బతుకు బేరంపై దర్యాప్తు: గుంటూరు రైతుల కిడ్నీ అమ్మకాల పై దర్యాప్తు. రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ లో ఫిర్యాదు…

 


గుంటూరు, మాచర్ల, ఫిబ్రవరి 14: గుంటూరు జిల్లాలో అప్పులపాలైన రైతులు కిడ్నీలు అమ్ముకుంటున్న వైనంపై రాష్ట్రప్రభుత్వం దర్యాప్తునకు ఆదేశించిం ది. ‘ఆంధ్రజ్యోతి’ ప్రధానసంచికలో ‘బతుకే బే రం’ శీర్షికన ప్రచురితమన ప్రత్యేక కథనం సర్కారులో కదలిక తెచ్చింది. దీనిపై కలెక్టర్ సురేష్‌కుమార్, రూరల్ ఎస్పీ సత్యనారాయణ దర్యాప్తునకు ఆదేశించారు. హైదరాబాద్ నుంచి సీఎం పేషీ ఆరాతీసింది. కలెక్టర్ ఆదేశాల మేరకు డీఎంహెచ్‌వో గో
పీనాయక్ శుక్రవారం రెంటచింతలలో ఇంటింటికీ తిరిగి వైద్య పరీక్షలు చేస్తున్నారు. గురజాల ప్రభుత్వాస్పత్రి బృందం కూడా రెంటచింతల చేరింది. స్పందించిన మానవ హక్కుల కమిషన్
హైదరాబాద్: గుంటూరు జిల్లాలో రైతుల కిడ్నీ అమ్మకాలపై రాష్ట్ర మానవహక్కుల కమిషన్ స్పందించింది. ‘ఆంధ్రజ్యోతి’లో వచ్చిన కథనాన్ని సోమరాజు అనే న్యాయవాది హెచ్చార్సీ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన హెచ్చార్సీ చైర్మన్ నిస్సార్ అహ్మద్ కక్రూ ఏప్రిల్ 2లోగా నివేదిక ఇవ్వాలని గుంటూరు రూరల్ ఎస్పీకి ఆదేశాలు ఇచ్చారు.

సాగుకు చేసిన అప్పు తీర్చేందుకే..
కలెక్టర్, రూరల్ ఎస్పీల ఆదేశాలతో రెవెన్యూ, పోలీసు అధికారులు వేర్వేరుగా విచారణ చేపట్టారు. బాధితుడు మారెబోయిన అప్పారావు నుంచి వివరాలు సేకరించారు. రెండేళ్లు చేసిన సాగు తనను అప్పులపాలు చేసిందని అప్పారావు ఆవేదన చెందాడు. మొదటి సంవత్సరం ఐదెకరాలు, రెండో సంవత్సరం నాలుగెకరాల పొలం కౌలుకు తీసుకొని సాగు చేసి రూ.9 లక్షలు అప్పులపాలయ్యానన్నారు. అప్పు తీర్చే పరిస్థితి లేక ఆత్మహత్య చేసుకోవాలనిపించి.. భార్య గుర్తుకొచ్చి ఆగిపోయానని చెప్పారు.

మాచర్ల వెళ్లినప్పుడు అక్కడ శ్రీను అనే దళారి చెప్పడంతో.. అతడి మాటలు నమ్మి కిడ్నీ అమ్మేందుకు హైదరాబాద్ వెళ్లానన్నారు. ప్రకాశం జిల్లాకు చెందిన ఓ వృద్ధుడికి తన కిడ్నీ ఇచ్చేందుకు రూ. 4.55 లక్షలకు బేరం కుదిరిందని, కానీ, మొత్తమ్మీద తనకు ముట్టినది రూ. 2.65 లక్షలేనని, మిగిలినది దళారి శ్రీను తీసుకున్నాడని వాపోయారు. కిడ్నీ అమ్మినా అప్పులు తీరకపోవడంతో.. పేరు మార్చుకుని మాచర్లలో ఉంటున్నట్లు తహసిల్దారుకు ఆయన తెలిపారు. కిడ్నీ ఇచ్చేందుకు జరిగిన రాతపత్రాలను బాధితుడి నుంచి పోలీసులు తీసుకున్నారు.

 

Comments

Posted in Articles, తెలుగు and tagged , .

Leave a Reply