సాగుబడి వ్యయం తగ్గాలి, గిట్టుబాటు ధర దక్కాలి, అప్పుడే… మార్కెట్‌లో రైతన్న మారాజు!

Farmers’ Income commission English

కర్షకుడంటే దేశానికి వెన్నెముక అంటూ సగర్వంగా నినదించడానికి ఇప్పుడు ఎవరూ సాహసించడం లేదు. ఈ నానుడికి ప్రస్తుతం కాలదోషం పట్టినట్టే భావించవచ్చు. వ్యవసాయ రంగం మీద ఎక్కువ మంది జనం ఆధారపడితే అది బరువేనని ప్రభుత్వాలు తరచూ చెప్పడం మనం వింటున్నాం. కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ తన బడ్జెట్‌లో 7.4 శాతం తలసరి ఆదాయ వృద్ధి సాధించగలమని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ వృద్ధి గడచిన నాలుగేళ్ల జీవన ప్రమాణాలలో సాధించిన వేగాన్ని సూచిస్తుంది. ఈ కాలంలో సాధించిన ఈ వృద్ధికి వ్యవసాయం, సేవల రంగం, వస్తువుల తయారీరంగం, వాణిజ్యం, నిర్మాణ రంగాలు దోహదం చేశాయి.

స్థూల జాతీయోత్పత్తిలో వచ్చిన పెరుగుదలకు కారణాలను అన్వేషించదలిస్తే మాత్రం వ్యవసాయం ఇందుకు దోహదపడలేదన్న వాస్తవం అనుభవానికి వస్తుంది. అదే సమయంలో వస్తువుల తయారీ రంగం, సేవల రంగాల వృద్ధి రేటు సంవత్సరానికి పది శాతానికి పైగా కనిపిస్తుంది. సేద్యం మాత్రం గడచిన ఐదేళ్లలో బాగా వెనుకబడి సగటున కేవలం 2.5 శాతం వృద్ధిని సాధించగలిగింది. నిజానికి అధిక పారిశ్రామికాభివృద్ధి రేటు సాధ్యం కావడానికి కారణం ఆహారపదార్థాల ధరలు తక్కువగా ఉండటమేనని విశ్లేషణలు చెబుతున్నాయి.

రైతాంగానికి స్వల్ప ఆదాయాలు దీని ఫలితమే. వారి దీనస్థితికి కారణం కూడా ఇక్కడే ఉంది.
దేశంలో 1997 నుంచి రైతుల ఆత్మహత్యల పరంపరను పరిశీలిస్తే 2008 నాటికి అవి 1,82,936కు చేరాయని ప్రభుత్వ రికార్డులే చెబుతున్నాయి. ఇవాళ్టి వరకు కూడా లెక్కకడితే ఆ సంఖ్య రెండు లక్షలు దాటిపోయింది. హరిత విప్లవంలో అగ్రభాగాన నిలిచి, అభివృద్ధి చెందిన రాష్ట్రాలుగా చెప్పుకుంటున్న మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, పంజాబ్‌లు కూడా వ్యవసాయ పరంగా దెబ్బతిన్న ప్రాంతాలలో ఉన్నాయి. 2002 సంవత్సరం నుంచి రైతుల ఆత్మహత్యల సంఖ్య సగటున సంవత్సరానికి 17,366కు చేరుకుంది. దేశంలో సేద్యం ఎన్ని ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నదో ఈ లెక్కలే చెబుతున్నాయి.

మరి ఈ పరిస్థితి నుంచి గట్టెక్కడానికి ఏం చేయాలి?

ప్రస్తుత పరిస్థితులలో సేద్యం మీద ఆధారపడి జీవిస్తున్నవారు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఆదాయాలు కుంచించుకుపోవడమే. 1997-2007 దశ కం వరకు వ్యవసాయోత్పత్తుల ధరల పెరుగుదలకీ, మిగిలిన ఉత్పత్తుల ధరల పెరుగుదలకీ మధ్య ఉన్న వ్యత్యాసాన్ని పరిశీలిస్తే ఎవరైనా విస్తుపోవలసిందే. వ్యవసాయోత్పత్తుల ధరలలో పెరుగుదల కేవలం 25 శాతమే కనిపిస్తుంది. అదే ఇతర వస్తువులు, అంటే ఇనుము, సిమెంట్, ప్రోసెస్ చేసిన ఆహార పదార్థాల ధరలు 300 నుంచి 600 శాతం పెరిగాయి. ఈ దశకంలోనే ఉద్యోగుల జీతాల పెరుగుదల కూడా గణనీయంగా ఉంది. ఆరో వేతన సంఘం పెంపును పక్కన పెట్టినా ఉద్యోగుల ఆదాయం సగటున 150 శాతం పెరిగింది.
ఇక శాసనసభ్యుల జీతాలయితే 500 శాతం పెరిగాయి. ఈ సందర్భంలో అర్జున్ సేన్ గుప్తా నేతృత్వంలో అసంఘటిత కార్మిక రంగం మీద నియోగించిన కమిటీ వెల్లడించిన వివరాలను కూడా గుర్తు చేసుకోవాలి. దేశంలో రైతుల ఆదాయం సగటున నెలకు రూ. 2,115. నెలవారీ ఖర్చు రూ. 2,770 అవుతోంది. ఇక దేశం మొత్తం రైతాంగంలో 84 శాతం ఉన్న చిన్న, బడుగు రైతుల ఆదాయం మాటేమిటి? సగటున వారి నెలసరి ఆదాయం రూ. 1,818 మాత్రమేనని సేన్‌గుప్తా కమిటీ తేల్చింది. కానీ వారి నెలవారీ ఖర్చు రూ. 2,678. దేశంలో ఆరు శాతం మాత్రమే ఉన్న పెద్ద, మధ్య తరగతి రైతుల ఆదాయమే వారి ఖర్చు కంటే కొద్దిగా ఎక్కువ ఉంది.

