Category Archives: Press Release

Home   Press Release

రైతుపై నిర్లక్ష్యం దేశద్రోహం

రైతుకు కష్టం వస్తే ఆయన మరుక్షణం అక్కడ ప్రత్యక్షం అవుతారు. రైతు సంతోషంలోనే దేశ ప్రగతి ఉందని బలంగా నమ్ముతారాయన. అందుకోసం ఐ.ఆర్.ఎస్.సెలక్షన్‌ను వదులుకున్నారు. లక్ష జీతం వచ్చే సైంటిస్ట్ ఉద్యోగాన్ని గడ్డిపోచకింద తీసిపారేశారు. జన్యు మార్పిడి పంటలు, బిటి వంకాయలపై సాగిన పోరాటాన్ని ఆయన ముందుండి నడిపించారు. ఎరువులు, క్రిమి సంహారకాలు లేకుండా, సేంద్రీయ పద్ధతుల్లో పంటలు పండించే ఉద్యమాన్ని చేపట్టి దేశంలోనే మన రాష్ట్రాన్ని అదర్శంగా నిలిపారు. దేశంలో అపారంగా ఉన్న వనరులను చేజేతులా దుర్వినియోగం చేసుకుంటున్నాం.. అంతకు మించిన దేశద్రోహం లేదంటారు డాక్టర్ జి.వి. రామాంజనేయులు. రైతులకు అండగా ఉంటూ, వాళ్లను పీడించే వర్గాలకు కంటిమీద కునుకులేకుండా చేసే ఆయన అంతరంగం ఇది. ఢిల్లీోని వ్యవసాయ పరిశోధనా సంస్థలో డాక్టరేట్ చేస్తున్న రోజులవి. ఐ.ఏ.ఎస్. చదివి దేశానికి సేవ చేయాలనుకున్నాను. అందుకు ప్రిపేర్ అవుతూ భారత ఆర్థిక రంగాన్ని అధ్యయనం చేశాను. ప్రపంచంలో మరే దేశంలో లేని అపారమైన సహజ వనరులు, మానవ వనరులు మనకున్నాయి. అయినా మనం ఎందుకు వెనకబడి […]

Get Best Services from Our Business.
%d bloggers like this: