రాష్ట్ర రైతాంగానికి నిరాశ మిగిల్చిన 2013-2014 బడ్జెట్

రైతు కుటుంబాల సంక్షోభాన్ని దూరం చేయడానికి బడ్జెట్ కేటాయింపులు పెంచాలి -నిర్దిష్ట విధానాలు ప్రకటించాలి

 
రైతు స్వరాజ్య వేదిక, సుస్థిర వ్యవసాయ కేంద్రం డిమాండ్

2013-2014 సంవత్సరానికి ప్రత్యేక వ్యవసాయ బడ్జెట్ ప్రవేశ పెడతామని రాష్ట్ర ప్రభుత్వం గత కొన్ని నెలలుగా  పదే పదే ప్రకటిస్తూ వచ్చింది. కానీ ఈ రోజు అసెంబ్లీ లో జరిగిన ఘటనలను  చూస్తే ఒక తమాషా ను తల పించింది . ప్రభుత్వం తాను యిచ్చిన హామీ నుండి వెనక్కు వెళ్ళింది . ప్రత్యేక బడ్జెట్ కొంతయినా సమస్యలను పరిష్కరిస్తుందని ఎదురు చూసిన రాష్ట్ర రైతాంగం నిరాశ చెందింది ఈ రోజు రాష్ట్ర అసెంబ్లీ లో వ్యవసాయ శాకా మంత్రి ప్రత్యేక వ్యవసాయ బడ్జెట్ ప్రవేశ పెడతారని ప్రకటించి,వ్యవసాయ బడ్జెట్ పేరుతో పుస్తకాలు కూడా ప్రచురించి, తీరా బడ్జెట్ ప్రవేశ పెట్టె సమయానికి  దానిని వ్యవసాయ సమగ్ర కార్యాచరణ ప్రణాళిక అని సవరించి మొదట్లోనే ప్రభుత్వం తప్పుటడుగు  వేసింది.
రైతాంగాన్ని మోసం చేసింది. ఒక వేళ బడ్జెట్ కాదనుకున్నా , కార్యాచరణ ప్రణాళిక అనుకున్నా అది కూడా సమగ్రం గా లేదు . ఈ  రోజు బడ్జెట్ ప్రసంగం  ఒక  టే ,వీ చానల్ లో గతం లో మంత్రి గారు యిచ్చిన వివరణకు ఏ మాత్రం భిన్నం గా లేదు అందులో కొత్త విషయాలూ లేవు.  సమస్యలను ప్రస్తావించకుండా ,వాటికి నిర్దిష్ట పరిష్కారాలు సూచించకుండా కేవలం యిప్పటి వరకూ తమ ప్రభుత్వం చేసిన పనులను చెప్పడం, కేంద్ర ప్రభుత్వం రూపొందించిన పంచ వర్ష ప్రణాళిక లక్ష్యాలను ఏకరువు పెట్టడం ,వ్యవసాయ శాఖ ప్రతి సంవత్సరం ఇంగ్లీష్ లో ప్రచురించే సంవత్సర కార్యాచరణను ప్రకటించడం తప్ప అదనం గా ఈ పాలసీ ప్రకటన లో మరేమీ లేదు.  వ్యవసాయ, అనుభంద రంగాల కేటాయింపులన్నీ ఒక చోట  చేర్చి ప్రత్యేక బడ్జెట్ అంటారేమో అని గత కొన్ని రోజులుగా రైతు సంఘాలు వ్యక్తం చేసిన అభిప్రాయాలకు అనుగుణం గానే  ఈ రోజు బడ్జెట్ ఉన్నదీ . సమస్యలను పరిష్కరించే విధం గా కాకుండా , వాటిని కొనసాగించే విధం గానే ఈ రోజు ప్రతి పాదనలు ఉన్నాయి,
  • రైతులకు మద్దతు ధరలు అందించేందుకు ఏ ప్రతిపాదనలూ లేవు .. బడ్జెట్ కేటాయింపు లూ లెవు. రైతుల ఆలంబన నిధి పేరుతో కేటాయించిన 100 కోట్లు కూడా ఈ సమస్యను ఏ మాత్రం పరిష్క రించా లేవు .
  • వ్యవసాయాధార ప్రాంతాలకు కేటాయించిన నిధులన్నీ ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం వాటర్ షెడ్ కార్యక్రమాలకు యిచ్చే నిధులు మాత్రమే. అదనంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం యిందు కోసం కేటాయించిన నిధులు లేవు .
  • కౌలు రైతులకు బ్యాంకులు రుణాలు యివ్వడం లేదు . ఇందుకోసం కౌలు రైతుల తరపున రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్ గారంటీ యివ్వాలని రైతు సంఘాలు అడిగిన డిమాండ్ పై మంత్రి ప్రసంగం లో స్పందనే లేదు , ఈ సంవత్సరం కూడా  కౌలు రైతులకు  రుణాలు రావని తేలిపోయింది .
  • రాష్ట్రం లోని రైతులందరినీ వ్యవసాయ బీమా పరిధి లోకి తీసుక రావాలనీ, పరిహారం చెల్లించే భాద్యత ప్రభుత్వమే తీసుకోవాలనీ కొరామ్. కానీ ఈ విషయం లో నిర్దిష్ట ప్రకటన లేమీ లేవు .బద్జెత్ కేటాయింపులు కూడా పెంచలెధు. అంటే వ ఈ సంవత్సరం కూడా బీమా సౌకర్యం రైతులందరికీ అందదన్న మాట , అన్ని పంటలకూ,అన్ని జిల్లాలకూ గ్రామం యూనిట్ గా బీమా ఉండాలనే రైతుల కోరికను ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోలేదు .
  • విత్తన బిల్లు విషయం ప్రస్తావించినా , విత్తన పధకం కోసం కేటాయించిన నిధులు మాత్రం విత్తన సమస్యను పరిష్కరించేవి కావు. కంపెనీలకు లాభం చేసే విత్తన విధానానికి ప్రత్యామ్నాయం గా రైతులకు హక్కులను కల్పిస్తూ నాణ్యమైన విత్తనాలకు హామీ యిస్తూ, ధరలను అదుపులో ఉంచుతూ  కొత్త విత్తన బిల్లును వెంటనే అసెంబ్లీ లో ప్రభుత్వం ప్రవేశ పెడితేనే రైతుల విత్తన సమస్య పరిష్కారమవుతుంది .
  • వ్యవసాయ అనుబంధ రంగాలకు కేటాయించిన నిధులు పోయిన సంవత్సరం కంటే తక్కువే..