రైతుకు కష్టాలు కొత్తేమీ కాకపోయినా, ప్రస్తుతం ఇంత దయనీయ స్థితికి రావడానికి కారణం ఏమిటి? ఇందుకు మొదటిగా పేర్కొనవలసిన అంశం అడ్డూ అదుపూ లేకుండా పెరిగిపోయిన సాగు వ్యయం. దీనికి తోడు గిట్టుబాటు ధరలు లభ్యం కావడంలేదు. దీనితో రైతుల ఆదాయాలు, జీవన ప్రమాణాలు అనూహ్యమైన రీతిలో తలకిందులవుతున్నాయి. చేలలో వేసే ఎరువులు, పురుగుమందులు వంటివి దాదాపు అన్నీ దిగుమతి చేసుకోవలసిన పరిస్థితి ఉండడం వల్ల సేద్యం ఖర్చులు తడిసిమోపెడవుతున్నాయి. కొత్త సాంకేతిక పరిజ్ఞానం కూడా రైతుకు తలకు మించిన భారమైపోయింది. హైబ్రీడ్ విత్తనాలు, జన్యుమార్పిడి పంటలు, కొత్తరకం పురుగు మందులు సేద్యం ఖర్చును విపరీతంగా పెంచాయి. గడచిన పదేళ్లకాలంలో వీటి పెరుగుదల 300 శాతం వరకు ఉందంటేనే పెరిగిన వ్యవసాయ వ్యయంతో రైతు ఎంత కుంగిపోయాడో అర్థమవుతుంది. సంస్కరణలు కూడా రైతుకు మేలు చేయలేకపోయాయి.

విత్తనాల సరఫరాను పట్టించుకోకపోవడం; ఎరువులు, పురుగుమందుల ధరల నియంత్రణ బాధ్యతను ప్రభుత్వాలు తీసుకోకపోవడం వంటివి సంస్కరణల అనంతర పరిణామాలే.
కానీ ఒకటి మాత్రం తిరుగులేని నిజం. పంటల మీద వచ్చే ఆదాయమే రైతుకు ఏకైక ఆధారం. అయితే వ్యవసాయోత్పత్తుల ధరలు అటు సేద్యం ఖర్చుల ఆధారంగా గానీ, ఇటు రైతు కుటుంబాల నిత్య జీవితావసరాలకు అనుగుణంగా గానీ నిర్ణయం కావడం లేదు. అయితే కూలీ రేట్లు పెరగకుండాను, చేలలో వేసే వస్తువుల ధరలు పెరగకుండా ఉండేందుకుగాను వ్యవసాయోత్పత్తుల ధరలు పెంచే యోచన ప్రభుత్వాలు చేయడం లేదు. వ్యవసాయోత్పత్తుల ధరలు పెంచకుండా ఉంటే ఆహార పదార్థాల ధరలు అందుబాటులో ఉంటాయన్నదీ, ఎరువులూ, మందుల ధరలు కూడా తగ్గి ఉంటాయన్నదీ మన ప్రభుత్వాల భావన.

నిజం చెప్పాలంటే ధరల నియంత్రణ యంత్రాం గమే లోపభూయిష్టంగా ఉంది. ఇందులో పారదర్శకత అసలే లేదు. ఈ యంత్రాంగం వాస్తవ ధరలను పరిగణనలోకి తీసుకోని సందర్భాలు చాలా ఉన్నాయి. 33 వ్యవసాయోత్పత్తులకు గిట్టుబాటు ధర ప్రకటిస్తున్నా, ఇందులో వరి, గోధుమ పంటలకు మాత్రమే మార్కెట్‌లో ప్రమేయం ఉండే చర్యలు తీసుకుంటున్నారు. రైతులు వేసే మిగిలిన వాణిజ్య పంటలన్నీ మార్కెట్ దయ మీద ఆధారపడి ఉండవలసిందే. ద్రవ్యోల్బణం కారణంగా పెరిగిన జీవన వ్యయాలు కూడా రైతుల జీవితం మీద ద్విముఖ దాడి చేస్తూ ఉంటాయి. ద్రవ్యోల్బణం వల్ల వ్యవసాయోత్పత్తుల ధరలు తగ్గుతాయి. నిత్యావసరాల ధరలు మాత్రం పెరిగిపోతాయి. ప్రపంచ వాణిజ్య సంస్థ ఒప్పందాల మేరకు చౌక వస్తువులను దిగుమతి చేసుకోవడం వల్ల కూడా సేద్యం ఒడిదుడుకులకు లోనవుతున్నది.

ఎన్ని విమర్శలూ, ఆరోపణలూ ఉన్నా, అవన్నీ అరకొరగా ఉన్నట్టనిపించినా రైతులకు ప్రభుత్వం ఏమీ చేయడం లేదని అనలేం. ఎరువులూ, పురుగుమందులకూ; పంటలకూ రాయితీలు ఇవ్వడం, గిట్టుబాటుధరల ప్రకటన వంటి మార్గాల ద్వారా రైతులకు చేయూతను ఇవ్వడం చేస్తున్నది. కానీ గిట్టుబాటు ధరల ప్రకటన ఒక్కటే రైతుల కష్టాలను తీర్చలేదని గత అనుభవాలు చెబుతున్నాయి. ముఖ్యంగా చిన్న, సన్నకారు రైతుల అవసరాలను ఇది అసలు తీర్చలేదని కూడా పలు సందర్భాలలో తేలిపోయింది. అందుకే వ్యవసాయం లాభసాటి వ్యాపకంగా ఉండాలంటే రైతులకు కనీస నికర ఆదాయం ఉండే విధంగా చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని వ్యవసాయదారుల శ్రేయస్సు కోసం నియోగించిన జాతీయ కమిషన్ పేర్కొన్నది.

