రైతు పేరుతో కొత్త డ్రామా!

 

 

పక్క రాష్ట్రం లోనో, విదేశాలలోనో ధరలుంటే అక్కడికి వెళ్లి స్వేచ్చ గా అమ్ముకునే అవకాసం వుండాలనే పేరుతో జరిగిన కొత్త రాజకీయ డ్రామా ని కొంచెం అర్థం చేసుకోవాలి. ఈ రోజు రాష్ట్రం లోనే కాదు, దేశం లోనే గోదావరి జిల్లాలలో వారి పండించటానికి అయ్యే కర్చు ఎక్కువ. దీనికి ప్రధాన మైన రెండు కారణాలు అధికంగా రసాయనిక ఎరువులు వాడటం, అధికం గా కౌలు ధరలు పెరగటం. ఈ రెండిటి వలన ఎంత ఎక్కువ దిగుబడి వచ్చినా, ధాన్యం ఉత్పత్తి ఖర్చు చివరికి తెలంగాణా, రాయల సీమలలో అధిక ఖర్చుతో బోరు బావులు వేసుకొని పండిస్తున్న రైతుల కంటే ఎక్కువ. దీనితో రాష్ట్రం లోను, ప్రపంచం లోను ఎక్కడికి వెళ్ళిన మన వుత్పత్తి కర్చు ఎక్కువే కాబట్టి గిట్టుబాటు కాదు. ఏమైనా ఎవరిన వేలం లో క్వింటా ‘లక్ష’ కి వేలం లో కొంటె తప్ప.

అమ్ముకునే స్వేచ్చ రైతులకి చట్టం లోని లొసుగుల వలన కాదు…అప్పుల ఊబి లో చిక్కుకోవటం వలన రావటం లేదు. వారి మీద ఆంక్షలు వున్నాయి కాని మరి పప్పు ధాన్యాలు, నూనె గింజలపై ఏమి ఆంక్షలు లేవు మరి వాటి విషయంలో రైతులు ఎందుకు నష్ట పోతున్నారు? అప్పు తీసుకున్న వారికే అమ్ముకోవాల్సిన పరిస్తితిలో, ఊర్లోనే వేరే వారికీ అమ్ముకోలేని పరిస్తితి లో రైతులు వుంటే, పక్క రాష్ట్రాలకి విదేశాలకి వెళ్లి అమ్ముకునేది వ్యాపారులే. వారి లాభాల కోసమే ఈ డ్రామా అంతా. కౌలు రైతులకి బ్యాంకుల నుంచి రుణాలు రక పోవటం తో బయట నుంచి అధిక వడ్డికి (ఒక్కోసారి 36 శాతం వరకు) తెచ్చుకోవాల్సి వస్తుంది.

రెండు మూడు తరాల క్రితమే వేరే రాష్ట్రాలకు, విదేశాలకు వలస వెళ్ళినా, ఇంకా గ్రామాలలో భూముల పై హక్కులు వుంచుకొని, అధిక కౌలు వసూలు చేసుకుంటూ, ప్రభుత్వ రుణాలు, సబ్సిడీలు, ఇతర సహయాలన్ని మింగుతున్న కొత్త తరం భూస్వాముల నుండి సాగు దారులను రక్షించ నంత వరకు, పెట్టు బడి ఖర్చులు తగ్గే దిశ గా వ్యవసాయ పద్దతులు మారనంత వరకు ఈ పరిస్తితి మారదు. ఈ విషయం లో అన్ని రాజకీయ పార్టీలు తమ స్పష్టమైన వైఖరి ప్రకటించాలి.

Comments

Posted in Articles, Ramoo blog and tagged , .

Leave a Reply