రైతు  సంఘాలు . ప్రస్తావించిన ఏ ముఖ్యమైన సమస్యనూ పరిష్కరించే ప్రతిపాదనలు  రాష్ట్ర బడ్జెట్ లో గానీ,  వ్యవసాయ మంత్రి ప్రకటన లో గానీ లేవు . దీనిని పరిశీలిస్తే రైతుల బాధల పట్ల  ఏ మాత్రం ఈ ప్రభుత్వానికి ఛిత్తసుద్ధి లేదనీ, రైతుల ఆత్మహత్యలను ఆపే లక్ష్యమేదీ లేదనీ అర్థమవుతుంది
.

రైతు సంఘాలు ,రాజ కీయ పార్టీలూ  ఒక్క గొంతు తో రైతుల సమస్యల పై మాట్లాడక పోతే ,ఉమ్మడిగా కార్యాచరణకు  దిగకపోతే  ఈ సమస్యలు పరిష్కారం కావు.

అసెంబ్లీ స్థాయీ సంఘాలపై మన ఒత్తిడిని కొనసాగించి  ప్రత్యేక వ్యవసాయ బడ్జెట్(  పాలసీ ప్రకటన) ను మరింత సమగ్ర పరుచుకునే కృషి ని  ఉమ్మడిగా
కొనసాగిద్దామని మేము విజ్ఞప్తి చేస్తున్నాం

Comments

Posted in Press Release, తెలుగు and tagged .

Leave a Reply