రైతుల ఆదాయానికి స్థిరత్వాన్ని కల్పించడానికి చట్టబద్ధమైన ఒక కమిషన్‌ను ప్రభుత్వం నియమించాలి. ఈ కమిషన్ ఏటా రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఆదాయాల పరిస్థితి ఎలా ఉందో పరిశీలిస్తుంది. రైతు కుటుంబాలు కనీస ఆదాయం పొందేందుకు అనువైన కొన్ని సిఫారసులను చేస్తుంది. ఈ కమిషన్ సేద్యం ఖర్చులను, ఇచ్చిన సబ్సిడీలను, వాస్తవిక ధరలను పరిశీలించాలి. రైతు పెట్టిన పెట్టుబడి, వచ్చిన ఆదాయాల మధ్య సమతూకం తెచ్చేందుకు ప్రభుత్వానికి సలహాలు ఇవ్వాలి. రైతుల నిలకడైన ఆదాయం కోసం వేతన సంఘం చేసిన రెండు సిఫారసులను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. అందులో మొదటి సిఫారసు- రోజువారీ అవసరాలు తీర్చగలిగిన కనీస ఆదాయం. రెండు- వ్యవసాయ రంగం నుంచి ప్రజలు వైదొలగకుండా ప్రోత్సాహకాలు ఇవ్వడానికి ఫిట్‌మెంట్ సౌకర్యం ఇవ్వడం. వీటన్నిటినీ సాధించడానికి రైతుల ఆదాయ కమిషన్ బహుముఖ వ్యూహాన్ని అనుసరించాలి. వ్యవసాయోత్పత్తులకు గిట్టుబాటు ధరలు ఇవ్వడం కూడా అందులో భాగమే.

పంటల ధరలను నిర్ణయించడానికి ఉత్పత్తికి అయిన వాస్తవ వ్యయాన్ని ప్రాతిపదికగా తీసుకోవాలి. అలాగే ద్రవ్యోల్బణాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలి. వ్యవసాయదారులకోసం నియోగించిన జాతీయ కమిషన్ సిఫారసు చేసినట్టు గిట్టుబాటు ధరలను ఉత్పత్తి వ్యయానికి కనీసం యాభై శాతం లాభం కలిపి నిర్ణయించాలి. గిట్టుబాటు ధరల వ్యవహారం రాష్ట్ర స్థాయిలో పారదర్శకంగా జరగాలి. పంటల సీజన్ ప్రారంభం కావడానికి ముందే అన్ని పంటలకు గిట్టుబాటు ధర ప్రకటించాలి. వీటిని సక్రమంగా అమలు చేయాలి. కేంద్ర ధరలు తక్కువగా ఉంటే సరైన సమయంలో ప్రభుత్వాలు జోక్యం కల్పించుకుని, ధాన్యం సేకరణ కార్యక్రమం చేపట్టాలి. ప్రభుత్వాలు రాష్టస్థ్రాయిలో వ్యవసాయోత్పత్తుల ఖర్చులు, ధరల కమిషన్‌ను ఏర్పాటు చేయాలి. అలాగే ధరల స్థిరీకరణ నిధిని కూడా ఏర్పాటు చేయాలి. ధరల నియంత్రణలో ప్రభుత్వ జోక్యం ఉంటే (లెవీ, రెండు రూపాయల బియ్యం పథకం వంటివి)ఆ నష్టాన్ని ప్రభుత్వం భర్తీ చేయాలి.

చేలకు అందించవలసిన ఎరువులు, రసాయనాల విషయంలో రైతుల ఆలోచనలో మార్పు తెచ్చేందుకు ప్రభుత్వం తన వంతు కృషి చేయవలసి ఉంటుంది. అసలు వ్యవసాయమే జూదం వంటిదని సంప్రదాయకంగా చెబుతారు. అలాంటిది ఈ ఎరువులు, పురుగుమందులతో సేద్యం అంటే జూదమే అన్న భావనకు మరింత బలం పెరిగింది. కాబట్టి వీటి నుంచి రైతులను కాస్త దూరంగా ఉంచాలి. దానితోనే పర్యావరణ సమస్య, రైతు ఆర్థిక సమస్య కూడా పరిష్కరించే వీలు ఉంటుంది. రసాయనిక ఎరువుల స్థానంలో దేశీయమైన ప్రత్యామ్నాయాలను అన్వేషించేందుకు ప్రోత్సహించాలి.

కూలి కూడా ఇప్పుడు రైతులు భరించలేని విధంగా ఉంది. చేలకు వేయవలసిన పదార్థాలకు రాయితీ ఇచ్చే క్రమంలోనే కూలీల వేతనం కూడా ప్రభుత్వం రాయితీ రూపంలో ఇవ్వవచ్చు. వ్యవసాయోత్పత్తుల ఆధారంగా గ్రామీణ ప్రాంతాలలో చిన్న తరహా పరిశ్రమలు ఏర్పాటు చేయడం కూడా అవసరం. దీనితో అక్కడ ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. దీనివల్ల పట్టణాలకు వలసలను కూడా నిరోధించవచ్చు. పట్టణ-గ్రామీణ వ్యత్యాసాలను కూడా తగ్గించవచ్చు.

ఇవన్నీ అమలులోకి తెచ్చినా కూడా ఎక్కడైనా తక్కువ ఆదాయంతో బాధపడే రైతు కుటుంబాలు ఉంటే వారికి నేరుగా నగదు చెల్లించవలసిన అవసరం కూడా ఉంది. ప్రతి కుటుంబానికి నెలకు రూ. 15,000 ఆదాయం వచ్చేలా రైతుల ఆదాయ కమిషన్ చర్యలు తీసుకోవాలి. నిజానికి ఆంధ్రప్రదేశ్‌లో 1.2 కోట్ల మంది రైతులు ఉన్నారు. వీరందరికీ ప్రభుత్వం నేరుగా ఈ విధమైన ఆర్థిక మద్దతు అందిస్తే సంవత్సరానికి రూ. 25,000 కోట్లు ఖర్చు అవుతుంది. ఇది రాష్ట్ర వార్షిక బడ్జెట్‌లో 25 శాతం. ఈ చర్యలు తీసుకుంటే దారిద్య్రరేఖకు దిగువన ఉన్న యాభై శాతం మందికి విముక్తి కల్పించినట్టవుతుంది. చిన్న, సన్నకారు రైతుల ఆహారభద్రతకు ఇది హామీ ఇవ్వగలుగుతుంది.
డాక్టర్ జీవీ రామాంజనేయులు
సెంటర్ ఫర్ సస్టైనబుల్ అగ్రికల్చర్ (సీఎస్‌ఏ) హైదరాబాద్

http://timesofindia.indiatimes.com/city/ahmedabad/Study-disputes-Gujarats-miracle-in-agriculture-growth/articleshow/6897547.cms#ixzz158BwAFjL

Rajiv Shah, TNN, Nov 10, 2010, 06.12am IST

GANDHINAGAR: A new study, meant for “restricted circulation”, is creating ripples among state’s policy-makers, who have, for over a year, cited an analysis by scholars Tushaar Shah and Ashok Gulati for the International Water Management Institute, Sri Lanka, to say that Gujarat’s “miracle agricultural growth” since 2000 is a trend-setter for India.

The new study, “Gujarat’s agricultural growth story: exploding some myths”, says the talk of “high growth in the early years of the new millennium” of 9.6 per cent per annum is “misleading” and “distorted”. Carried out by M Dinesh Kumar, A Narayanamoorthy, OP Singh, MVK Sivamohan, Manoj Sharma and Nitin Bassi for the Institute of Resource Analysis and Policy, Hyderabad, the study says the real “miracle growth” in Gujarat’s agriculture history occurred “during 1988-89 to 1998-99”, when it grew by 10 per cent. But from 2000-01 and 2008-09, the actual growth was “four per cent” against the claim of 9.6 per cent”. Even this growth was because of farmers using Narmada waters, not because of check dams, as claimed by Shah-Gulati.

The study says that the “miracle” argument fails to take into account a crucial figure – fall of agricultural output by 30 per cent during two drought years, 1999 and 2000.

Then, there is yet another distortion – the 9.6 per cent growth rate is on current prices, which means that the “figures are not corrected for inflation”.

It underlines, “The ‘growth’ observed in the recent past (2002 onwards) is nothing but a good recovery from a major dip in production occurred during the drought years of 1999 and 2000.” The state officials are examining the study.

The study also disputes the argument that dependence on rainfall went down in Gujarat due to a large number of check dams built in the state in 1999-2000.

The highest growth, 22 per cent, during 1980-2006, was on account of milk production. As for crops like cotton and groundnut, “with good monsoons, production grew substantially with steady expansion in cropped area or yield growth”, but in drought years “production suffered with shrinkage in area under irrigated winter crops, and sharp reduction in yield of crops sown in kharif, including cotton and groundnut”.

Insisting that water in these small reservoirs mainly “gets evaporated”, the study says, “though there has been a marked and consistent increase in the area under cotton cultivation during 1994 and 2006, this did not get translated into a production gain, and there was a sharp decline in yield during drought years.”

Suggesting that “sharp fluctuations” characterize the area under irrigation, the study adds, the area under groundnut cultivation has been “hovering around two million hectares (ha) in the past three decades after a slow decline from a peak of 2.3 million ha in early 1960s”.

రైతు ప్రయోజనాలకు విత్తన బిల్లు లో తిలోదకాలు

http://sakshi.com/main/WeeklyDetails.aspx?Newsid=5449&Categoryid=1&subcatid=18

అన్నదాత వెన్నువిరుగుతోంది. తమ జీవితాలను శాసిస్తోన్న నాసిరకం విత్తనంపై రైతులు జరిపిన పోరాటం నిష్ఫలమని తేలిపోయింది. ఈ దేశంలో నాణ్యమైన విత్తనాన్ని ఆశించడం అత్యాశేనని రూఢీ అయింది. విత్తనంపై కంపెనీల పెత్తనానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఇక పార్లమెంటు ఆమోదముద్ర పడడమే తరువాయి. అనేక నిరసనలు, ఆందోళనల మధ్య ఆరేళ్లపాటు ఆగిన విత్తనబిల్లు ఈ శీతాకాల సమావేశాల్లో మరలా పార్లమెంటు ముందుకు రాబోతోంది. దేశవ్యాప్తంగా వచ్చిన నిరసనలను దృష్టిలో ఉంచుకుని ఇటీవల కేంద్ర కేబినెట్ కొన్ని సవరణలను ఆమోదించింది. అయితే ఆ సవరణలలో రైతుల ప్రయోజనాలు నెరవేర్చేవిగానీ, రాష్ర్ట ప్రభుత్వాల బాధ్యతను పెంచేవి గానీ లేవు.
ఈ బిల్లులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించిన కీలకమైన సవరణలను కేంద్రం పట్టించుకోలేదు. ఈ ఏడాది ఏప్రిల్‌లో ప్రధాని మన్మోహన్‌సింగ్‌ను, యూపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీని, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శరద్‌పవార్‌ను రాష్ర్ట వ్యవసాయశాఖ మంత్రి రఘువీరా రెడ్డి నాయకత్వంలో అఖిలపక్ష రైతుసంఘాల ప్రతినిధులు కలిశారు. విత్తన బిల్లులో తాము ఆశిస్తున్న సవరణలను వారి ముందుంచారు. తప్పకుండా పరిశీలిస్తామని శరద్ పవార్ నుంచి హామీ లభించింది. అయితే కొత్తగా ఆమోదించిన సవరణలను చూస్తే రాష్ర్ట ప్రభుత్వ ప్రతిపాదనలనుగానీ, రైతుల ఆందోళనను గానీ కేంద్రం పరిగణనలోకి తీసుకున్న జాడ లేదు.
రాష్ర్టం కోరిందేమిటి?

విత్తనధర, రాయల్టీ నిర్ణయించడం కోసం రాష్ర్ట స్థాయిలో రెగ్యులేటరీ యంత్రాంగం ఉండాలని రాష్ర్ట ప్రభుత్వం ప్రతిపాదించింది. ధర, రాయల్టీలను నిర్ణయించే అధికారం మార్కెట్ శక్తులకు వదలివేయరాదని పలువురు ఎంపీలు కూడా కేంద్రాన్ని కోరారు. అయితే దీనికి సంబంధించిన ప్రస్తావనేదీ కేంద్ర కేబినెట్ ఆమోదించిన సవరణలలో లేదు.

విత్తన సంస్థల లోపభూయిష్టమైన చర్యల వల్ల రైతులు పంట నష్టపోతే పరిహారాన్ని నిర్ధారించే కమిటీని ఢిల్లీ స్థాయిలో కాకుండా రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో ఏర్పాటు చేసుకోవడానికి అవకాశమివ్వాలని, బాధిత రైతులకు మూడునెలల్లో పరి హారం అందేలా నిబంధనలుండాలని రాష్ర్టప్రభుత్వం కోరింది. ఈ ప్రతిపాదన కూడా ఆమోదానికి నోచుకోలేదు. ఢిల్లీ స్థాయిలో ఏర్పాటయ్యే కమిటీ నామినేషన్‌కు సంబంధించిన కొన్ని మార్పులకు ఆమోద ముద్ర వేశారు తప్ప రాష్ర్ట స్థాయిలో కమిటీల ఏర్పాటుకు కేంద్రం అంగీకరించలేదు.

ఐసీఏఆర్ ఇన్‌స్టిట్యూట్‌లలోనూ, రాష్ర్ట వ్యవసాయ విశ్వవిద్యాలయాలు క్షేత్రస్థాయిలో పరి శీలన జరిపిన తర్వాత మాత్రమే విదేశీ విత్తనాలకు అనుమతినివ్వాలనేది రాష్ర్ట ప్రభుత్వం చేసిన మరో ప్రతిపాదన. కీలకమైన ఈ సవరణను కేంద్రం పట్టించుకోలేదు.
ఏ కంపెనీ ఎక్కడ విత్తనాలు సేకరించిందీ, వాటిని ఎవరికి సరఫరా చేసిందీ ప్రతినెలా రాష్ర్ట వ్యవసాయ శాఖలకు కచ్చితంగా తెలపాలన్న ప్రతిపాదన కూడా ఆమోదానికి నోచుకోలేదు.

జరిమానా, జైలు శిక్షలు పెంపు

బాధ్యతారహితంగా వ్యవహరించే, అవకతవకలకు పాల్పడే విత్తన కంపెనీలకు భారీ జరిమానాలు, శిక్షలు ఉండాలని రాష్ర్ట ప్రభుత్వం ప్రతిపాదించింది. గరిష్టంగా జరిమానాను లక్ష రూపాయల వరకూ పెంచాలని, ఏడాది కఠిన కారాగార శిక్ష ఉండేలా బిల్లులో సవరణ చేర్చాలని రాష్ర్టం ప్రతిపాదించింది. శిక్షాకాలం ఏడాదికి, జరిమానా ఐదులక్షల రూపాయలకు పెంచుతూ బిల్లులో సవరణ చేర్చనున్నారు. దీంతోపాటు అవకతవకలకు పాల్పడే కంపెనీల రిజి స్ట్రేషన్‌ను రద్దు చేసేందుకు వీలు కల్పించే నిబంధనను కూడా బిల్లులో చేర్చనున్నారు.

కోట్లు దాటుతున్న కంపెనీల అక్రమార్జన

నాణ్యతకు ఏనాడో తిలోదకాలొదిలిన విత్తన కంపెనీలు రైతులకు నాసిరకమైన, కల్తీ విత్తనాలను అంటగడుతూ కోట్లు గడిస్తున్నాయి. వ్యవసాయం గురించి ఏమాత్రం తెలియని వారు, విత్తన నాణ్యత, విత్తన పరిరక్షణ గురించి కనీస అవగాహన లేనివారు సైతం విత్తన కంపెనీలు పెట్టి వ్యాపారం సాగించేందుకు వీలుండటంతో కంపెనీలు తామరతంపరగా పుట్టుకొస్తున్నాయి. వాటిని అదుపు చేసే నిబంధనలేవీ ప్రస్తుతానికి లేవు. కంపెనీల రిజిస్ట్రేషన్ నుంచే మొదలయ్యే అక్రమాలు విత్తన ధృవీకరణ వరకూ నిరాటంకంగా సాగిపోతున్నాయి. ఏటా మన రాష్ట్రంలో 40 వరకూ ప్రభుత్వ తనిఖీ బృందాలు నాశిరకం విత్తనాల అనుపానులు కనుక్కుంటూ లక్షల క్వింటాళ్ల విత్తనాలను సీజ్ చేస్తుంటాయి. వాటి విలువ కోట్లలో ఉంటుంది.

వందల సంఖ్యలో కేసులు నమోదవుతుంటాయి. పదుల సంఖ్యలో కంపెనీల లెసైన్సులు రద్దవుతుంటాయి. కొద్దినెలలు గడవక మునుపే మరలా వాటికి లెసైన్సులు వచ్చేస్తుంటాయి. ఇదంతా ఓ ప్రహసనం. ఏటా విత్తన సేకరణ, విక్రయ వ్యవహారాలలో వేల కోట్లు చేతులు మారుతున్నాయి. అధికార యంత్రాంగంలో కింది నుంచి పైస్థాయి వరకూ పెరిగిపోయిన అవినీతి వల్ల నాణ్యమైన విత్తనం అందని ద్రాక్షలా మారింది. రైతులకు అందుతున్న విత్తనాలు మంచివా కావా అని నిర్ధారించే కార్యక్రమం ప్రభుత్వ విభాగాల ఆధ్వర్యంలోనే కొనసాగుతోంది. అయినా అదుపు తప్పిన అవినీతి ముందు విత్తన నాణ్యత వెలవెలాబోతోంది.

సాక్షాత్తూ విత్తనాభివృద్ధి సంస్థల ద్వారా సరఫరా చేస్తున్న విత్తనాలే మొలకెత్తడం లేదని పలు జిల్లాల నుంచి ఫిర్యాదులు అందుతున్నాయి. ప్రభుత్వ సంస్థల పరిస్థితే ఇలా ఉంటే ఇక ప్రైవేటు సంస్థల నుంచి నాణ్యమైన విత్తనాన్ని ఆశించడం అత్యాశే. ఇప్పటి వరకూ ఉన్న విత్తనచట్టాల్లోని లొసుగులను, లోపాలను తమకు అనుకూలంగా మలచుకొని విత్తన కంపెనీలు పెత్తనం సాగిస్తున్నాయి. కొత్తగా వస్తున్న చట్టంతోనైనా తమ కష్టాలు తొలగుతాయని ఆశించిన రైతులకు నిరాశే మిగులుతోంది.

పెరిగిన విత్తన ధరలు

గత దశాబ్ద కాలంలో విత్తనాల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. హైబ్రిడ్ విత్తనాల ధరలు వేలల్లో ఉన్నాయి. ధరల నియంత్రణపై ప్రస్తుత విత్తన బిల్లులో ఎటువంటి ప్రతిపాదనలూ లేవు. ధర భరించ గలిగిన రైతులు కొనుక్కోగలిగితే కొనుక్కోవడం లేదంటే లేదు అంతే. ప్రభుత్వ అదుపు లేకపోవడంతో విత్తన కంపెనీలు తమకు ఇష్టం వచ్చినట్లు రేట్లు పెంచేస్తున్నాయి. ఏ ఏటికాయేడు విత్తనాలను కొనుక్కోవలసి ఉండడంతో ఈ ఖర్చు విపరీతంగా పెరిగిపోతోంది. ఉదాహరణకు టొమేటో విత్తనాల ధర కిలో రు. 475 నుంచి రు. 76,000 వరకూ ఉంది. కిలో క్యాప్సికం విత్తన ధర రు. 3,670 నుంచి రు. 65,200 మధ్య ఉంది. మన రాష్ర్టంలో కిలో మిరప విత్తనాల ధర రు. 40,000 నుంచి 60,000 వరకూ ఉందంటే సమస్య తీవ్రత అర్ధమౌతుంది. కంపెనీని బట్టి, డిమాండ్‌ను బట్టి రేటు మారిపోతుంది. కంపెనీలు సృష్టించే కృత్రిమ కొరత ఈ పరిస్థితిని బాగా ఎగదోస్తోంది. విత్తన ధరలు, రాయల్టీలకు సంబంధించి కంపెనీలను అదుపుచేయడానికి గాను బిల్లులోని ఐదవ క్లాజును సవరించాలని రాష్ర్ట ప్రభుత్వాలు కోరుతున్నా అది నెరవేరలేదు.

మోన్‌శాంటో కంపెనీ 450 గ్రాముల పత్తి విత్తన ప్యాకెట్‌కు రాయల్టీ పేర రు. 1,250 అదనంగా వసూలు చేయడంపై వైఎస్ హయాంలో రాష్ర్ట ప్రభుత్వం సుప్రీం కోర్టు వరకూ వెళ్లి న్యాయపోరాటం చేసింది. రాష్ర్ట ప్రభుత్వ చొరవ కారణంగానే ప్రస్తుతం బీటీ పత్తి ప్యాకెట్ ధర రు. 650- 750 మధ్య ఉంది. విత్తనాలకు సంబంధించి అనేక సందర్భాలలో రాష్ర్ట ప్రభుత్వం విత్తన కంపెనీల నుంచి కేసులను కూడా ఎదుర్కొంది. బీటీ పత్తి విత్తనాల ధర రు. 450 నుంచి రు. 1,800కు పెరిగిన సందర్భంలో రాష్ర్ట ప్రభుత్వం ఎంఆర్‌టీపీ కమిషన్‌ను ఆశ్రయించింది. ధరలు తగ్గించాలని ఆ కమిషన్ ఆదేశించినా విత్తన కంపెనీలు లెక్కచేయలేదు. దాంతో రాష్ర్ట స్థాయిలో 2007లో జన్యుమార్పిడి పత్తి విత్తనాల నియంత్రణ చట్టం చేయాల్సి వచ్చింది.
రైతులు కోరుతున్నదేమిటి?

