రుణమే మరణ శాసనం

3 నెలలు.. 156 ప్రాణాలు! 
పొలాల్లోనే ప్రాణాలు తీసుకుంటున్న రైతులు 
50 శాతం కౌలుదారులే! 
ప్రైవేటు అప్పులతో ఛిన్నాభిన్నం 
సాయం లేదు.. చర్యల్లేవు 
సర్కారు మొద్దు నిద్ర
రాష్ట్రంలో వ్యవసాయమే మాయాజూదంలా మారిపోయింది. ఈ జూదాన్ని నమ్మి రైతులు అప్పు చేయటమన్నది.. వారి పాలిట పెను శాపంలా పరిణమించింది. ‘అప్పు'.. భూతంలా వెంటాడి, పట్టి పీడించి.. చివరికి ప్రాణాలను బలిదీసుకునే వరకూ వదలటం లేదు. ఇందుకు రాష్ట్రంలో ఇటీవలి రైతుల ఆత్మహత్యలే ప్రత్యక్ష సాక్ష్యం. గత 3 నెలల్లో 156 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. సగటున నెలకు 52 మంది.. రోజుకు దాదాపు ఇద్దరు! వీరిలో దాదాపు సగం మంది.. అంటే 74 మంది కౌలు రైతులు. ఈ దారుణ పరిస్థితులపై న్యూస్‌టుడే యంత్రాంగం పరిశీలన జరిపింది. అన్ని రకాలుగానూ ప్రతికూల పరిస్థితులు నెలకొన్న తరుణంలో ‘అప్పు' అన్నది రైతులను ఎంతగా కుంగదీస్తోందో, వారిని ఎంతకు తెగించేలా చేస్తోందో, రైతుకు అప్పులిచ్చే విషయంలో సమర్థమైన వ్యవస్థీకృత విధానం లేకపోవటం ఎంతటి దారుణాలకు తెర తీస్తోందో వెల్లడవుతోంది.
http://eenadu.net/Pannelsinner.aspx?qry=htm/panel3

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *