వచ్చే ఆర్థిక సంవత్సరంలో వ్యవ’సాయం’ రూ.63వేల కోట్లు నాబార్డు ప్రతిపాదనలు

హైదరాబాద్, ఫిబ్రవరి 14: వచ్చే ఆర్థిక సంవత్సరంలో వివిధ రంగాలకు రుణ మంజూరుపై నా బార్డు కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా వ్యవసాయానికి దాదాపు రూ. 63 కోట్ల మేర ఇచ్చేవిధంగా ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఈ మేరకు స్వల్ప, దీర్ఘకాలిక రుణాల కింద రూ.59818.95 కోట్లు, భూమి అభివృద్ధికి రూ. 654.75 కోట్లు, యాంత్రీకరణకు రూ.2432.12 కోట్ల మం జూరుకు ప్రతిపాదించింది. వీటిని రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్ఎల్‌బీసీ)కి పంపనున్న నేపథ్యంలో సోమవారం వ్యవసాయశాఖ అధికారులతో సమావేశమై సూచనలు స్వీకరించింది. ఈ సందర్భంగా అధికారులు వివిధ అంశాలను ప్రస్తావించారు. 

సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని నాబార్డు ఉన్నతాధికారులను కోరారు. ఇక నీటిపారుదల రంగానికి రూ.1061.38 కోట్లు, ఉద్యాన రంగానికి రూ.1441.72 కోట్లు ప్రతిపాదించింది. ఇక పశు సంవర్ధక శాఖ కింద రూ.2113.05 కోట్లు పాడి పరిశ్రమాభివృద్ధికి, రూ.1088.16 కోట్లు పౌల్ట్రీకి, రూ. 554.43 కోట్లు మేకలు, పందుల పెంపకానికి ప్రతిపాదించారు. మత్స్యరంగానికి రూ.1320.06 కోట్లు నాబార్డు ప్రతిపాదించింది. ఫుడ్ ప్రాసెసింగ్‌కు రూ.637.69 కోట్లు ప్రతిపాదించారు. నాబార్డు ప్రతిపాదనలు… ఎస్ఎల్‌బీసీ ఆమోదం బాగానే ఉన్నా.. ఆచరణలో మాత్రం బ్యాంకు లు శ్రద్ధ చూపడంలేదన్న విమర్శలున్నాయి.

Comments

Posted in News, తెలుగు and tagged , , .

Leave a Reply