అవకతవకలకు పాల్పడే విత్తన కంపెనీలపై జరిమానాలు పెంచడం, శిక్షలు పెంచడం వల్ల తమకు ఒరిగే లాభమేమిటని రైతులు ప్రశ్నిస్తున్నారు. వేల కోట్ల రూపాయలను అక్రమంగా ఆర్జిస్తున్న విత్తనకంపెనీలను రూ. ఐదు లక్షల జరిమానా ఏం అదుపు చేస్తుందని రైతులు అడుగుతున్నారు. విత్తన కంపెనీలపై ఏ ఫిర్యాదు చేయాలన్నా ఢిల్లీ వెళ్లాలంటే రైతుల వల్ల అయ్యే పనేనా? అందుకే విత్తన కంపెనీలు రాష్ర్టంలోనే రిజిస్ట్రేషన్ చేసుకునేలా నిబంధనలు సడలించాలని, వాటిపై రాష్ర్ట ప్రభుత్వాల అదుపు ఉండాలని రైతులు కోరుతున్నారు. నాసిరకం విత్తనాల వల్ల తాము నష్టపోయిన సందర్భాలలో వెనువెంటనే జిల్లా స్థాయిలో ఓ నిపుణుల కమిటీ వేయాలని రైతులు ఎప్పటి నుంచో అడుగుతున్నారు.

ఈ కమిటీ క్షేత్ర స్థాయిలో పరిశీలన జరిపి నిజానిజాలు నిగ్గు తేల్చడానికి వీలవుతుందని, ఈ కమిటీలో వ్యవసాయ శాస్తవ్రేత్తలు, అడ్వకేట్, వ్యవసాయ శాఖ అధికారులు, బాధిత రైతులు ఉండాలని వారు ప్రతిపాదిస్తున్నారు. ఈ కమిటీ ఇచ్చే నివేదికపై రైతులకు ఏవైనా అభ్యంతరాలు ఉంటే రాష్ర్ట స్థాయిలో ఇదే విధంగా ఏర్పాటు చేసే నిపుణుల కమిటీ చేత పునర్విచారణ జరిపించాలని, అది తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటామని రైతులు చెబుతున్నారు.

ఆ నివేదిక ప్రకారం కంపెనీలపై చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. పరిహారం విషయంలోనూ రైతులు ప్రస్తుత విధానం పట్ల విముఖతతో ఉన్నారు. ఎపుడైనా నాసిరకం విత్తనాల వల్ల రైతు నష్టపోతే పెట్టిన పెట్టుబడిని పరిహారంగా ఇస్తున్నారు.

కానీ ఆ ఏడాది పంటకాలాన్ని, పంటపై వచ్చే అరకొర ఆదాయాన్ని రైతు నష్టపోతున్న విషయాన్ని గమనంలోకి తీసుకోవడం లేదు. ఏ ఏడాదైనా నష్టపోయే రైతుకు ఆ ఏడాది పంట సగటును లెక్కగట్టి పరిహా రాన్ని ఇస్తే ప్రయోజనం ఉంటుందని రైతులంటున్నారు. పరిహారం ఇచ్చే విషయంలోనూ ప్రభుత్వాలు కంపెనీల నుంచి వసూలు చేసే వరకూ ఆగాలని కోరకుండా ముందు ప్రభుత్వమే చెల్లించి ఆ తర్వాత కంపెనీల నుంచి వసూలు చేసేలా నిబంధనలు మార్చాల్సి ఉందని కూడా రైతులు డిమాండ్ చేస్తున్నారు. నష్టపోయిన రైతుకు నిర్ధిష్ట కాలంలోగా పరిహారం అందించాలని నిర్దేశించే స్పష్టమైన క్లాజు ఉండాలని రైతులు కోరు తున్నారు. అయితే ఇటువంటి మార్పులేవీ ఈ కొత్త విత్తన బిల్లులో లేవు.
పోతుకూరు శ్రీనివాసరావు ‘సాక్షి’ స్పెషల్ డెస్క్

విత్తన గ్రామాలకు ఆదిలోనే హంసపాదు!

అన్నదాత ఏటా విత్తన సమస్యతో విలవిలలాడుతుండడంతో వైఎస్ హయాంలో విత్తన గ్రామాలకు అధిక ప్రాధాన్యతనిచ్చారు. అయితే అధికారుల అలసత్వం, అవినీతి కారణంగా ఈ విత్తన గ్రామాలు కాగితాలకే పరిమితమయ్యాయి. విత్తన గ్రామాలు ఫలప్రదంగా సాగితే కంపెనీల ఆటలు చెల్లవు. అందుకే అధికారులతో చేతులు కలిపిన కంపెనీలు వాటిని ఓ పథకం ప్రకారం విఫలం చేశాయని అర్ధమౌతుంది. విత్తన గ్రామం ఎలా రూపొందుతుందంటే… వ్యవసాయ విశ్వవిద్యాలయం తయారు చేసే బ్రీడర్ సీడ్ ఆధారంగా ప్రభుత్వ, ప్రైవేటు విత్తన సంస్థలు ఫౌండేషన్ సీడ్‌ను అభివృద్ధి చేస్తాయి. ఫౌండేషన్ సీడ్‌ను యాభైశాతం సబ్సిడీతో రైతులకు అందజేసి ధ్రువీకృత సీడ్స్‌ను ఉత్పత్తి చేయిస్తారు.

వాటిని రైతులకు విత్తనాలుగా అందజేస్తారు. 2008-09 ఖరీఫ్, రబీ కలసి లక్షా 15 వేల హెక్టార్లలో విత్తనాలను ఉత్పత్తి చేశారు. గత ఏడాది 5.28 లక్షల హెక్టార్లలో విత్తన ఉత్పత్తిని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే ఇవన్నీ కాగితాలపైనే… రైతు బృందాలకు సబ్సిడీ విత్తనం ఇచ్చి విత్తన ఉత్పత్తి చేయిస్తున్నట్లు వ్యవసాయ శాఖ చెబుతున్నా వాస్తవానికి జరుగుతున్నది వేరే. కొద్ది మంది రైతులకు తూతూ మంత్రంగా విత్తనాన్ని అందించి రికార్డుల్లో మాత్రం అనేక మంది రైతుల సర్వే నంబర్లను నమోదు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి.

