైనది.భోజన వసతి కూడా కలదు కానీ భోజన ఖర్చులు విద్యార్థులే భరించవలసి ఉన్నది.కాలక్షేపానికి టెలివిజన్
మరియు ఆటలాడుకొనేటందుకు కావలసిన పరికరాలు సమకూర్చబడినవి.
2.ఆరోగ్య కేంద్రము:ఉచిత ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేసారు.
3.విజ్ఞాన సమాచార కేంద్రం:వివిధ భాషలలో వ్యవసాయ విజ్ఞానము,తదితర రంగాలకు,విభాగాలకు సంబంధించిన కొన్నివేల గ్రంథాలు,దిన,వార,మాసపత్రికలు మరియు జాతీయ,అంతర్జాతీయ
శాస్త్ర విజ్ఞాన పత్రికలు లభ్యమవుతున్న విజ్ఞాన సమాచార కేంద్రం కలదు.
4.దృశ్య శ్రవణ యంత్ర ప్రదర్శనశాల: విద్యార్థులకు దృశ్య,శ్రవణ యంత్రాలు,మల్టీమీడియా ద్వారా,విడియో క్యాసెట్స్,సీ.డీలు సేకరించి ప్రదర్శించుటకు తగిన సౌకర్యములు కలవు.

చిత్రాలు తరువాతి టపాలో

సంస్థ ఇ-మెయిల్ అడ్రస్:fmti_sr@nic.in
వెబ్ సైట్ :www.dacnet.nic.in/srfmtti