బీటీ పత్తి నిలువునా ముంచింది: 16.36 లక్షల ఎకరాల్లో ఎండిన పంట; రూ.6,545 కోట్లు కోల్పోయిన రైతులు

పత్తి రైతుల ఆశలను కరవు మింగేసింది. తీవ్ర వర్షాభావంతో పంట పూర్తిగా పోవడంతో పెట్టిన పెట్టుబడులు కూడా తిరిగి రాక అప్పుల ఊబిలో చిక్కుకుపోయేలా చేసింది. తెగుళ్లను తట్టుకుని అధిక దిగుబడులిస్తుందని, కాసుల వర్షం కురిపిస్తుందని నల్లబజారులో అధిక ధరలకు కొని సాగుచేసిన బీటీ పత్తి ఎండలకు తట్టుకోలేక నిలువునా ఎండిపోయింది. ఈ రకం వంగడాలు రాష్ట్రంలో నెలకొన్న అధిక వేడి వాతావరణాన్ని తట్టుకోలేకపోయాయి. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ఎన్నో ఏళ్లుగా పండించే సాధారణ పత్తి వంగడాలను సాగుచేస్తే వర్షాభావ పరిస్థితులకు తట్టుకుని కొంత పంటయినా చేతికొచ్చేదని ఆచార్య రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు తెలిపారు.
చిరాష్ట్రంలో కరెంటు కోత, తీవ్ర వర్షాభావంతో ఎండిపోయిన పత్తిపంట విస్తీర్ణం 16.36 లక్షల ఎకరాలకు చేరిందని వ్యవసాయ శాఖ తాజాగా ప్రభుత్వానికి నివేదించింది. వేరుశెనగ తరవాత అత్యధికంగా ఎండిపోయిన పంట ఇదే. ఈ ఏడాది 43 లక్షల ఎకరాల్లో పత్తి సాగుచేశారు. మిగిలిన 27 లక్షల ఎకరాల్లోని పంటయినా సక్రమంగా వస్తుందా అన్న ఆందోళన నెలకొంది.
చిసాధారణంగా ఎకరం పొలంలో 10 క్వింటాళ్ల పత్తి దిగుబడి వస్తుంది. ప్రస్తుతం క్వింటా ధర రూ.4వేలు ఉంది. ఈ ధర ప్రకారం లెక్కవేసినా మొత్తం ఎండిపోయిన 16.36 లక్షల ఎకరాలకు సంబంధించి పత్తి రైతులు కోల్పోయిన సొమ్ము రూ.6546 కోట్లని అధికారిక నివేదిక చెబుతోంది. ఈ నష్టం మరింత పెరిగే అవకాశమూ ఉంది.
చిసాధారణంగా ఎకరం పొలంలో 10 క్వింటాళ్ల పత్తి దిగుబడి వస్తుంది. ప్రస్తుతం క్వింటా ధర రూ.4వేలు ఉంది. ఈ ధర ప్రకారం లెక్కవేసినా మొత్తం ఎండిపోయిన 16.36 లక్షల ఎకరాలకు సంబంధించి పత్తి రైతులు కోల్పోయిన సొమ్ము రూ.6546 కోట్లని అధికారిక నివేదిక చెబుతోంది. ఈ నష్టం మరింత పెరిగే అవకాశమూ ఉంది.

చిబీటీ విత్తనాలను నల్లబజారులో 450 గ్రాముల ప్యాకెట్‌ను రూ.2500 చొప్పున కొని ఐదెకరాలు సాగుచేస్తే...ఇప్పుడు విత్తనాల ఖర్చు కూడా తిరిగి వచ్చే పరిస్థితి కానరావడం లేదని మెదక్‌ జిల్లా కొండపాకకు చెందిన రైతు నర్సింహ వాపోయారు. ఎకరానికి విత్తనాల ఖర్చే రూ.5 వేలు తేలిందని ఆవేదన వ్యక్తం చేశారు.

జీవ వైవిధ్యం లేకనే నష్టం 
రైతులు మూకుమ్మడిగా బీటీ విత్తనాలే సాగుచేయడం వల్ల జీవ వైవిధ్యం లేకుండా పోయింది. బీటీ పత్తి కొంత, మరికొంత స్థానిక రకాలైన నర్సింహ, ఎల్‌కే861 వంటివి సాగుచేయాలి. స్థానిక రకాలు ఒకసారి ఎండలకు కాత, పూత రాలిపోయినా...మరో వర్షానికి మళ్లీ చిగురించి రైతులకు కొంతయినా పంట చేతికొచ్చేది. అసలు తేలిక నేలల్లో వర్షాలను నమ్ముకుని పత్తి సాగుచేయడం కూడా సరైంది కాదు. వాతావరణం ప్రతికూలిస్తే...ఇక్కడ నష్టాలు తప్పవు.

- మొవ్వ రామారావు, మాజీ వ్యవసాయ శాస్త్రవేత్త
బీటీ వేయాల్సింది 30 శాతం విస్తీర్ణంలోనే... 
రాష్ట్రంలో బీటీ పత్తి సాగు వేలం వెర్రిలా మారింది. కరవు పరిస్థితుల నెలకొనడంతో రైతులు నష్టపోయారు. వాస్తవానికి 30 శాతం విస్తీర్ణంలోనే బీటీ సాగుచేయాలని శాస్త్రీయ పరిశోధనలు చెబుతున్నాయి. కానీ 90 శాతానికి మించి వేయడం వల్ల ఎండలకు తేలికపాటి నేలల్లో పంట ఎండిపోతోంది. బీటీ అనేది తెగుళ్ల నివారణకే పరిమితం. కరవు పరిస్థితుల్లో ఈ మొక్కల ఎదుగుదల సరిగా ఉండటం లేదు.
- రంగా వర్శిటీ ముఖ్యశాస్త్రవేత్త గోపీనాథ్, 
మాజీ శాస్త్రవేత్త జలపతిరావ

Comments

Posted in Articles, తెలుగు and tagged , .

Leave a Reply