How we feed us will go to American hands by Shalini Bhutani

http://www.tehelka.com/story_main47.asp?filename=Op231010The_Obama_visit.asp

Pacts favourable to the US may be signed, posing a threat to Indian farmers

THE BUZZ has been growing about US President Barack Obama’s visit to India next month. And yet again before the visit, news is about the possible arms deal, joint military exercises, bilateral trade and investment, rather than what it would mean for India’s food and farming. When George Bush came calling, the nuclear deal hogged the limelight, and the agriculture-related aspects, which have consequences for something as basic as food, didn’t make the headlines.

Farmville Hillary Clinton visits the Indian Agricultural Research Institute, Pusa, in 2009

PHOTO: AFP

This cycle of events sounds like a cruel joke. But the situation is far from funny when it comes to our agriculture. Several laws and policies related to seed, food and farming in India have in the past been made to either facilitate American entry in these sectors or forge so-called US-India ‘partnerships’ in agri R&D and trade. Control over these sectors in other countries has strategically been core to American foreign policies. Also, agri exports are a big part of Obama’s economic recovery plan. So, his visit will yet again be marked by decisions, which will have implications for Indian agriculture.

It is useful to recall history here. In 1960, it was by an Act of Parliament that India’s first agricultural university, Pantnagar University (now the Gobind Ballabh Pant University of Agriculture), was set up with US assistance. It is here that the so-called Green Revolution was started, the ill-effects of which are only being fully understood now. And ever since, right up to the introduction of American company Monsanto’s now infamous Bt brinjal, public sector agriculture research institutes are being used as base stations from which the American interests springboard into the Indian landscape. And in the process — from seed, to tractors, to processing, to retailing — American companies such as Cargill, Walmart and Monsanto have got more than a foothold in India.

India’s agriculture legislations are also beginning to mirror elements from the US. Some come in via the route of the US-led multilateral system, the World Trade Organisation (WTO). On Intellectual Property Rights (IPR), the US took India to the dispute settlement body of the WTO for non-compliance of IPR obligations. Yet, despite amendments to the Indian patent law, it is still not good enough for the US-India Business Council and American lifescience corporations. Bilateral trade relations also come with prescriptions for legal and policy changes. The legal makeover of India continues.

Another American clone under consideration is India’s version of the Bayh-Dole Act — the Protection and Utilisation of Public Funded Intellectual Property Bill, 2008. This advocates for IPR for agricultural scientists and research institutions. Meanwhile, the controversial Biotechnology Regulatory Authority of India Bill, 2010, is waiting to resurface in Parliament. This will easily facilitate the clearance of genetic engineering for application on our seed, feed, food and livestock. Through its South Asia Biosafety Programme, the USAID gives funds for biotechnology policy formulation for countries such as India and Bangladesh. The US is the birthplace of biotech giants and American agencies are scouting worldwide to create markets for their products.

So, a visit by an American bigwig almost always leaves Indian agriculture in trouble. It points to more changes before or after the trip. In 2005, before the Bush visit, a US-India Trade Policy Forum (TPF) was set up. One of its five sub-divisions is the Agricultural Trade Group whose key objectives include facilitating export of Indian mangoes to the US. Aren’t we better off eating them in Asia, thereby reducing food miles in an already climate- and energy-challenged planet? And what India gets in return, through another Non-Tariff Barriers group under the TPF, are more insecticides manufactured in the US. And, the Indian government agreeing to cut regulations on buying and selling of carbonated drinks, which mean colas. More poison for our land, water and health.

During the Bush visit in 2006, India was signed up for a US-India Knowledge Initiative in agriculture education, teaching, research, service and commercial linkages. It is run by a board including American giants such as ADM, Monsanto and Walmart. In July 2009, Hillary Clinton visited the Indian Agricultural Research Institute at Pusa, where she unequivocally sounded her commitment to see through policy changes in our agriculture sector, which are favourable to American firms. At that time, the countries signed a bilateral pact on agriculture.

The US is the birthplace of biotech giants and American agencies are scouting worldwide to create markets for their products

Philanthrocapitalist Bill Gates, who backs agricultural biotechnology, visited India recently and made headlines by ‘adopting’ a village in Bihar. Soon, there was a report that the Borlaug Institute for South Asia is being set up in Bihar to unleash a second Green Revolution in the region. Could there be any connections there? After all, the Bill and Melinda Gates Foundation funds two major global agriculture initiatives: the first is on rice research that pushes GM and hybrid varieties. Second, it has pumped dollars into the Alliance for the Green Revolution in Africa. This will create a market for US seeds, pesticides and proprietary technologies. It has already spent a lot for India’s ‘poor farmers’ to modernise farming methods and link them to the global market.

AS A run-up to the US-India Strategic Dialogue in June, top officials held a series of meetings, including one on agriculture. But India doesn’t need that level of interaction with the US. In agriculture, a diversity of local alternatives do exist. The current food crisis, despite the grains rotting in FCI godowns, amply shows there is no shortage of foodgrain production. Therefore, there is no justification for new proprietary agricultural technologies to be brought in from the US. The move away from traditional methods of farming to the industrial agriculture and modern food production that the US prescribes, in effect, hugely adds to the climate crisis and creates unequal wealth.

There is no shortage of foodgrain production. Therefore, there is no justification for new technologies to be brought in from the US

There are several local initiatives that point to the way forward. For instance, dryland millet-based mixed farming practices, livestock integrated farming, safeguarding uncultivated agro-biodiversity, non-pesticide management agriculture and the time-tested natural farming or ‘rishi kheti’. Indian farming has its own solutions. The obstacles are not technical but political.

India does not need its food menu to be written by the US. And irrespective of what Obama’s speechwriter pens down for his parliamentary address, any word on democracies will be meaningless if his visit leaves India as a less self-defining nation, which no longer chooses how and what it feeds its own. The link between arms and alms is not as distant as it may seem.